Gundeninda GudiGantalu Today episode August 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి, మనోజ్ లు డబ్బులు వచ్చాయన్న సంతోషంలో ఉంటారు. బాలు ఇంట్లో ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి ఇది మా ఇల్లు కాదేమో అని అనుకుంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ప్రభావతి బాలుని తిడుతుంది. సంతోషంగా అందరిని పిలుస్తాడు. అయితే మా నాన్న నాకు 25 లక్షలు పంపించాడు ఆంటీ అని అంటుంది. మాట వినగానే ప్రభావతికి షాక్ కొట్టినట్లు కింద పడిపోతుంది. అన్ని డబ్బులు మీ నాన్న ఇచ్చాడా అని ఆశ్చర్య పోతుంది. కానీ బాలు శృతిలకు ఏదో తేడా కొడుతుంది అని ఆలోచిస్తారు.. బాలు వీడు తీసుకెళ్లి 40 లక్షలని ఎందుకు ఇవ్వాలనుకున్నాడు. వాళ్ళ నాన్న నాకు ఏదో తేడా కొడుతుంది అని అంటాడు. బాలు అన్న మాటలకి రోహిణి ప్రతిసారి మమ్మల్ని అనకు నువ్వు అన్న మాటలుకే నేను 40 లక్షల తీసుకొచ్చి ఇచ్చాను. ఇంకోసారి అంటే బాగోదు అని బాలుకి వార్నింగ్ ఇస్తుంది. మొత్తానికి బాలు రోహిణి, మనోజ్ కు చుక్కలు చూపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ అందరికి వార్నింగ్ ఇస్తూ నోరు జారి అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు. అదేంటి రోహిణి మీ నాన్న నీ అకౌంట్లో డబ్బులు వేయాలి కానీ ఇలా మనోజ్ అకౌంట్లో డబ్బులు వేయడమేంటి అని శృతి అడుగుతుంది. రోహిణి ఈ ప్రశ్నలు తట్టుకోలేక ఏంటంటే ఇదంతా అని అడుగుతుంది. వదిలేయమ్మా వాడి పుట్టింటి నుంచి వాడికి డబ్బులు రాలేదు కదా అందుకే ఇలా కుళ్ళు కుంటున్నాడు అని ప్రభావతి అంటుంది. ఆ మాటకు మీనా బాలు కోపంతో రగిలిపోతారు. సత్యం ఈ గొడవలు రోజు ఉండేవే ఇక ఆపండి అని అంటాడు.
గదిలోకి వెళ్లిన రోహిణి, మనోజ్ ఇద్దరు మరోసారి గొడవపడతారు.. అసలు నీ అకౌంట్లో డబ్బులు వేశారన్న విషయాన్ని నువ్వు ఎందుకు చెప్పావు అని రోహిణి మనోజ్ పై సీరియస్ అవుతుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మనోజ్ ఈ విషయాన్ని నువ్వు చెప్పేస్తే వాళ్ళు డబ్బులు లాగేసుకుంటారు అది ఆలోచించవా నువ్వు అని రోహిణి అరుస్తుంది. ఏదో టంగ్ స్లిప్ అయ్యి చెప్పేసాను రోహిణి ఇకమీదట చెప్పను అని మాట ఇస్తాడు. రోహిణి మాత్రం నీ మీద నాకు నమ్మకం లేదు కచ్చితంగా నువ్వు దీని గురించి చెప్తావు. అందుకే ఈ డబ్బులని త్వరగా ఏదో ఒకటి చేసి మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటుంది.
అయితే తొందరపడి ఏది పడితే అది చేస్తే నిండా మునిగిపోతాం. ఆలోచించి మంచి బిజినెస్ ని స్టార్ట్ చేసి డబ్బులు సంపాదిద్దాం అని రోహిణి అంటుంది. అయితే మీనాను కంట్రోల్లో పెడితే బాలు కూడా కంట్రోల్ అవుతాడు అని అంటుంది.. వీళ్ళిద్దరూ నోరు ఎలా ముగించాలో నాకు తెలుసు నేను చూసుకుంటాను అని రోహిణి అంటుంది. అటు మౌనికను సంజీవ వాళ్ళ ఫ్రెండ్ అల్లరి చేస్తాడు. వాడితో నువ్వు ఏం సుఖపడతావ్ నాతో వచ్చి డాన్స్ వెయ్యు నీకు స్వర్గాన్ని చూపిస్తాను అంటారు.
ఆ మాట అనగానే సీరియస్ అయినా మౌనిక అతడి చెంప పగలగొడుతుంది.. ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు అని అరుస్తుంది అందరూ అక్కడికి వచ్చి ఏమైంది రా అని అడుగుతారు. నీ వైపు నన్ను కొట్టింది రా అని సంజయ్ కి లేనిపోనివి చెప్పి మౌనికను కొట్టేలా చేస్తాడు.. ఇలాంటి దాన్ని పార్టీకి తీసుకొచ్చావంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని సంజయ్ ఫ్రెండ్స్ అంటారు. వెళ్లిపోవాల్సింది మీరు కాదురా ఇది వెళ్ళిపో ఇక నుంచి మా ఫ్యామిలీ ఏదో గొప్పది అని మాట్లాడుతున్నావు కదా అని సంజయ్ అంటారు.
సంజయ్ అన్న మాటకు బాధపడిన మౌనిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. రోహిణి మీన దగ్గరికి వచ్చి నీ భర్తని కంట్రోల్ లో పెట్టుకో అని వార్నింగ్ ఇస్తుంది. రోహిణి అన్నమాట సీరియస్ అయినా మీనా బాలు దగ్గరికి వచ్చి అరుస్తుంది. అసలు వాళ్ళందరి విషయాల గురించి మీకెందుకు మీరు పట్టించుకోవడం వల్లే వాళ్ళు నా దగ్గరికి వచ్చి నా తల అంటుతున్నారు అని మీనా అంటుంది. తర్వాత మీనా పూలు డెలివరీ ఇవ్వాలని అర్ధరాత్రి బయటికి వెళుతుంది.. మౌనిక సంజయ్ అన్న మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటూ ఒంటరిగా రోడ్డు మీద నడుస్తూ వస్తుంది.
Also Read: ‘వార్ 2 ‘ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..!
వెనకాల లారీ వస్తున్న సంగతి కూడా గమనించకుండా మౌనిక రోడ్డుపై నడుచుకుంటూ రావడం చూసిన మీనా మౌనికను పక్కకు లాగేస్తుంది. అసలు ఏమైంది మౌనిక అర్ధరాత్రి పూట నువ్వేంటి రోడ్డు మీద నా ఒళ్ళు తెలియకుండా నడుస్తున్నామని మీనా అడుగుతుంది. మౌనిక అసలు విషయం మీనాకు చెప్పేస్తుంది. సంజయ్ పెడుతున్న బాధల గురించి మీనా విని బాధపడుతుంది.. మీనా ఇన్ని రోజులు ఈ బాధని నీలోనే దాచుకున్నావా.. అలాంటి వాడితో నువ్వు ఎలా కాపురం చేస్తున్నావని అడుగుతుంది. మారతాడని అనుకున్నాను కానీ మారలేదు. మౌనిక చెప్పిన మాటలు విని మీనా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..