E-Paper
Advertisement

‘పొడుస్తున్న పొద్దుమీద’ ఉంటే.. ప్యారడైజ్ దుమ్మురేపేదా?

‘పొడుస్తున్న పొద్దుమీద’ ఉంటే.. ప్యారడైజ్ దుమ్మురేపేదా?
Advertisement

The Paradise Movie:‘ప్యారడైజ్’…శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ఈ సినిమా దాదాపు ప్యాకప్ చెప్పినట్టే కనిపిస్తుంది. మొదటగా రిలీజ్ రోజు డివైడ్ టాక్ కి ,నెగెటివ్ ప్లాపుకి ఊగిసలాడిన ఈ సినిమా ఇపుడు యావరేజికి,ప్లాపుకి మధ్య ఊగిసలాడుతున్న పరిస్థితి. దీంతో ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించడంలో ఎక్కడ మిస్ అయిందంటూ లెక్కలు తేల్చే పనిలో పడ్డారంతా.

మిస్ అయిన పాట ఉండి ఉంటే

Advertisement

ఇందులో భాగంగా సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మిస్ అయింది అంటూ తేల్చేసిన నెటిజన్లు తాజాగా సినిమాలో మిస్ అయిన పాట ఉండి ఉంటె సినిమా పరిస్థితి ఇలా ఉండి ఉండేది కాదని సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టేస్తున్నారు.

విషయంలోకి వస్తే ప్యారడైజ్ సినిమా మొదట్లోనే గద్దర్ కి నివాళులు అర్పించింది మూవీ టీమ్.ఇక ఈ సినిమాలో గద్దర్ రాసిన పొడుస్తున్న పొద్దు మీద పాటని ఏమైనా వాడారా.. అని అనుకున్నారంతా ..తీరా చూస్తే సినిమాలో అది మిస్ అయింది.అయితే సినిమా రిలీజ్ అయిన మొదట్లో కాస్త టాక్ మంచిగానే ఉండటంతో ఈ పాట మిస్ అయిందని ఎవరూ పెద్దగా రైజ్ చేయలేదు.

Advertisement

సోషల్ మీడియాలో ఫుల్ డిబేట్ 

కానీ మెల్లి మెల్లిగా సినిమా టాక్ నెగెటివ్ గా మారుతూ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న డిస్కషన్ వస్తుండటంతో గద్దర్ పాట మీదికి ఇపుడు అందరి దృష్టి పోతుంది. ఇప్పుడు గనుక అదే పాట ఉండి ఉంటే ఈ సినిమాకి ఈ పరిస్థితి రాకపోగా ,ఊహించని వసూళ్ళని కొల్లగొట్టి ఉండి ఉండేదన్న డిబేట్ ఇపుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది.

ఈ పాట ఉండి ఉంటే బాగుండేది

నిజానికి తెలంగాణా బేస్డ్ గా సాగిన ఈ సినిమాకి గద్దర్ రచించిన ఈ ‘పొడుస్తున్న పొద్దుమీద’ పాట మెయిన్ ఎసెట్ గా నిలిచేది అన్నదాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి సినిమాలో సరైన ప్లేస్ మెంట్ కుదరక ఈ పాటని పెట్టలేదా ,లేక మరేదేమైన కారణమా తెలీదు కాని ఉండి ఉంటే మాత్రం థియేటర్లు దద్దరిల్లేవి.బహుశా సినిమా రిజల్ట్ తర్వాత శ్రీకాంత్ ఓదెల అండ్ టీమ్ పోస్ట్ మార్టం చేసే సమయంలో ఈ పాట ఉండి ఉంటె బాగుండేది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుందేమో కాబోలు.

మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో !

ఇక ఈ పాటని మిస్ అయ్యామంటూ సోషల్ మీడియాలో సినిమా క్లైమాక్స్ లోని నాని ,బాబుని పట్టుకొని బొట్టుని వీర తిలకంగా మార్చే సీన్ కి ఈ పాటని యాడ్ చేస్తూ ఇంత మంచి పాటని ఎలా మిస్ చేశావ్ గురూ అంటూ నెట్టింట్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.ఏది ఏమైనా యుద్ద నౌక్ గద్దర్ రాసిన ఈ పాటకి తెలంగాణాలో ఉన్న క్రేజ్ ని శ్రీకాంత్ ఓడెల వాడుకోవడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. చూడాలి మరి ఇదే విషయంపై మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో !

Tags

Related News

బాలీవుడ్ డెబ్యూకి సిద్ధమైన చందు మొండేటి..పూర్తి డీటెయిల్స్ ఇవే!

రణబాలి సెకండ్ డాక్యుమెంటరీ ‘ది హిస్టరీ వుయ్ ఫర్ గాట్’ రిలీజ్!

ఆట సందీప్ ఒక్కో పాటకి ఎంత తీసుకుంటాడో తెలుసా?

ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

బిగ్ బాస్ కృష్ణుడు కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో?

ఎఫ్డిఏ నోటీసులపై షారుక్ , అజయ్ , టైగర్ ష్రాఫ్ రియాక్షన్?

జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫెడరేషన్ కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×