Fish Venkat: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా, విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారిలో ఫిష్ వెంకట్ (Fish Venkat)ఒకరు. ఈయన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.. ఇలా పెద్ద ఎత్తున సినిమాలలో నటించి మెప్పించిన ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈయన కిడ్నీ (Kidney)సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. ఇలా రెండు కిడ్నీలు పూర్తిగా పాడవడంతో ఈయన హైదరాబాద్లోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో గత కొద్దిరోజులుగా చికిత్స తీసుకుంటున్నారని అయితే ఈయన పరిస్థితి విషమించడంతో వెంటి లెటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెంటిలేటర్ పై వెంకట్…
ఇక ఈయన ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన ఆరోగ్యానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయనకు ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కొంత వరకు ఆర్థిక సహాయం చేసినట్లు గతంలో తెలియచేశారు. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన డయాలసిస్ చేయించుకుంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం మాత్రం తన పరిస్థితి కాస్త విషమించిందని తెలుస్తోంది.
సాయం కోసం ఎదురుచూపు..
ఆరోగ్య సమస్యల కారణంగా ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉండిపోయారు. ఇక ఈయన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తన భర్త ఆరోగ్య పరిస్థితి చూసి తన భార్య తన భర్తను ఎలాగైనా కాపాడండి అంటూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. ఇక ఈయన వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాతో మొదలైన తన ప్రయాణం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో కలిసి సినిమాలు చేశారు.
గుర్తుపట్టలేని స్థితిలో నటుడు..
ముఖ్యంగా ఈయన పవన్ కళ్యాణ్ తో కలిసిన నటించిన గబ్బర్ సింగ్ (Gabber Singh)సినిమా ద్వారా మరింత పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. గబ్బర్ సింగ్ సినిమాలో నటించినందుకు ఫిష్ వెంకట్ కూడా మంచి ఆదరణ పొంది తదుపరి సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇక వెంకట్ చివరిగా తెలుగులో కాఫీ విత్ ఏ కిల్లర్ అనే సినిమాలో నటించారు. ఈయన విలన్ పాత్రలో నటించిన ఆ పాత్రలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. ఇలా వెండితెరపై అందరిని నవ్విస్తూ సందడి చేసిన వెంకట్ ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో, వెంటిలేటర్ పై ఉండటం చూసినా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.