Sridevi Birth Anniversary:అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి (Sridevi) గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతో, నటనతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. శిల్పి చెక్కిన బొమ్మలా ఎంతో మందిని కట్టిపడేసింది.. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలే కాదు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూడా ఈమెతో టైం స్పెండ్ చేయాలని భావించేవారట. అంతలా పాపులారిటీ అందుకున్న శ్రీదేవి.. అకస్మాత్తుగా బాత్ టబ్ లో లో పడి మరణించిన విషయం ఎవరు అంత త్వరగా మరిచిపోలేరు. నిజానికి ఈమె హార్ట్ ఎటాక్ తో చనిపోయిందని చెప్పినా.. పోస్ట్మార్టం రిపోర్ట్ లో ఆమె చనిపోయే ముందు ఆమెకు ఎటువంటి హార్ట్ ఎటాక్ రాలేదు అని వైద్యులు తెలియజేశారు. దీంతో ఈమె మరణంపై ఇప్పటికీ పలు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
శ్రీదేవి ఆస్తుల విలువ..
ఇకపోతే ఈరోజు శ్రీదేవి జయంతి.. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈమె ఎంత ఆస్తి సంపాదించింది? ఆ ఆస్తులు ఎవరికి ఇచ్చింది? అనే విషయాలు వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీదేవి.. ఎన్టీఆర్(NTR), ఏఎన్నార్(ANR), చిరంజీవి(Chiranjeevi), నాగార్జున(Nagarjuna ).వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకుంది. తెలుగు, తమిళ్ ,మలయాళం, హిందీ, కన్నడ అంటూ భాషతో సంబంధం లేకుండా తన సినీ కెరియర్లో దాదాపు 300కు పైగా చిత్రాలలో నటించిన ఈమె.. తన సినిమాల ద్వారా సుమారుగా రూ.300 కోట్లు కూడబెట్టినట్లు సమాచారం.
ఒక్క బంగ్లా విలువే అన్ని కోట్లా..
ఇకపోతే శ్రీదేవి బ్రతికున్నప్పుడు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులుగా పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. లక్స్, తనిష్క లాంటి బ్రాండ్లకు ప్రచారాలు చేసి మంచి ఆదాయాన్ని అందుకుంది. ఇక శ్రీదేవి బోనీకపూర్ (Boney Kapoor) ను వివాహం చేసుకున్న తర్వాత.. గతంలో ముంబైలో అందేరి ప్రాంతంలో ఒక భవనాన్ని కొనుగోలు చేశారు. దీని విలువ సుమారుగా రూ.220 కోట్లు ఉంటుందని సమాచారం.
సొంత ఆస్తులతో పాటు తండ్రి నుంచి కూడా ఆస్తులు..
ఇక ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి సుమారుగా రూ.2 కోట్లు విలువచేసే బెంట్లీ కారు కూడా కొనుగోలు చేసింది. దీంతోపాటు వివిధ కార్లు కూడా ఈమె కార్ గ్యారేజ్ లో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ కార్ల విలువ రూ.10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.. ఇక మరొకవైపు తండ్రి నుండి సంక్రమించిన ఆస్తులలో.. ఈమె పేరు మీద రూ.620 కోట్ల విలువ చేసే బంగ్లాలు ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
ఆస్తులను కూతుర్లకు సమానంగా పంచిన శ్రీదేవి..
ఇక శ్రీదేవి తన ఆస్తులు అన్నింటినీ తన కూతుర్లైన జాన్వీ కపూర్ (Janhvi kapoor), ఖుషి కపూర్ (Kushi kapoor) ఇద్దరికీ సమానంగా పంచినట్లు సమాచారం. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే ఇటు టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. అటు ఖుషి కపూర్ కూడా ఈమధ్య బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.
also read:Betting App Case: ఈ రోజు మంచు లక్ష్మీ వంతు… విచారణపై ఉత్కంఠ!