Dance Union vs Federation:తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్ కి ,ఫెడరేషన్ కి మధ్య యుద్ధం తారా స్థాయికి చేరిపోయింది.కొన్ని రోజులుగా డాన్సర్స్ అసోసియేషన్‌లో బైఎలక్షన్స్ నిర్వహించే విషయంలోనే కొంతకాలంగా విభేదాలు నడుస్తున్న సంగతి తెల్సిందే .
ఎన్నికలు వద్దంటూ శేఖర్ మాస్టర్ వర్గం బలంగా వాదిస్తే, అసోసియేషన్ నిబంధనల ప్రకారమే న్నికలు జరిపి తీరాల్సిందే అంటూ జానీ మాస్టర్ వర్గం పట్టుబట్టింది.ఇక గొడవ మరింత ముదిరి జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీయడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది.
దీంతో జూలైలో ఈ బైఎలక్షన్స్ విషయంలో ఫెడరేషన్ ఎంటర్ అయ్యి , చిరంజీవి, బాలయ్య బాబుల సహకారంతో పరిస్థితిని చక్కదిద్దినట్టే కనిపించింది.అయితే ఫెడరేషన్ మాటని లెక్క చేయకుండా సుమలత పట్టుబట్టి మరీ డాన్స్ అసోసియేషన్ లో ఎన్నికలు జరపించారు.
ఇక తాజాగా ఈ ఉపఎన్నికలలో గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారానికి యూనియన్ ప్రెసిడెంట్ సుమలత ఆధ్వర్యంలో ఏర్పాట్లు సాగుతున్నప్పటికీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం మెజారిటీ సభ్యులు హాజరయ్యే అవకాశం లేనట్టు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.అవును …ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా డాన్స్ అసోసియేషన్‌లోని కొన్ని కీలక వర్గాలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
ముఖ్యంగా ఇండస్టీలో టాప్ కోరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ వర్గాలకు చెందిన డాన్సర్లు, అలాగే మెజారిటీ యూనియన్ సభ్యులు కార్యక్రమానికి హాజరుకాకపోవచ్చని తెలుస్తుంది.ఈ ఇష్యూపై పైనే పెద్దలంతా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ జానీ మాస్టర్ వాళ్ళ నిర్ణయాన్ని పెడ చెవిన పెట్టి ఇలా మొండిగా ముందుకు సాగుతుండటం తో డాన్స్ అసోసియేషన్ కి ఫెడరేషన్ పూర్తిగా సహాయ నిరాకరణ చేయబోతుందని తెలుస్తుంది.
ఒకవేళ ఇలా జరిగితే మాత్రం డాన్స్ యూనియన్ చిక్కుల్లో పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.అందుకంటే ఫెడరేషన్ కిందనే డాన్స్ యూనియన్ పని చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఇపుడు ఫెడరేషన్ ఎలాంటి కో ఆపరేషన్ చేయకపోతే మాత్రం మేకర్స్ ఈ డాన్స్ యూనియన్ ని ఏ మాత్రం కన్సిడర్ చేస్తారో చూడాలి.
ఏది ఏమైనా ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ వివాదానికి వీలైనంత త్వరగా ఎండ్ కార్డ్ వేయకపోతే సమస్య మరింత పెద్దదయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.చూడాలి మరి జానీ మాస్టర్ ఇప్పటికైనా వెనక్కి తగ్గి ఫెడరేషన్ మాట వింటాడా లేక ఏది అయితే అది అయిందని తాడో పేడో తెల్చుకుంటాడా..?కాలమే డిసైడ్ చేయాలి !