Sushmita sen:ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఎక్కువగా తమ వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అలా ఒక్కో విషయాన్ని బయట పెడుతుంటే.. సెలబ్రిటీలే కాదు అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న విషయం తెలిసిందే. అందులో కొంతమంది ఆ వ్యాధులను జయించి సుఖ జీవితాన్ని ఆస్వాదిస్తుంటే.. మరికొంతమంది ఇప్పటికీ ఆ వ్యాధులతో పోరాడుతూనే ఉన్నారు. అలాంటి వారిలో మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ (Sushmita Sen)కూడా ఒకరు.
కెరియర్ పరంగా ఉన్నత శిఖరం.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు..
అసలు మిస్ యూనివర్స్ అనే ఒక కాంపిటీషన్ ఉంటుందని, ఈ పోటీలలో పాల్గొంటే క్రేజ్ ఎలా ఉంటుందో కూడా మొట్టమొదటిసారి భారతదేశంలో పరిచయం చేసిన ఘనత సుస్మితాసేన్ కి సాధ్యమని చెప్పాలి. 1994లో అనగా కేవలం 18 ఏళ్ల వయసులో మనీలాలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డ్ సృష్టించింది. అందం, అభినయం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసం, ప్రతిభ ఆధారంగా సుస్మితాసేన్ కి ఈ ఘనత లభించింది. అలాంటి ఈమె తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న సుస్మితాసేన్..
సుస్మితా సేన్ విషయానికి వస్తే.. కెరియర్ పరంగా ఎంతో ఉన్నత స్థానాన్ని చూసిన ఈమె 2014లో అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి అయిన ఆడిసన్ డిసీజ్ బారిన పడినట్లు తెలిపింది. సుస్మిత కి అడ్రినల్ గ్రంథులు కార్టిసాల్ హార్మోన్ ను ఉత్పత్తి చేయడం ఆపేశాయట. ఇక ఈ హార్మోన్ ను ఉత్పత్తి చేయడం కోసం సుస్మిత ప్రతి 8 గంటలకు ఒకసారి హైడ్రోకార్టిసోన్ అనే స్టెరాయిడ్ తీసుకోవడం తప్పనిసరిగా మారిపోయిందట. ఒకవేళ ఈ స్టెరాయిడ్ తీసుకోవడం మర్చిపోయిందో ఇక ఆమె మృత్యువు ఒడికే అని చెప్పడం నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఈ పరిస్థితిని ఒక బలంగా ఆమె మార్చుకున్నారు. మందులపైనే ఆధారపడకుండా డైలీ యోగ, జిమ్నాస్టిక్, వ్యాయామం ద్వారా శరీరాన్ని బలంగా మార్చుకుంటున్నారు. ఇక ఈమె శ్రమ చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారట అందుకే ఇది ఒక యుద్ధం కానీ నేను నా శరీరానికి ఒక ప్రేమతో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. అదే నాకు మళ్ళీ జీవితాన్ని ఇచ్చింది అంటూ సుస్మితసేన్ తెలిపింది. ఏది ఏమైనా సుస్మితా సేన్ కి ఉన్న ఈ వ్యాధి గురించి తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సుస్మితా సేన్ జీవితం..
1975 నవంబర్ 19న హైదరాబాదులో జన్మించింది సుస్మితా సేన్. సెయింట్ ఆన్స్ హై స్కూల్ సికింద్రాబాద్ లో విద్యను అభ్యసించిన ఈమె.. 1994లో విశ్వసుందరిగా కిరీటాన్ని కైవసం చేసుకుంది. కొన్ని హిందీ, తెలుగు , తమిళ్ చిత్రాలలో నటించిన ఈమె..సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా భారీ గుర్తింపును సొంతం చేసుకుంది. 2013లో మదర్ థెరిస్సా అంతర్జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇలా నలుగురికి ఉపయోగపడుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన సుస్మితాసేన్ కి ఇలాంటి వ్యాధి ఉందని తెలిసి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ALSO READ:TFCC Bharath Bhushan: రూల్స్ బ్రేక్‌కి సిద్ధం అయిన TFCC ప్రెసిడెంట్… ఇక తేల్చుకునేది హై కోర్టులోనే