E-Paper
Advertisement

‘ఎవరి జాగీరని ఫొటోలు పెట్టుకుంటున్నారు?’ రేవంత్ సర్కార్‌పై అర్వింద్ ఫైర్!

‘ఎవరి జాగీరని ఫొటోలు పెట్టుకుంటున్నారు?’  రేవంత్ సర్కార్‌పై అర్వింద్ ఫైర్!
Advertisement

Dharmapuri Arvind: బ్యూరో స్వేచ్ఛ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నారని, అయితే అందులో సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ ఫొటో పెడుతున్నారని, అయితే ఉత్తమ్.. బీఆర్ఎస్ మనిషి అని సీఎం రేవంత్ రెడ్డి ముందుగా అర్థం చేసుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

చిన్న సీఎం.. సన్న బియ్యం, స్మార్ట్ కార్డు ప్రోగ్రామ్

Advertisement

చిన్న సీఎం.. సన్న బియ్యం, స్మార్ట్ కార్డు ప్రోగ్రామ్ పెడుతున్నారని చురకలంటించారు. స్మార్ట్ కార్డుపై ఎవరయ్య జాగీరని వారి ఫొటోలు పెడుతున్నారని ప్రశ్నించారు. గతంలో, ఇప్పుడూ.. బియ్యాన్ని కేంద్రమే అందిస్తోందన్నారు. కానీ మోడీ, కేంద్ర మంత్రి ఫొటో లేకుండా వీరి ఫొటోలు పెట్టుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది డ్రామా కంపెనీలా మారిందని ఫైరయ్యారు. అప్పుడు కేసీఆర్ అదే చేశాడని, కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని అర్వింద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు. తాము అడక్కోవట్లేదని, ప్రోటోకాల్ ప్రకారం పెట్టకపోతే పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరని, ఇలాంటి ఆటిట్యూడ్ మంచిది కాదని అర్వింద్ సూచించారు.

స్మార్ట్ కార్డుపై మోడీ ఫొటోతో పాటు..

Advertisement

ఇలాంటి ఆటిట్యూడ్ తోనే కాళేశ్వరానికి అలాంటి పరిస్థితి వచ్చిందని వివరించారు. సీఎం తప్పిదాల వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. సీఎం, మంత్రులకు అంత దురద ఉంటే.. స్మార్ట్ కార్డుపై మోడీ ఫొటోతో పాటు, వారి ఫొటో చిన్నగా పెట్టుకోవాలని సూచించారు. సీఎం.. చిల్లర దందాలు చేసి తెలంగాణ ప్రజలకు నష్టం చేయవద్దని సూచించారు. నిజామాబాద్ లో పసుపు రూ.23,907కు టచ్ అయిందని, చిత్తశుద్ధితో కమిషన్ తీసుకోకుండా పనిచేస్తే ఫలితాలు ఇలా ఉంటాయని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి పసుపు అమ్ముకోవడానికి నిజామాబాద్ తెస్తున్నారన్నారు. గుజరాత్ నుంచి ట్రేడర్లు నిజామాబాద్ మార్కెట్ కి వస్తున్నారని, రైతులకు, ట్రేడర్లకు ఎగుమతుల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయని అర్వింద్ తెలిపారు. నిర్మల్ నుంచి పసుపు నేరుగా జర్మనీకి వెళ్తోందన్నారు.

మహేష్ గౌడ్‌కు దమ్ముంటే కౌన్సిలర్‌గా గెలవాలి..

రేవంత్ కి చెంచాగిరి చేసినందుకు మహేష్ గౌడ్ కి పీసీసీ పోస్ట్ ఇచ్చారని అర్వంద్ చురకలంటించారు. మహేష్ గౌడ్ కు దమ్ముంటే కౌన్సిలర్, లేదా కార్పోరేటర్ గా అయినా గెలవాలని సవాల్ విసిరారు. నిజామాబాద్ లో 28 వార్డుల్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఒకే అని, అవసరమైతే ఆయన పోటీ చేసేందుకు తమ కార్పొరేటర్ ను రాజీనామా చేయిస్తానని సవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీష్ రావు పొడవు పెరిగారని, కానీ ఆయన మెదడు ఎటు పోతోందని అర్వింద్ ప్రవ్నించాఉ. కాళేశ్వరం నీళ్ళు ఎటు పోతున్నాయో ఆయనకు తెలియదని చురకలంటించారు. రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం, ఫీజు రీయింబర్స్ మెంట్, హౌసింగ్ గురించి మాట్లాడే హక్కు కేటీఆర్ కు లేదని, దాని గురించి ఆయన మాట్లాడుకుంటేనే బెటర్ అని పేర్కొన్నారు. వాటి గురించి మాట్లాడితే.. ప్రజలు తొక్కితే పాతాళంలోకి పోతారని హెచ్చరించారు.

Also Read: ఎంఐఎం కోటలో వందేమాతరం సమరం.. దమ్ముంటే అడ్డుకోండి! బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్!

Tags

Related News

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

Big Stories

Advertisement
×