E-Paper
Advertisement

ఈ ఐదుగురిలో టాలీవుడ్ నంబర్ వన్ ఎవరు?

ఈ ఐదుగురిలో టాలీవుడ్ నంబర్ వన్ ఎవరు?
Advertisement

Tollywood No.1:తెలుగు సినిమా బడ్జెట్లు ఇప్పుడు బ్యారియర్స్ దాటేశాయి. ఒకప్పుడు రీజినల్ సినిమా అనుకున్న టాలీవుడ్ కాస్త ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది.ఇక ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరో ఎవరు అంటే అందరి వేళ్లు చిరంజీవి వైపే చూపించేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కుర్ర హీరోలు వరుసగా దూసుకొచ్చారు.పైగా 1000 కోట్ల కాంపౌండ్‌లో జెండా పాతేశారు కూడా. ఈ లిస్టులో ఉన్న హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్.

ఎలా చూసినా ఈ ఐదుగురు హీరోలలోనే టాలీవుడ్ నంబర్ వన్ స్థానాన్ని ఎవరో ఒకరు దక్కించుకోవాలి. మరి టాలీవుడ్‌ను తమదైన వసూళ్లతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిన ఈ స్టార్ హీరోలలో ఎవరు టాలీవుడ్ నంబర్ వన్ హీరో అయ్యే ఛాన్స్ ఉంది? ట్రేడ్ వర్గాలు ఎవరిని టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా పరిగణిస్తున్నాయి? ఒకసారి చూసేద్దాం.

ప్రభాస్.. నంబర్ వన్ రేసులో ముందున్నాడా?

Advertisement

ముందుగా ప్రభాస్ విషయానికి వస్తే.. బాహుబలి సినిమాని ఏ ముహూర్తాన ఒప్పుకున్నాడో కానీ, అప్పటినుంచి ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.మొట్టమొదటిగా టాలీవుడ్‌లో 1000 కోట్ల మార్క్‌ను టచ్ చేసిన హీరో ప్రభాస్. అదే జక్కన్న కాంపౌండ్ నుంచి వచ్చిన ‘బాహుబలి 2’.ఆ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘రాజాసాబ్’ ఇలా హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ కింగ్‌గా నిలిచాడు.

సినిమాలు కాస్త అటు ఇటు అయినా.. ప్రభాస్ మార్కెట్ ఎక్కడ పడిపోకపోవడమే ప్రభాస్ యొక్క బలం.ఇక గత పొంగల్‌కి వచ్చిన ‘రాజాసాబ్’ అట్టర్ ప్లాప్ అయినప్పటికీ, ఓపెనింగ్ రోజు దాదాపు 200 కోట్లు వసూలు చేశాడంటే డార్లింగ్ స్టామినా ఏంటో అర్థం అయిపోతుంది.

Advertisement

ఇక మిగతా హీరోలతో పోలిస్తే ‘బాహుబలి 2’, ‘కల్కి 2898 ఏడీ’ అంటూ ఏకంగా రెండు వెయ్యికోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు డార్లింగ్. ఇదే మిగతా హీరోలని, డార్లింగ్‌ని వేరు చేసేది. ఇక 500 కోట్లు ఏకంగా 5 ఉండటం డార్లింగ్ స్పెషాలిటీ. ప్రభాస్‌ని బీట్ చేయాలంటే ముందు ఈ నెంబర్లను పాస్ చేయాల్సి ఉంటుంది.

 ప్రభాస్ బలాలు ఇవే..

భారీ ఓపెనింగ్ రాబట్టగలడు. పైగా పాన్ ఇండియా మార్కెట్ ఉంది. నార్త్ ఇండియాలో మంచి గుర్తింపు ఉంది. ఇక 1000 కోట్లు ఈజీ అన్న నమ్మకం నిర్మాతల్లో ఉంది.సో ఇవన్నీ కలగలిపి ప్రభాస్‌ను నంబర్ వన్ రేస్‌లో మొదటి స్థానంలో ఉంటాడని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లెక్కలేస్తున్నారు.ఇక డిసెంబర్‌లో వచ్చే ‘ఫౌజీ’ గనుక మరో వెయ్యి కోట్లని వెనకేసిందంటే ఎవ్వరికీ అందనంత దూరంలో డార్లింగ్ ఉంటాడు అనడంలో ఆశ్చర్యం లేదు.

