E-Paper
Advertisement

నాకు ఎలాంటి రోగం లేదు..తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దన్న కమెడియన్!

నాకు ఎలాంటి రోగం లేదు..తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దన్న కమెడియన్!
Advertisement

Gautham Raju: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతోమంది ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా టాలీవుడ్ సినిమాలలో కమెడియన్ గా గుర్తింపు పొందిన వారిలో సీనియర్ నటుడు గౌతమ్ రాజు(Gautham Raju) ఒకరు. కొన్ని వందల సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన పలు బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి సందడి చేశారు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన గౌతమ్ రాజు ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటలు కొద్ది రోజులపాటు మీడియా కంటికి కనిపించకపోయినా, సోషల్ మీడియాలో సందడి చేయకపోయినా వారిని చంపేస్తున్న సంగతి తెలిసిందే.

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటూ తప్పుడు వార్తలు..

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు యాక్టివ్  కనిపించకపోతే వారు చనిపోయారు అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం లేదా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు అంటూ వార్తలను ప్రచారం చేస్తుంటారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు మేము చనిపోలేదని బ్రతికే ఉన్నామంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా నటుడు గౌతమ్ రాజు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సోషల్ మీడియాలో గౌతమ్ రాజు కిడ్నీ వ్యాధి(Kidney Health Issues)తో బాధపడుతున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారడంతో ఈ తప్పుడు వార్తలపై గౌతమ్ రాజు స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.

వందల సినిమాలలో నటించిన గౌతమ్ రాజు..

Advertisement

ఈ విధంగా గౌతమ్ రాజు తన గురించి వస్తున్న తప్పుడు వార్తల పట్ల స్పందిస్తూ.. ఇటీవల కాలంలో తాను ఎలాంటి ఇంటర్వ్యూలలో పాల్గొనలేదు కానీ ఒక సోషల్ మీడియా అకౌంట్లో మాత్రం తన గురించి తప్పుడు వార్తలు రాశారని గౌతమ్ రాజు తెలిపారు. తాను కొన్ని వందల సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు లేని సినిమాలలో నటించాను అంటూ వార్తలు రాశారు. తాను ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాననే విషయాన్ని ఈయన గుర్తు చేశారు. ఇలా తన సినిమాల గురించే కాకుండా చివరిలో తన అనారోగ్య సమస్యల గురించి కూడా వార్తలు రాయడం బాధగా అనిపించిందని తెలిపారు.

Advertisement

తాను కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాను అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని నాకు ఏవిధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేవని ఈ సందర్భంగా గౌతమ్ రాజు క్లారిటీ ఇచ్చారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరు కూడా ప్రచారం చేయొద్దు అంటూ ఈయన ఈ వీడియో ద్వారా తన పట్ల వస్తున్నటువంటి అసత్య ప్రచారాలను ఖండిస్తూ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుమారు 200 పైగా సినిమాలలో నటించిన ఈయన ఘరానా మొగుడు, కూలి నెంబర్ 1, గబ్బర్ సింగ్, రాజేంద్రుడు గజేంద్రుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు.

Also Read: ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకున్న రణబాలి..రన్ టైం ఎంతంటే?

Related News

కార్తికేయ ‘పర్ణశాల’ నుంచి జిమ్ జిమ్ తారా.. పాట అదిరిందిగా!

తెలుగు సినిమాల్లో దుమ్మురేపిన తెలంగాణ జానపద పాటలు ఇవే!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. జటాయువు పాత్రలో స్టార్ సెలబ్రిటీ!

ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకున్న రణబాలి..రన్ టైం ఎంతంటే?

గీతా గోవిందం, రంగస్థలం వదులుకున్న అనుపమ..కారణం?

300 ఎకరాల్లో ఫిలిం స్టూడియో నిర్మిస్తున్న బడా ప్రొడ్యూసర్స్.. ఎక్కడంటే?

ప్రేమించిన వాడి చేతిలోనే నరకం.. మొన్న అనుపమ.. నేడు?

Big Stories

Advertisement
×