E-Paper
Advertisement

Varalakshmi Sarath Kumar: డైరెక్టర్ గా మారిన లేడీ విలన్.. సరికొత్తగా మొదటి సినిమా..

Varalakshmi Sarath Kumar: డైరెక్టర్ గా మారిన లేడీ విలన్.. సరికొత్తగా మొదటి సినిమా..
Advertisement

Varalakshmi Sarath Kumar: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కేవలం నటి నటులుగా మాత్రమే కాకుండా దర్శకులుగా నిర్మాతలుగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది దర్శకత్వంపై ఆసక్తితో మెగా ఫోన్ పట్టి దర్శకులుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ జాబితాలో మరో స్టార్ డాటర్ చేరిపోయిందని చెప్పాలి. సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శరత్ కుమార్(Sarath Kumar) ఒకరు ఈయన ఎన్నో తమిళ తెలుగు సినిమాలలో నటించి హీరోగా సక్సెస్ అందుకున్నారు. ఈయన వారసురాలిగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar)కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కెరియర్ మొదట్లో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

డైరెక్టర్ గా మారిన వరలక్ష్మి..

హీరోయిన్ గా సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ అందుకోని వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ పాత్రల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఈమె తెలుగులో క్రాక్, వీర సింహారెడ్డి వంటి సినిమాలలో విలన్ గా నటించి తన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.. ఇండస్ట్రీలో విలన్ పాత్రాలలోనూ, లేడీ ఓరియంటెడ్ సినిమాలలోను నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు మెగా ఫోన్ పట్టబోతున్నారు. వరలక్ష్మి డైరెక్టర్ మారబోతోంది అంటూ వార్తలు వచ్చిన విధంగానే ఈమె తన మొదటి సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే.

వరలక్ష్మి దర్శకురాలిగా సరస్వతి సినిమా..

Advertisement

వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వంలో “సరస్వతి”(Saraswathi) అనే సినిమాకు ఈమె దర్శకురాలిగా పనిచేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాని వరలక్ష్మి తన సొంత నిర్మాణ సంస్థ ‘దోస డైరీస్’ (Dosa Diaries) పై, తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి ప్రధానపాత్రలో నటించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా దాదాపు పూర్తి అయ్యాయని తెలుస్తోంది.

?igsh=bXc5Zm9ianJwanVk

Advertisement

ఈ సినిమాలో వరలక్ష్మితో పాటు ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియోని చిత్ర బృందం విడుదల చేశారు . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే సరస్వతి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సరికొత్త అప్డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉండండి అంటూ ఈమె ఈ వీడియోని విడుదల చేశారు అయితే ఇందులో ఈమె పోలీస్ డ్రెస్ లో కనిపించడం విశేషం. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతోంది ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇన్ని రోజులు వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు తెరవెనక దర్శకురాలిగా ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది.

Also Read: K.V.Anudeep: వెంకీ మామతో అనుదీప్ మూవీ..  డబుల్ డోస్ కామెడీ పక్కా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×