E-Paper
Advertisement

‘బ్లడీ రోమియో’గా నాని..లుక్ టెస్ట్ పూర్తి.. అదిరిపోయిన లుక్

‘బ్లడీ రోమియో’గా నాని..లుక్ టెస్ట్ పూర్తి.. అదిరిపోయిన లుక్
Advertisement

Nani Bloody Romeo: నాచురల్ స్టార్ నాని జడల్ జమాన్ పాత్ర నుంచి బయటపడ్డారని తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన  ది ప్యారడైజ్(The Paradise) సినిమా విడుదల కావడంతో నాని తన తదుపరి సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని తెలుస్తుంది. నాని తన తదుపరి చిత్రాన్ని ఓజీ డైరెక్టర్ సుజిత్ (Sujeeth)దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమాను అధికారక ప్రకటన తెలియచేయడమే కాకుండా పూజ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.

లుక్ టెస్ట్ పూర్తి చేసుకున్న నాని..

ఈ సినిమా షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తాజాగా నాని పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ పూర్తి అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా లుక్ టెస్ట్‌లో నాని సరికొత్త హెయిర్‌స్టైల్, స్టైలిష్ స్పెక్స్ ధరించి ట్రెండీ, క్లాసీ అండ్ చామింగ్ అవతార్‌లోకి మారారు. నాని కెరీర్‌లోనే ఇప్పటివరకు చూడని సరికొత్త గ్యాంగ్‌స్టర్ లుక్‌లో ఈ సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు కామెడీ కూడా ఉండబోతుందని సమాచారం. ఈ భారీ యాక్షన్ డ్రామాను వెంకట్ బోయన పల్లి,నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

హీరోయిన్ పాత్రలో మీనాక్షి చౌదరి..

Advertisement

ఇలా నాని గ్యాంగ్స్టర్ పాత్రలో ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాలో హీరోయిన్ గా ఎవరు సందడి చేయబోతున్నారనే విషయాలపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary) ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది తెలియాలి అంటే అధికారక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఈ సినిమా దసరా సందర్భంగా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

Advertisement

నాని ది ప్యారడైజ్ సినిమా తరువాత వస్తున్న ఈ సినిమా కూడా యాక్షన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా అనంతరం నాని తిరిగి ప్రేమ కథ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. నాని ప్రేమకథ సినిమాలలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఈయన ప్రయోగాత్మక సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమాలేవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాని తిరిగి ప్రేమ కథ సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా తర్వాత సుజిత్ బ్లడీ రోమియో పనులలో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఓజీ 2 మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: సత్య సాయిబాబా బయోపిక్ సినిమా చేయాలని ఉంది..కానీ: విజయ్ దేవరకొండ

Related News

సత్య సాయిబాబా బయోపిక్ సినిమా చేయాలని ఉంది..కానీ: విజయ్ దేవరకొండ

నమ్మితే నట్టేట ముంచేశారు.. నిర్మాతకు దిమ్మతిరిగే షాక్!

మిడిల్ క్లాస్‌కు గుడ్ న్యూస్.. విజయ్ దేవరకొండ సినిమాలకు టికెట్ హైక్ ఉండదా?

రణబాలికి రూ. 120 కోట్లు.. అప్పుడే వచ్చిందెంతంటే?

‘రణబాలి’ ట్రైలర్ పై నారా లోకేష్ ఆసక్తికర పోస్ట్.. !

లగ్జరీ కారు కొన్న ప్రేమలు హీరో.. ఖరీదు ఎంతంటే?

శ్రీ విష్ణులో ఇంత టాలెంటా? హీరో కాకపోయి ఉంటే?

Big Stories

Advertisement
×