E-Paper
Advertisement

‘కాఫీవిత్ కరణ్’ షోకు ఎండ్ కార్డ్… కరణ్ జోహార్ ఎమోషనల్ పోస్ట్!

‘కాఫీవిత్ కరణ్’ షోకు ఎండ్ కార్డ్… కరణ్ జోహార్ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Koffe With Karan:  బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ టాక్ (Koffe With Karan Talk)షోకి ఎంతో మంచి ఆదరణ ఉంది. దాదాపుగా రెండు దశాబ్దాలపైగా కొనసాగిన ఈ  టాక్ షోకు ఎండ్ కార్డ్ పడబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా హోస్ట్ కరణ్ జోహార్(Karan Johar) తెలిపారు. ఈ పాపులర్ టాక్ షోలో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమం ఎన్నో కాంట్రవర్సీలు ఆసక్తికరమైన కామెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇలా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ టాక్ షో 22 సంవత్సరాల ప్రస్తానానికి ముగింపు పలుకుతుంది.

నాన్నతో చర్చించిన చివరి ప్రాజెక్ట్..

ఈ నేపథ్యంలోనే కరణ్ జోహార్ ఈ విషయం గురించి తెలియజేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న కరణ్..2004 వ సంవత్సరంలో నేను ఈ సెలబ్రిటీల టాక్ షో ప్రారంభించాలని మా నాన్న గారితో చెప్పాను అప్పుడు ఆయన చాలా కంగారుపడ్డారు ఇలా చేస్తే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనీ చెప్పారు అయితే అదే నెలలోనే ఆయన కన్నుమూశారు. మా నాన్నతో నేను చివరిగా చర్చించిన ప్రాజెక్ట్ ఇదేనంటూ కరణ్ జోహార్ గుర్తు చేసుకున్నారు. కొన్ని ప్రయాణాలను మనం ముగించకూడదని కోరుకుంటాం కానీ సమయం వచ్చినప్పుడు వాటికి కూడా ముగింపు పలకాలని తెలిపారు.

ఎన్నో జ్ఞాపకాలను తీసుకువచ్చింది..

Advertisement

కాఫీ విత్ కరణ్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైన టాక్ షో.. ఈ కార్యక్రమం నాకు ఎన్నో జ్ఞాపకాలను తీసుకువచ్చింది ఈ కార్యక్రమం పై ఎన్నో వివాదాలు వచ్చినప్పటికీ ఎప్పుడు కూడా ఆదరణ తగ్గలేదు. ఈ టాక్ షో హోస్ట్ గా కొనసాగుతున్న సమయంలో తాను బయటకు వెళ్తే అందరూ కూడా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అడిగేవారు కాదు కాఫీ విత్ కరణ్ టాక్ షో తదుపరి సీజన్ ఎప్పటినుంచి ప్రారంభమవుతుందని ప్రశ్న మాత్రమే అడిగేవారు. ఇలాంటి ఒక గొప్ప టాక్ షోను ముగిస్తున్నాను అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.

?stkn=amthNjU1bHdseW52

Advertisement

ఈ కార్యక్రమం చివరి సీజన్ అక్టోబర్ 14 నుంచి జియో హాట్ స్టార్ లో ప్రచారం కాబోతుందని వెల్లడించారు. ఇప్పటివరకు ఎనిమిది సీజన్లలో 161 ఎపిసోడ్లు విజయవంతంగా పూర్తి అయిన విషయాన్ని ఈయన తెలియజేశారు. 22 సంవత్సరాల పాటు ఎనిమిది సీజన్లు 161 ఎపిసోడ్లతో విజయవంతంగా కొనసాగిన ఈ కార్యక్రమానికి ఇక ముగింపు పలకబోతున్నారని తెలిసిన అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పిన కరణ్ జోహార్ తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టబోతున్నారని తెలుస్తుంది. నిర్మాతగా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇకపై తాను నిర్మాత గానీ ఇండస్ట్రీలో కొనసాగుతానని కరణ్ జోహార్ తెలిపారు.

Also Read: బాలీవుడ్ డెబ్యూకి సిద్ధమైన చందు మొండేటి..పూర్తి డీటెయిల్స్ ఇవే!

Related News

కోడి చుట్టూ తిరిగే కథ… చివర్లో వచ్చే ట్విస్ట్ ఊహించడం కష్టం… తెలుగులోనే స్ట్రీమింగ్

తండ్రిపై కోపంతో రింగ్‌లోకి దిగిన కుర్రాడు… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్

ఒకే కుటుంబంలో వరుస హత్యలు… కోట్ల ఆస్తి కోసం భయంకరమైన కుట్ర… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

నిజ జీవిత పోరాటానికి జాతీయ అవార్డు… 13 ఏళ్లుగా ఓటీటీ కోసం ఎదురుచూసిన మూవీకి మోక్షం… 8.2 రేటింగ్‌తో ఇప్పుడు స్ట్రీమింగ్

ఏకంగా 6 పెళ్ళిళ్ళు… అతన్ని పెళ్లి చేసుకున్న మహిళలంతా చనిపోతారు… ట్విస్టులతో మతిపోగొట్టే ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ

‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ‘ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

చనిపోతూ ఫ్రెండ్ ఇచ్చే భారీ కుక్క… వదిలించుకోడానికి నానాతంటాలు… క్లైమాక్స్ చూస్తే కన్నీళ్ళు ఆగవు

Big Stories

Advertisement
×