E-Paper
Advertisement

అప్పుడే OTT లోకి సూర్య ‘కరుప్పు’.. ఎందులో చూడాలంటే..

అప్పుడే OTT లోకి సూర్య ‘కరుప్పు’.. ఎందులో చూడాలంటే..
Advertisement

Karuppu OTT : ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న సూర్య బాక్సాఫీస్ దాహాన్ని… కాదు కాదు,ఓవరాల్ గా కోలీవుడ్ దాహన్నే కరుప్పు తీర్చినట్టు కనిపిస్తుంది.ఈ ఏడాది ఇప్పటివరకు ఏ తమిళ సినిమా కూడా సాలిడ్ హిట్ చూళ్ళేదు మరి.మొత్తానికి అంచనాలను తారుమారు చేస్తూ, కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను అందుకున్న ఈ చిత్రం, క్లీన్ సూపర్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది.

ఇక తెలుగులోనూ ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైన ఈ చిత్రం, ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ ను సాధించి సూపర్ హిట్‌గా నిలవడం విశేషం.ఇక ఈ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సంబంధించిన ఓటీటీ అప్‌డేట్ కోసం అప్పుడే కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.

Advertisement

నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 35 కోట్ల రూపాయలకు

ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 35 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని సమాచారం. కేవలం తమిళంలోనే కాకుండా, తెలుగుతో పాటు అన్ని ప్రధాన ప్రాంతీయ భాషల్లోనూ ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నారు. మేకర్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, థియేటర్లలో విడుదలైన 4 వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి రావాలి. ఈ లెక్కన చూస్తే, జూన్ రెండో వారంలో ‘కరుప్పు’ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న మాట.

Advertisement

Also read :మెగా 158′ అఫీషియల్ లాంచ్.. అతిథులుగా రానున్న పవన్ కళ్యాణ్, రామ్ చరణ్

ప్రస్తుతం 5 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 162 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని లెక్కలేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ వీకెండ్‌తో 200 కోట్ల గ్రాస్ మార్కును కూడా ఈ సినిమా సునాయాసంగా అందుకోబోతున్నట్టే కనిపిస్తుంది. మొత్తంగా ఫుల్ రన్‌లో ఈ చిత్రం 300 కోట్ల మార్కును అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తమిళ ఇండస్ట్రీకి కావాల్సిన పెద్ద బూస్టప్

సినిమా బాక్సాఫీస్ వద్ద ఇరగదీస్తున్నప్పటికీ, ప్రేక్షకుల్లో మాత్రం డివైడ్ టాక్  కనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని అందరూ ఆకాశానికి ఎత్తేస్తుంటే,సెకండ్ హాఫ్ కథనం అస్సలు నచ్చలేదని కామెంట్స్ చేస్తున్నారు చాలా మంది నెటిజన్లు. థియేటర్ల వద్ద ఇలాంటి మిక్స్డ్ రియాక్షన్స్ రాగా, ఓటీటీలో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో లేదా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, ప్రస్తుతం ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద తన ఇంపాక్ట్ చూపుతూ, తమిళ ఇండస్ట్రీకి కావాల్సిన పెద్ద బూస్ట్ ను అయితే ఖచ్చితంగా ఇచ్చిందనే చెప్పాలి.

Also read :‘డ్రాగన్’లో ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరుకు అంత అర్థం ఉందా? షాకింగ్ డీటెయిల్స్!

Related News

‘టాక్సిక్’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. రొమాంటిక్ మోడ్‌లోకి రాకింగ్ స్టార్!

“గెట్ వెల్ సూన్ బాబాయ్” – బాలయ్య ప్రమాదంపై కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్!

షూటింగ్ లో జారిపడ్డ బాలకృష్ణ.. హెల్త్ కండిషన్ పై డైరెక్టర్ గోపీచంద్ క్లారిటీ!

OGకి కొరియన్ కనకరాజుకి ఉన్న కనెక్షన్ ఏంటి?

NBK 111: కాకినాడ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయాలు.. హెల్త్ కండిషన్ పై డాక్టర్ల క్లారిటీ!

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Big Stories

Advertisement
×