Uppal Balu: శివజ్యోతి (Siva Jyothi)ఇటీవల పెద్ద ఎత్తున వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె ఇటీవల తిరుమల అన్న ప్రసాదం గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మేము కాస్ట్లీ ప్రసాదాన్ని అడుక్కుంటున్నాము అంటూ ఈమె తిరుమల శ్రీవారి అన్న ప్రసాదం గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా శివ జ్యోతి చుట్టు వివాదాలు చుట్టుముట్టాయి. ఎంతోమంది తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. శివ జ్యోతి గురించి విమర్శలు రావడంతో ఆమె వెంటనే వివరణ ఇస్తూ క్షమాపణలు కోరారు.
ఈ వీడియో పై శివ జ్యోతి మాట్లాడుతూ నా వీడియో కారణంగా స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించండి నేను తప్పు ఉద్దేశంతో మాట్లాడలేదు. నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలు అనే సంగతి అందరికీ తెలిసిందే అంటూ వివరణ ఇస్తూ క్షమాపణలు కోరారు. ఇక ఈ వివాదం ఇంతటితో ముగిసిపోయిందని అందరూ భావించారు కానీ తాజాగా మరొక వార్త కూడా వెలుగులోకి వచ్చింది శివ జ్యోతిని టీటీడీ జీవితకాలం స్వామి వారి దర్శనానికి రాకుండా నిషేధం విధించింది అంటూ కూడా వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలలో నిజం లేదని స్పష్టమైనది. ఇక తిరుమల వివాదం గురించి శివ జ్యోతి పై ఉప్పల్ బాలు(Uppal Balu) చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో భాగంగా ఉప్పల్ బాలు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తన ఫాన్స్ అందరు కూడా శివజ్యోతి తిరుమల ప్రసాదం గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని కోరుతున్నారు అందుకోసమే మాట్లాడుతున్నాను అంటూ ఉప్పల్ బాలు తన అభిప్రాయాన్ని తెలిపారు. శివ జ్యోతి 2 ఇండ్లు కొన్నావు, రెండు కార్లు కొన్నావు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి లైఫ్ బాగా సెటిల్ చేసుకున్నావు. బిగ్ బాస్ వెళ్లి కూడా బాగా సంపాదించుకున్నావు ఇటీవల తిరుపతికి వెళ్లావు. తిరుపతికి వెళ్లడం అంటే కూడా అదృష్టం ఉండాలి నువ్వు వెళ్లడం బాగానే ఉంది.
?igsh=ajJibTlwMXV2YTZ2
ఇలా తిరుపతిలో స్వామివారి అన్న ప్రసాదం దొరకాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అలాంటి ప్రసాదాన్ని అడుక్కుంటున్నామంటూ నవ్వుతూ మాట్లాడతావా.. కొంచమైనా బుద్ధుండాలి.. అలా చేయవచ్చా ఆ ప్రసాదం గురించి అలా మాట్లాడొచ్చా. తిరుపతికి భక్తితో వెళ్లాలి.. నువ్వు చదువుకున్నావు కదా నీకు తెలియదా ఎక్కడ ఎలా మాట్లాడాలో, నీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మాత్రమే తెలుసు అంటూ ఉప్పల్ బాలు తనదైన శైలిలోనే ఈ వివాదం పై స్పందిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో ఎంతోమంది బాలు వ్యాఖ్యలను సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మీరు మాట్లాడేవన్నీ నిజాలే అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Globe Trotter Event: టెలివిజన్ ప్రీమియర్ గా గ్లోబ్ ట్రాటర్.. ఎప్పుడు..ఎక్కడంటే?