E-Paper
Advertisement

టీమిండియా మ్యాచ్ లు వీడియో గేమ్ లాగా త‌యార‌య్యాయి..సిక్సుల వ‌ర్షమే

టీమిండియా మ్యాచ్ లు వీడియో గేమ్ లాగా త‌యార‌య్యాయి..సిక్సుల వ‌ర్షమే
Advertisement

Abdul Razzaq On IND VS WI:  టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( Team India vs. West Indies) మధ్య ప్రస్తుతం జరుగుతున్న టి20 సిరీస్ నేపథ్యంలో భారీ స్కోర్లు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్ లోనూ 500కు పైగా పరుగులు నమోదు అవ్వడం చూస్తున్నాం. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు అబ్దుల్ రజాక్ (Abdul Razzaq On IND VS WI) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ వీడియో గేమ్ లాగా మారిపోయిందని పరువు తీశాడు. టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ సిరీస్ లోను ఇదే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.

పోటా పోటీగా ఇరు జట్ల క్రికెటర్లు సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఫ్లాట్ మైదానాలు ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొందని హేళన చేస్తూ మాట్లాడారు. వీడియో గేమ్ లాగా సిక్సర్లు, బౌండరీలు కొడుతున్నారని ఇది కేవలం టీమిండియా ప్లేయర్లకు మాత్రమే సాధ్యం అంటూ సెటైర్లు పేల్చారు. దీంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పై అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

టీమిండియా మ్యాచ్ లు వీడియో గేమ్ లాగా త‌యార‌య్యాయి

Advertisement

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య భారీ స్కోరు నమోదు అవుతున్న క్రమంలో పాకిస్తాన్ సోషల్ మీడియా ట్రోలింగ్ మొదలుపెట్టింది. పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న శ్రీలంక వర్సెస్ పాక్ సిరీస్ లో భారీ స్కోర్లు నమోదు కావడం లేదని పేర్కొంటున్న నెటిజెన్స్… కానీ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో పరుగుల వరద పారుతోందని పరువు తీస్తున్నారు. లేటెస్ట్ గా అబ్దుల్ రజాక్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న టి20 సిరీస్ లో పరుగులేమి నమోదు కావడం లేదని… కానీ ఇండియాలో మాత్రం భారీ స్కోర్స్ నమోదు అవుతున్నట్టు బాంబు పేల్చారు. భారత దేశ వ్యాప్తంగా ఫ్లాట్ మైదానాలు ఏర్పాటు చేశారని… దీంతో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చాలా భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్నారని వివరించారు. ఫ్లాట్ మైదానాల కారణంగా బంతులు అన్ని బ్యాట్ పైకి వస్తున్నాయని పేర్కొన్నారు.

దీంతో టీమిండియా ఆటగాళ్లు దాన్ని వినియోగించుకొని ఇరగదీస్తున్నారని వెల్లడించారు. ఈ ఫ్లాట్ మైదానాలకే టీమిండియా అలవాటైతే… భవిష్యత్తులో రాణించడం కష్టమేనని హెచ్చరించారు. 2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా దక్షిణాఫ్రికా గడ్డపై ఫ్లాట్ మైదానాలు ఉండబోవు అని పేర్కొన్నారు. అక్కడ టీమ్ ఇండియా ఆటలు సాగబోవు అని హెచ్చరించారు. ఇప్పటికైనా ఫ్లాట్ ట్రాక్స్ మర్చిపోయి… బౌలింగ్ పిచ్ లను తయారు చేసుకోవాలని బీసీసీఐకి సూచనలు చేశారు అబ్దుల్ రజాక్.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

Related News

అందరూ ద‌ద్ద‌మ్మ‌లే.. ప‌ర్స‌న‌ల్ రికార్డుల కోస‌మే ఆడి, పాకిస్తాన్ కొంప‌ముంచుతున్నారు

గంభీర్, శ్రేయాస్ అయ్య‌ర్ మ‌ధ్య విభేదాలు…న‌మ‌న్ ధీర్ వ‌ద్దేవద్దంటూ గొడ‌వ‌ !

స్కూల్ కు వెళ్లే పిల్లాడివా? తిల‌క్ వ‌ర్మ ర‌నౌట్ పై సునీల్ గ‌వాస్క‌ర్ ఫైర్‌

మాజీ క్రికెటర్ల అల్లుళ్లు, రాజకీయ నాయకుల కొడుకులతో పాకిస్తాన్ కంపుకొడుతోంది

తిల‌క్ వ‌ర్మ వివాద‌స్ప‌ద ర‌నౌట్…విండీస్ పై టీమిండియా బిగ్ విక్ట‌రీ

శ్రేయస్ అయ్య‌ర్ వికెట్ పై వివాదం…క‌న్నీళ్లు పెట్టుకున్న లేడీ ఫ్యాన్

ఢిల్లీ న‌డిబోడ్డున టీమిండియాను ఓడిస్తాం…బీసీసీఐ కుట్ర‌లు బ‌య‌ట పెడ‌తాం!

Big Stories

Advertisement
×