Kingdom: ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసినా కింగ్డమ్ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాతో ఎంత పెద్ద పేరు సాధించాడు అందరికీ తెలిసిన విషయమే. జెర్సీ లాంటి సినిమా తర్వాత గౌతమ్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అంచనాలు ఉండటం సహజం.
మొదట రామ్ చరణ్ హీరోగా గౌతమ్ దర్శకుడుగా సినిమాను అనౌన్స్ చేశారు. కొన్ని కారణాల వలన ఆ సినిమా జరగలేదు. ఆ వెంటనే గౌతమ్ విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు పెంచుతూనే ఉన్నాడు నిర్మాత నాగ వంశీ.
ఆ సీన్ వలనే నెగిటివ్ టాక్
కింగ్డమ్ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా విషయంలో అక్కడక్కడా నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తుంది. ఇలా నెగిటివ్ టాక్ రావడం అనేది చిత్ర యూనిట్ దృష్టికి కూడా వెళ్ళింది. అయితే సినిమా విషయంలో అందరికీ ప్రాబ్లం ఉన్నది సెకండ్ హాఫ్ విషయంలోనే. ఈ సినిమాలో సత్యదేవ్ తన దివిలో ప్రజలందరినీ తీసుకొని మురుగన్ అనే క్యారెక్టర్ ఎందుకు వెళ్తాడు.
అక్కడ అనుకోని విధంగా ఆ దివిలోని మనుషులను మురుగన్ చంపేస్తాడు. అక్కడే ఉన్న సత్యదేవ్ వాళ్లను కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అనుకోని విధంగా సత్యదేవ్ కి కూడా అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఈ సీన్ చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశాడు గౌతమ్. ఇలా వాళ్ల మనుషుల కోసం పోరాడుతున్న తరుణంలో విజయ్ ఎంట్రీ ఇస్తాడు అని అందరూ ఊహిస్తారు. కానీ విజయ్ అక్కడికి రాడు. విజయ్ రాకపోయినా దానిని మించి ఏదో జరగబోతుంది ఈ సీన్ లో అనిపిస్తుంది. అది జరగదు. అప్పటికే సినిమాలో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ ఉండిపోయాడు కాబట్టి ఆ పాత్రలు చనిపోతుంటే ఒకవైపు ప్రేక్షకుడు ఫీలవుతూ ఉంటాడు.
హీరోయిన్ తో ముచ్చట్లు
ఒకవైపు ఆ సీన్ చూపిస్తున్న తరుణంలోనే మరోవైపు విజయ్ హీరోయిన్ తో కలిసి ఉన్న సీన్స్ చూపిస్తాడు. కేవలం తాగుతూ హీరోయిన్ తో మాట్లాడుకొని ఉండిపోతాడు. ఈ సీను దర్శకుడు పెట్టడానికి కారణం లేకపోలేదు. ఒక అద్భుతమైన ట్విస్ట్ రివిల్ చేయడానికి హీరోయిన్ దగ్గర ఈ సీన్ ప్లాన్ చేశాడు దర్శకుడు. అది కొంతమేరకు పరవాలేదు అనిపిస్తుంది. కానీ అది పెద్ద సర్ప్రైజ్ లా అనిపించదు. ఎందుకంటే విజయ్ చిన్నప్పుడు పాత్రను కూడా అగ్రెసివ్ చూపించాడు దర్శకుడు. కాబట్టి ఎక్కడో ఒకచోట ఆడియన్స్ కు అది మెదిలే ఉంటుంది. ఆ సీన్ మాత్రమే సినిమాలో కొద్దిపాటి ల్యాగ్ ఫీల్ కలుగుతుంది. దీనిని కరెక్ట్ చేసి ఉండి ఉంటే సినిమా రిజల్ట్ ఇంకొంచెం మెరుగ్గా ఉండేది అనేది కొంతమంది అభిప్రాయం.
Also Read: Naga Vamsi: విజయ్ దేవరకొండే మా పవన్ కళ్యాణ్, ఏంటి వంశీ అంత మాట అనేసావ్