 అల్లు అర్జున్.. ప్రభాస్ తర్వాత నెక్స్ట్ రేస్‌లో బన్నీ!

ఇక నెక్స్ట్ అల్లు అర్జున్. టాలీవుడ్‌ను పుష్పకి ముందు, పుష్పకి తర్వాత అన్నంతగా డివైడ్ చేశాడు అంటే ఈ ఐకాన్ స్టార్ స్టాంప్ టాలీవుడ్‌పై ఎలా ఉందో అర్థమవుతుంది.ముఖ్యంగా ‘పుష్ప 2’ సినిమా ఏకంగా వరల్డ్ వైడ్‌గా 1800 కోట్లను కలెక్ట్ చేసి టాలీవుడ్ స్టామినాని ప్రపంచానికి చూపించింది.ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ తర్వాత నెక్స్ట్ రేస్‌లో ముందుండేది ఐకాన్ స్టారే.ఇక ప్రస్తుతం నార్త్ బెల్ట్‌లో ఏ హీరోకి లేని ఇమేజ్ ఐకాన్ స్టార్ సొంతమంటే ఆశ్చర్యం లేదు.

పుష్ప బ్రాండ్, హిందీలో నార్త్ బెల్ట్‌లో సాలిడ్ క్రేజ్ సొంతం చేసుకోవడం, మాస్ క్యారెక్టర్లలో ఈజీగా ఇమిడిపోవడం.. పైగా నేషనల్ అవార్డు.. ఇవన్నీ అల్లు అర్జున్‌ను ప్రభాస్‌తో దీటుగా పోటీలో నిలుపుతున్నవే.

అట్లీతో చేస్తున్న ‘రాకా’ గనుక బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసిందంటే టాప్ చైర్‌కి పోటీ గట్టిగానే ఉంటుంది.

మహేష్ బాబు.. జక్కన్నతో నంబర్ వన్ రేసులోకి!

మన ఐకాన్ స్టార్ తర్వాత నెక్స్ట్ లైన్‌లో కనిపించేది మహేష్ బాబు.అయితే ప్రభాస్, అల్లు అర్జున్‌లకు నార్త్ బెల్ట్‌లో సాలిడ్ క్రేజ్ ఉంటే, మహేష్ బాబుకి స్టామినా తెలుగు రాష్ట్రాలకే సొంతం కావడం కాస్త గమనార్హం.అయితే ఇక ‘గుంటూరు కారం’ లాంటి డిజిటల్ డిజాస్టర్ సినిమాకి కూడా మొదటి రోజు ఇండియా వైడ్‌గా 41 కోట్ల వసూళ్లను కొల్లగొట్టాడంటే మహేష్ బాబు ఇమేజ్ ఏ రేంజ్‌లో పనిచేస్తుందో అర్థమవుతుంది.

ఇక మొత్తంగా డిజాస్టర్ అయినప్పటికీ ఏకంగా 212 కోట్లని సాధించిందన్నది ట్రేడ్ వర్గాల మాట.అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ప్రస్తుతం రాజమౌళితో ‘వారణాసి’ చేస్తుండడం ఇప్పుడు మహేష్ బాబుని రేసులో మరింత దూసుకెళ్లేలా చేస్తుంది.

ఒకవైపు దర్శకుడు రెండు వెయ్యికోట్ల సినిమాలు తీసిన జక్కన్న కావడం, మరోవైపు ‘వారణాసి’ ఊహించని విధంగా వరల్డ్ వైడ్ బజ్‌ని తెచ్చుకోవడంతో వచ్చే రోజుల్లో మహేష్ బాబు కూడా టాలీవుడ్ నంబర్ వన్ హీరో అయ్యే అవకాశాలు లేకపోలేదు.

ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్, బన్నీల కన్నా మహేష్ బాబుకి ఇప్పుడు జక్కన్న సినిమాతో ఆ నంబర్ వన్ చైర్ మరింత దగ్గరగా ఉందని చెప్పాలి.ఎందుకంటే ప్రభాస్‌ని టాప్ చైర్‌లో కూర్చోబెట్టింది ఈ జక్కన్ననే మరి.

నంబర్ వన్ రేసులో తారక్ కూడా!

ఇక వీళ్ల తర్వాత నెక్స్ట్ లీగ్‌లో కనిపించేది ఎన్టీఆర్.‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఒక్కసారిగా రేంజ్ పెంచుకున్న తారక్, ఆ తర్వాత ‘దేవర’తో ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టాడు.ఇక ‘వార్ 2’ సినిమా ప్లాప్‌ని మూట కట్టుకున్నప్పటికీ తారక్ ఇమేజ్ ఎక్కడ తగ్గకపోవడం విశేషం.ఇక ఇప్పుడు నీల్ మావతో ‘డ్రాగన్’ చేస్తూనే, అలాగే త్రివిక్రమ్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాలని లైనప్ చేసి నేనూ నంబర్ వన్ రేస్‌లో దూసుకొస్తున్నా అంటూ హింట్ ఇచ్చాడు తారక్.

also read :రణ్‌బీర్‌కు ముందు రాముడిగా ఫిక్స్ అయిన హీరోలు ఎవరంటే..!

ఇక మరోవైపు నీల్‌కి నేషనల్ వైడ్‌గా ఉన్న క్రేజ్ కూడా తారక్‌కి మరింత కలిసి వచ్చేదనే చెప్పాలి.

 రామ్ చరణ్.. గ్లోబల్ ఇమేజ్‌తో పోటీలోనే

ఈ లీగ్‌లో తర్వాత స్థానంలో ఉన్నది చరణ్.‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న చరణ్, ‘గేమ్ ఛేంజర్’తో మాత్రం బోల్తా పడిపోయాడు.అయినప్పటికీ ఓవరాల్‌గా రెండొందల కోట్లను సాధించి మెగా పవర్ ఎక్కడ తగ్గలేదని ప్రూవ్ చేశాడు.ఇక ‘పెద్ది’తో ఈ ఏడాది ఘనంగా మొదలెట్టిన చరణ్ ఏకంగా మొదటి రోజే వరల్డ్ వైడ్‌గా 100 కోట్లను సాధించడం విశేషం.ఓవరాల్‌గా 400 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ‘పెద్ది’తో మరోసారి నేనూ పోటీలోనే ఉన్నానని ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక ప్రస్తుతం సుక్కుతో సినిమా చేయాల్సి ఉంది. బన్నీకి ‘పుష్ప’ని ఇచ్చింది ఈ సుక్కునే. సో చరణ్‌కి కూడా టాలీవుడ్ నంబర్ వన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

చూడాలి మరి వీళ్లల్లో ఎవరు 2027లో టాప్ టాలీవుడ్ నంబర్ వన్ చైర్‌లో కూర్చుంటారో!

Tags

Related News

హాస్పిటల్ పాలైన అవికా గోర్..ఏం చేసిందో తెలిస్తే షాక్!

రామాయణ మూవీను ఫస్ట్ చూసేది ఎవరో తెలుసా?

‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. ప్రత్యేకించి అక్కడే!

ఖడ్గం మూవీ బ్యూటీతో బ్రేకప్.. మరో హీరోయిన్ తో టాలీవుడ్ హీరో డేటింగ్!

‘కొరియన్ కనకరాజు ‘ బాక్సాఫీస్ ఊచకోత.. అక్కడ అదరగొట్టేస్తున్నాడుగా..!

రణ్‌బీర్‌కు ముందు రాముడిగా ఫిక్స్ అయిన హీరోలు ఎవరంటే..!

రీజన్ లేకుండా ముద్దు పెట్టను.. అనన్య శర్మ బోల్డ్ స్టేట్‌మెంట్!

Big Stories

Advertisement
×