E-Paper
Advertisement

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌.. మంత్రులకు వార్నింగ్‌!

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌.. మంత్రులకు వార్నింగ్‌!
Advertisement

Congress High Command: స్వేచ్ఛ బ్యూరో: రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కాంగ్రెస్ అధిష్టానం కత్తిమీద సాములాంటి వ్యూహాన్ని అమలు చేస్తోంది. అభ్యర్థులను గెలిపించే పూర్తి స్థాయి బాధ్యతలను మంత్రులకే అప్పగించింది. క్షేత్రస్థాయిలో ఉన్న విభేదాలను పక్కనపెట్టి శ్రమించాలని అధిష్టానం స్పష్టంగా చెప్పింది. తాజాగా నిర్వహించిన అత్యవసర టెలికాన్ఫరెన్స్‌లో ఏఐసీసీ అగ్రనేతలు.. రాష్ట్ర మంత్రులు, కీలక నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

గ్రూపు రాజకీయాలకు చెక్‌..

Advertisement

సొంత ఎజెండాలు, వ్యక్తిగత గ్యాప్‌లు (విభేదాలు) పక్కన పెట్టి ,పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచించింది.. గత కొన్ని రోజులుగా మంత్రుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం క్షేత్రస్థాయి కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నాయని అధిష్టానం భావిస్తోంది. గ్రూపు రాజకీయాల వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన హైకమాండ్, మంత్రులను నేరుగా జవాబుదారీ చేస్తూ కఠినంగా వ్యవహరించింది.

రెండు స్థానాల్లో విజయానికి తీవ్ర పాట్లు..

Advertisement

త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో గెలుపు కోసం పార్టీ నాయకత్వం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అంతేగాక ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో దాదాపు 60 శాతానికి పైగా అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండడంతో పార్టీ ప్రయారిటీగా తీసుకున్నది. ఈ రెండు స్థానాలు గెలిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సునాయాసంగా మారుతుందనేది అగ్ర నేతల భావన. ఈ నేపథ్యంలోనే రెండు నియోజకవర్గాల్లోనూ ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృత స్థాయి ప్రచార ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక్కో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానానికి ఇద్దరు, ముగ్గురు మంత్రులను ఇన్‌ఛార్జులుగా నియమించారు. నియోజక వర్గాల్లోనే అత్యధికంగా బస చేస్తూ ప్రచారం నడిపించాలని ఆదేశించారు. ఇక సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. మంత్రులు ,ఎమ్మెల్యేలు మధ్య ఉన్న పాత విభేదాలు, ఆధిపత్య పోరు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపకూడదని అధిష్టానం స్పష్టం చేసింది. మంత్రులంతా కలసి కట్టుగా ప్రచారంలో పాల్గొనాలని, ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. అంతేగాక బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసి రోజువారీ నివేదికలు ఏఐసీసీకి పంపేలా ఏర్పాట్లు చేశారు.

ఫలితాలే ప్రామాణికం..

ఈ ఉపఎన్నికల ఫలితాలే మంత్రుల పనితీరుకు నిదర్శనమని, గెలుపోటముల బాధ్యత పూర్తిగా మంత్రులదేనని అధిష్టానం తేల్చేసింది. అయితే అధిష్టానం ఇచ్చిన ‘వార్నింగ్’తో రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకు ఉన్న విభేదాలను పక్కనపెట్టి గెలుపే లక్ష్యంగా ప్రచారంలోకి దూకేందుకు సమాయత్తమవుతున్నారు. ఏఐసీసీ సీరియస్ వార్నింగ్ తర్వాతైనా మంత్రులు విభేదాలు వీడి ఐక్యంగా పని చేస్తారా? ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తారా? అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.

Also Read: రొమ్ము క్యాన్సర్ ఈ దశకు చేరితే ఏం జరుగుతుంది? ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే!

Tags

Related News

సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. సీజేఐకి రాసిన లేఖలో రాహుల్ గాంధీ షాకింగ్ అంశాల ప్రస్తావన!

క్యాన్సర్ మందులపై కేంద్రం కీలక నిర్ణయం.. మార్జిన్ 30 శాతానికి కట్!

నోటీసులు లేకుండానే ఓట్లు తొలగిస్తారా? సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలి!- కూనంనేని

రాహుల్ గాంధీ బృందాన్ని కలవని సీజేఐ.. కోర్టు పరిధిలోని అంశాలపై చర్చకు నో!

కోలుకున్న భారత రూపాయి విలువ.. ఆర్‌బీఐ సంచలన నిర్ణయం?

బిహార్ ఓటర్ల జాబితా వివాదం.. ఈసీకి బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు!

ఢిల్లీలో కదంతొక్కిన ఇండియా కూటమి.. సుప్రీంకోర్టు వరకూ భారీ ర్యాలీ.. కిక్కిరిసిన రోడ్లు!

Big Stories

Advertisement
×