E-Paper
Advertisement

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్
Advertisement

Fantasy Comedy Series: ప్రపంచం అంతమయ్యే సమయం దగ్గరపడింది… స్వర్గం, నరకం తమ సైన్యాలను యుద్ధానికి సిద్ధం చేస్తున్నాయి. ఫోర్ హార్స్‌మెన్ ఆఫ్ ది అపోకలిప్స్ కూడా రంగంలోకి దిగబోతున్నారు. కానీ ఈ విధ్వంసానికి కారణం కావాల్సిన యాంటీక్రైస్ట్ మాత్రం కనిపించకుండా పోతాడు. ప్రపంచాన్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రం ఊహించని విధంగా ఓ ఏంజెల్, ఓ డెమన్‌పై పడుతుంది. స్వర్గం, నరకం శత్రువులైనా… భూమిపై ఏర్పడిన అనుబంధం వాళ్లిద్దరినీ కలిసి పని చేసేలా చేస్తే ? ఇదే ఫాంటసీ కామెడీ సిరీస్  ‘గుడ్ ఓమెన్స్’ (Good Omens). మరి ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ అంటే…

కథలోకి వెళ్తే…

అజిరాఫేల్ స్వర్గానికి చెందిన ఏంజెల్. క్రౌలీ నరకానికి చెందిన డెమన్. ఇద్దరూ సిద్ధాంతపరంగా ఒకరికి ఒకరు పూర్తిగా వ్యతిరేకం. కానీ వేల ఏళ్లుగా భూమిపై తిరుగుతూ జీవించడం వల్ల వాళ్ల మధ్య ఊహించని స్నేహం ఏర్పడుతుంది. భూమిపై ఉన్న ఆహారం, పుస్తకాలు, జీవన విధానం… ఇలా ఇద్దరికీ ఈ ప్రపంచంపై ప్రత్యేకమైన ఇష్టం పెరుగుతుంది. అందుకే భూమి నాశనం కానుందనే విషయం తెలిసినప్పుడు వాళ్లిద్దరికీ అది అంత సులభంగా అంగీకరించలేని విషయంగా మారుతుంది.

Advertisement

ప్రపంచ అంతానికి దైవ ప్రణాళిక సిద్ధమై ఉంటుంది. స్వర్గం, నరకం తమ సైన్యాలను సిద్ధం చేసుకుంటాయి. ఫోర్ హార్స్‌మెన్ ఆఫ్ ది అపోకలిప్స్ కూడా తిరిగి రావడానికి సమయం దగ్గర పడుతుంది. ఈ మొత్తం ప్రక్రియకు కేంద్రంగా ఉండాల్సిన యాంటీక్రైస్ట్ మాత్రం ఓ సమస్యగా మారతాడు. అతడిని సరైన కుటుంబానికి అప్పగించాల్సిన సమయంలో జరిగిన పొరపాటు కారణంగా అసలు యాంటీక్రైస్ట్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.

ఆ యాంటీక్రైస్ట్‌నే వెతకడానికి అజిరాఫేల్, క్రౌలీ కలిసి రంగంలోకి దిగుతారు. వారి అన్వేషణ చివరకు ఆడమ్ యంగ్ అనే 11 ఏళ్ల బాలుడి దగ్గరకు చేరుతుంది. సాధారణంగా పెరుగుతున్నట్టుగా కనిపించే ఆడమ్‌ లో మాత్రం తనకు తెలియకుండానే ప్రపంచాన్ని మార్చగల శక్తులు మేల్కొంటుంటాయి. అతడికి తన అసలు గుర్తింపు, తన చుట్టూ జరుగుతున్న పరిణామాల గురించి ఏమీ తెలియదు.

Advertisement

మరోవైపు ఆడమ్ చుట్టూ ఉన్న స్నేహితులు, అనాథెమా డివైస్, న్యూటన్ పల్సిఫర్ వంటి పాత్రలు కూడా ఈ గందరగోళంలోకి వస్తాయి. అజిరాఫేల్, క్రౌలీ తమ తమ వర్గాల ఆదేశాలను పక్కనపెట్టి ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే.. స్వర్గం, నరకం మాత్రం అపోకలిప్స్‌ను ఆపే ఆలోచనలో ఉండవు. దీంతో ఇద్దరి స్నేహం మరింత ప్రమాదకరమైన స్థాయికి చేరుతుంది.

అసలు ఆడమ్‌ నే యాంటీక్రైస్ట్ అని ఎలా గుర్తిస్తారు ? అతడిలోని శక్తులు పూర్తిగా మేల్కొంటే ప్రపంచానికి ఏం జరుగుతుంది ? స్వర్గం, నరకం సైన్యాలు భూమిపైకి వచ్చినప్పుడు అజిరాఫేల్, క్రౌలీ ఆపగలరా ? తమ సొంత వర్గాలకు వ్యతిరేకంగా వెళ్లిన ఈ ఏంజెల్, డెమన్ చివరకు ప్రపంచాన్ని రక్షించగలరా ? లేక దైవ ప్రణాళిక ప్రకారం అపోకలిప్స్ జరిగిపోతుందా ? అనేదే ‘గుడ్ ఓమెన్స్’లోని ఫాంటసీ కామెడీలో చూడాల్సిన కథ.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు ?

మైఖేల్ షీన్ (Michael Sheen), డేవిడ్ టెన్నాంట్ (David Tennant), జోన్ హామ్ (Jon Hamm), అడ్రియా అర్జోనా (Adria Arjona) తదితరులు నటించిన ఈ ఫాంటసీ కామెడీ సిరీస్‌ ‘గుడ్ ఓమెన్స్’. డగ్లస్ మెకిన్నన్ (Douglas Mackinnon) దర్శకత్వం వహించారు. మొదటి సీజన్ 2019లో విడుదలై ఆరు ఎపిసోడ్లుగా వచ్చింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో (Amazon Prime video)లో మూడు సీజన్లు ఉన్నాయి. సీజన్ 1, సీజన్ 2లకు తెలుగు ఆడియోతో పాటు తెలుగు సబ్‌టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే సీజన్ 3 మాత్రం తెలుగు ఆడియో లేదా తెలుగు సబ్‌టైటిల్స్ కనిపించడం లేదు.

Read Also: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్వతారోహణ… గుండె జారిపోయే అడ్వెంచర్

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×