Upcoming Movies: ప్రతి నెల సినిమాల సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. జులై నెల తో పోలిస్తే ఆగస్టు నెలలో బోలెడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయని తెలుస్తుంది.. ప్రతినెల వచ్చేసి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీనిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆగస్టు నెలలో కూడా చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. జూలై నెలలో స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీని ఇచ్చాయి.. విజయ్ దళపతి నటించిన జననాయగన్, కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని అందుకోవడంతోపాటుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.. అదేవిధంగా ఆగస్టు నెలలో కూడా చాలా సినిమాలు మూవీ లవర్స్ ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఏ తేదీన రాబోతుందో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకుందాం…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. తాజాగా ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కొరియన్ కనకరాజు. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమా డిఫరెంట్ స్టోరీ తో రాబోతుందని ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ చూస్తే అర్థమవుతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రం. ఆగస్టు 7, 2026న విడుదల కానుంది. ఇక ఇందులో రితికా నాయక్, దక్ష నగార్కర్ నటిస్తుండగా, ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా కరప్పు చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా తెలుగు-తమిళ ద్విభాషాచిత్రం విశ్వనాథ్అండ్ సన్స్.. గతంలో ఎన్నడు కనిపించిన విధంగా సూర్య ఈ మూవీలో స్టైలిష్ ట్రక్ లో కనిపిస్తున్నాడని ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లను చూస్తే అర్థమవుతుంది. ఇందులో హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషనల్ బ్యూటీ మమత బైజు నటిస్తున్నారు.. జీవి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు వరకు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది..
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఇరుముడి.. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రం పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా 2026 ఆగస్టు 21న విడుదల కానుంది.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన సాంగ్స్ జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది..
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం టాక్సిక్.. కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాక్ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియ చిత్రం ఇది.. ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. క్రేజీ యంగ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి.. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి…
ఈనెల రిలీజ్ కాబోతున్న సినిమాలపై జనాల్లో అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. మరి ఈ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్న ఈ చిత్రాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి..
Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ రామరాజు ఏం చదివాడో తెలుసా..?