E-Paper
Advertisement

గర్బిణీలు, వృద్దులు బీ కేర్‌ఫుల్.. పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ కీలక సూచనలు!

గర్బిణీలు, వృద్దులు బీ కేర్‌ఫుల్.. పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ కీలక సూచనలు!
Advertisement

Heat Advisory: స్వేచ్ఛ బ్యూరోొ: రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రత్యేకంగా సూచించింది. తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజారోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ బి. రవీందర్ నాయక్ ప్రత్యేక అడ్వైజరీ రిలీజ్ చేశారు. అత్యవసరమైతే తప్పా, మధ్​యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో బయటకు రావొద్దని సూచించారు.

పండ్ల రసాలు..

దాహం వేయకపోయినా సరే, వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగుతూ ఉండాలని కోరారు. ఓఆర్‌ఎస్ లవణాల నీటితో పాటు నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు వంటి ఇంటి పానీయాలను తీసుకోవాలి. పుచ్చకాయ, కర్బూజా, నారింజ, ద్రాక్ష, అనాస, కీరదోస వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే స్థానిక సీజనల్ పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలన్నారు. పల్చని, వదులుగా ఉండే లేత రంగు కాటన్ (నూలు) దుస్తులను ధరించాలి.

Advertisement

Also read: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో టాప్ 10 ర్యాంకర్స్ వీరే..?

తల తిరగడం, శ్వాస వేగంగా..

ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, తువ్వాలు లేదా ఏదైనా సాంప్రదాయ తలపాగాతో తలని కప్పుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు కాలికి చెప్పులు లేదా బూట్లు తప్పనిసరిగా ధరించాలి. ఇళ్లను బాగా గాలి ఆడేలా చల్లగా ఉంచుకోవాలని కోరారు. వికారం, వాంతులు చర్మం వేడిగా, ఎర్రగా మారడం, ఆందోళన, తల తిరగడం, శ్వాస వేగంగా కొట్టుకోవడం, కండరాల బలహీనత వంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Also read: కవిత ఊహించని స్కెచ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు?

Related News

కారు కొనడానికి వచ్చి.. పిస్టల్‌ చూపించి కారుతో ఉడాయించారు!

మూసీ మధ్యలో 3 ఎకరాల భూమి కబ్జా.. వారిపై హైడ్రా సైలెంట్ ఎందుకు?

మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా.. అయితే మీకు గుడ్ న్యూస్!

KTR, హరీష్‌రావులకు గద్దర్ అవార్డులు గ్యారెంటీ.. మాక్ అసెంబ్లీపై మెట్టు సాయికుమార్ సెటైర్లు!

కోదాడ మెగా జాబ్ మేళా.. 300 కంపెనీలు, 4 వేల ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

బీసీ కులగణన పేరుతో కేంద్రం మోసం.. డేంజర్‌ జోన్‌లో ఆ రెండు కులాలు..?

నాగార్జునసాగర్‌లో 200 టీఎంసీల నీరు మాయం.. సర్కార్ పై జగదీశ్వర్ రెడ్డి ఫైర్!

ఇంద్రవెల్లి వేదికగా కవిత బిగ్ స్కెచ్.. అక్టోబర్‌లో భారీ బహిరంగ సభ!

Big Stories

Advertisement
×