Bigg Boss Host Remuneration: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సామాన్యులు, సెలబ్రిటీల కలయికలో దాదాపు మూడు నెలల పాటు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ మరింత ఆదరణ సొంతం చేసుకుంటోంది. ఇకపోతే కామనర్స్ కి వారానికి 70 వేల చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తే.. సెలబ్రిటీలకు వారి క్రేజ్ ను , మార్కెట్ ను బట్టి రూ.2లక్షల నుండి రూ.4లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ కాస్త పక్కన పెడితే.. ఎన్టీఆర్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ వన్, ఆ తర్వాత నాని , సీజన్ 3 నుండి నాగార్జున హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. మరి సీజన్ వన్ నుండి సీజన్ 10 వరకు హోస్ట్ ల రెమ్యూనరేషన్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ హోస్ట్ గా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 2017లో ప్రారంభం అయ్యింది..ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా ఏకంగా 8 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. . ఎన్టీఆర్ హోస్టింగ్ చేసిన ఈ సీజన్ భారీ ఆదరణ సొంతం చేసుకొని మంచి టిఆర్పి రేటింగ్ కూడా అందించింది.
ఇక బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. 2018లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరించినందుకుగాను రూ.5కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అయితే ఈ సీజన్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. హోస్ట్ గా నాని సరిగా వ్యవహరించలేదు అనే విమర్శలు కూడా వినిపించాయి.
also read:మేము లవర్స్ కాదురా నాయనా..రీతు చౌదరి షాకింగ్ పోస్ట్..!
ఇక బిగ్ బాస్ 3వ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. సీజన్ 3 నుండి సీజన్ 10 కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 2019లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3 కోసం నాగార్జున రూ.8 కోట్లు తీసుకోగా.. 2020లో ప్రసారమైన సీజన్ 4 కోసం రూ.10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. 2021లో ప్రసారమైన సీజన్ 5 కోసం 12 కోట్లు తీసుకున్న నాగార్జున.. 2022లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటి కోసం ఏకంగా రూ. 15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అయితే అదే ఏడాది మరోవైపు సీజన్ సిక్స్ ప్రసారం అవ్వగా.. దానికి 20 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నారు నాగార్జున.
2023 లో వచ్చిన సీజన్ 7 కోసం 25 కోట్లు, సీజన్ 8 కోసం 30 కోట్లు తీసుకున్న నాగార్జున.. సీజన్ 9 కోసం 35 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు సీజన్ 10 కోసం 35 నుండి 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం . ఏది ఏమైనా నాగార్జున ప్రతి సీజన్ కి తన రెమ్యూనరేషన్ ను పెంచుతూ ఇప్పుడు ఏకంగా మూడు రెట్లు అధికంగా తీసుకుంటూ ఉండడం గమనార్హం.