E-Paper
Advertisement

ఫస్ట్ నైట్‌ రోజే ఊహించని ట్విస్ట్… భార్యను తాకితే కరెంట్ షాక్ కొట్టే వింత ప్రేమకథ

ఫస్ట్ నైట్‌ రోజే ఊహించని ట్విస్ట్… భార్యను తాకితే కరెంట్ షాక్ కొట్టే వింత ప్రేమకథ
Advertisement

Telugu Romantic Drama: ఒక అమ్మాయిని తాకితే ఏకంగా కరెంట్ షాక్ కొడుతుంది… అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుంది ? ప్రేమ ఉంటే ఇలాంటి సమస్యను కూడా అధిగమించగలమా ? ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన విభిన్నమైన తెలుగు డ్రామెడీ డ్రామా ‘ఓ..! సుకుమారి’. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

తెలంగాణలోని ఓ పల్లెటూరిలో దామిని అనే యువతి ఉంటుంది. పుట్టుకతో వచ్చిన ఓ విచిత్రమైన సమస్య కారణంగా ఆమెను ఎవరైనా తాకితే వారికి ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. ఈ కారణంగా దామినికి పెళ్లి చేయడం కుటుంబానికి పెద్ద సమస్యగా మారుతుంది. ఊరిలో వాళ్లు కూడా ఆమెకు దూరంగానే ఉంటారు. ఇదే సమయంలో రాజకీయాల్లో ఎదగాలని కలలు కనే యాదగిరి పెళ్లిచూపుల కోసం ఆ ఊరికి వస్తాడు. దామినిని చూసిన వెంటనే ఆమెపై మనసు పారేసుకుంటాడు. అయితే ఆమెకు ఉన్న కరెంట్ షాక్ సమస్య గురించి అతడికి మాత్రం అసలు తెలియదు. దామినినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడంతో కుటుంబ సభ్యులు కూడా ఈ సంబంధాన్ని ఎలాగైనా ఖరారు చేయాలని నిర్ణయించుకుంటారు.

Advertisement

అయితే అసలు ట్విస్ట్ పెళ్లి తర్వాతే వస్తుంది. దామినికి ఉన్న సమస్యను యాదగిరికి చెప్పకుండా పెళ్లి జరిపించేస్తారు. శోభనం గదిలో భార్యను తాకగానే యాదగిరికి కరెంట్ షాక్ కొట్టడంతో అసలు విషయం బయట పడుతుంది. అప్పటి నుంచి భార్యను వదిలేయలేక.. దగ్గరకు వెళ్లలేక యాదగిరి పడే ఇబ్బందులతో కథలో కామెడీ మొదలవుతుంది. భార్యాభర్తలుగా జీవించాలంటే శారీరకంగా దగ్గరవ్వడం ఒక్కటే ముఖ్యమా? దామినిని యాదగిరి అర్థం చేసుకోగలిగాడా? ఆమెకు ఉన్న ఈ వింత సమస్య నుంచి బయటపడే మార్గం దొరికిందా? చివరికి వీరి ప్రేమకథ ఎలాంటి ముగింపుకు చేరింది? అనేది సినిమాలో చూడాల్సిందే.

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

సాధారణ ప్రేమకథలకు భిన్నంగా ఓ విచిత్రమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ముఖ్యంగా తిరువీర్ తన సహజమైన కామెడీ టైమింగ్‌తో యాదగిరి పాత్రలో ఆకట్టుకోగా, ఐశ్వర్య రాజేష్ దామిని పాత్రలో ఎమోషనల్‌గా మెప్పించారు. భార్యను తాకకుండా ఉండేందుకు హీరో చేసే ప్రయత్నాలు, వారి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు తెప్పిస్తాయి. అదే సమయంలో ప్రేమ అంటే కేవలం శారీరక బంధం కాదని, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కష్టాల్లో తోడుగా నిలవడం కూడా ప్రేమలో ముఖ్యమైన భాగమేననే భావనను కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఓ..! సుకుమారి’ (O..! Sukumari)ప్రస్తుతం Amazon Prime Videoలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 7 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ఫ్యామిలీ డ్రామెడీ చూడాలనుకుంటే ఈ సినిమాను ఓసారి ట్రై చేయొచ్చు.

Advertisement

Read Also: 95 ఏళ్ల తాత చివరి కోరిక కోసం పాక్ కు మనవడు… కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×