BigTV English

Ajith: మరో లగ్జరీ కార్ సొంతం చేసుకున్న స్టార్ హీరో.. ధర మామూలుగా లేదుగా?

Ajith: మరో లగ్జరీ కార్ సొంతం చేసుకున్న స్టార్ హీరో.. ధర మామూలుగా లేదుగా?

Ajith:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న అజిత్ (Ajith ) ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. చివరిగా ‘విదాముయార్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అంటూ ప్రేక్షకులను పలకరించిన ఈయన.. ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగానే ఉన్నారు. మరొకవైపు ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్న అజిత్.. ఇటీవలే తన భార్య షాలిని (Shalini) తో కలిసి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షాలిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది కూడా.. అలా వార్తల్లో నిలిచిన అజిత్ ఇప్పుడు మరొకసారి వార్తల్లోకి ఎక్కారు.


మరో ఖరీదైన కారు కొన్న అజిత్..

తాజాగా ఈయన మరో హై ఎండ్ లగ్జరీ కారును సొంతం చేసుకొని, దాని ధరతోనే అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ షెవర్లే కంపెనీకి చెందిన ‘ కార్వేట్ సీ8 -జడ్ 06’ కారును సొంతం చేసుకున్నారు. దీని ఖరీదు సుమారుగా రూ.1.40 కోట్లకు పై మాటే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ కారును దుబాయ్ లోని షోరూం నుంచి అజిత్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ కారు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న దీని లుక్ మెస్మరైజ్ చేస్తోందని చెప్పవచ్చు. ఇక అజిత్ కొత్త కారు కొనుగోలు చేయడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


అజిత్ కార్ కలెక్షన్స్..

ఇకపోతే ఇప్పటివరకు అజిత్ ఎన్నో లగ్జరీ కార్ లను తన కార్ గ్యారేజ్ లోకి తీసుకొచ్చారు. అందులో ఫెరారీ SF 90 (రూ.9 కోట్లు), ఫోర్సే GT3 RS (రూ. 3.15 కోట్లు), McLaren Senna ఈ కారు లిమిటెడ్ ఎడిషన్ సూపర్ కార్ కావడం గమనార్హం. దీని ఖరీదు రూ.6.75 కోట్లు.. అలాగే బీఎండబ్ల్యూ 740 Li ఖరీదు రూ.1.5 కోట్లు కాగా.. మెర్సిడెస్ బెంజ్ 350 జి ఎల్ ఎస్ కారు ఖరీదు రూ .1.35 కోట్లు కావడం గమనార్హం. కార్లే కాదు ఖరీదైన లగ్జరీ బైక్ కలెక్షన్ కూడా ఈయన సొంతం కావడం గమనార్హం.

అజిత్ కెరియర్…

అజిత్ విషయానికి వస్తే.. తెలంగాణలోని సికింద్రాబాద్లో జన్మించారు. తన నటన జీవితాన్ని ‘ప్రేమ పుస్తకం’ అనే తెలుగు సినిమాతో ప్రారంభించారు. ఇకపోతే తెలుగు హీరో అయినప్పటికీ తమిళంలో సినిమాలు చేసి అక్కడ తమిళ్ హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. 1999లో రమేష్ ఖన్నా తొడరమ్, సుందర్ సి రొమాంటిక్ డ్రామా ‘ఉన్నైతేడీ’ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించారు. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా మొదటి ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక తర్వాత నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు అజిత్.

రేసర్ కూడా..

అజిత్ ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు మోటర్ రేసింగ్ పై దృష్టి సారించి.. అక్కడ కూడా తన అభిరుచిని చాటుకుంటున్నారు. ఇప్పటికీ కూడా రేసింగ్ లో పాల్గొంటూ.. పలు మెడల్స్ కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఏదేమైనా ఒకవైపు సినిమాలలో మరొకవైపు తన అభిరుచిని చాటుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు అజిత్.

ALSO READ:Bigg Boss Agni Pariksha: అగ్ని పరీక్షకు ఎంపికైంది వీరే.. రేయ్ ఎవర్రా మీరంతా?

?utm_source=ig_web_copy_link

Related News

Tollywood: నడిరోడ్డుపై బట్టలు అమ్ముకుంటున్న హీరోయిన్.. ఏంటీ కర్మ!

Sukumar- Ram charan : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రంగంలోకి దిగిన సుకుమార్..

Coolie : సీఎంను కలిసిన కూలీ చిత్ర యూనిట్, వాట్ బ్రో అంటున్న విజయ్ ఫ్యాన్స్

Ponnambalam : నేను లక్ష రూపాయల కోసం ఫోన్ చేస్తే చిరంజీవి కోటికి పైగా ఇచ్చారు

Nani On Coolie: రజనీకాంత్ కంటే నాగార్జున కోసమే ఎదురుచూస్తున్న – నాని

Big Stories

×