Airtel Bonus Data: భారతీ ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం ఒక ఆకర్షణీయమైన ఆఫర్ ను తీసుకొచ్చింది. రూ. 3999 ధరతో వచ్చే వార్షిక ప్లాన్‌పై వినియోగదారులకు 150 జీబీ బోనస్ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా ప్రతీరోజూ వచ్చే భారీ డేటాకు అదనంగా ఈ బోనస్ డేటా లభించనున్నట్లు ఎయిర్ టెల్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ ఆకర్షణీయమైన లాంగ్ టర్మ్ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో చూద్దాం.
ఎయిర్‌టెల్ రూ. 3999 ప్లాన్‌తో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు, రోజూ 2.5 జీబీ హైస్పీడ్ డేటా లభించనుంది. దీనికి అదనంగా ఎయిర్‌టెల్ అందిస్తున్న 150 జీబీ ఉచిత బోనస్ డేటా వినియోగదారులకు పెద్ద ప్లస్ గా మారనుంది. దీంతో పాటు ఎయిర్‌టెల్ సేఫ్ నెట్‌వర్క్ ప్రొటెక్షన్, అపరిమిత 5జీ డేటా బెనిఫిట్స్ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు పొందొచ్చని ఎయిర్ టెల్ తెలిపింది. అయితే అపరిమిత 5జీ డేటాపై ప్రతి 28 రోజులకు 300 జీబీ పరిమితి (ఫెయిర్ యూసేజ్ పాలసీ) వర్తించనుంది.
ఈ రూ.3,999 ప్లాన్ లో మరిన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఎయిర్ టెల్ యూజర్లకు లభించనుంది. ముఖ్యంగా వీటిలో ‘అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం’ (Adobe Express Premium) ఉచిత సబ్‌స్క్రిప్షన్ హైలెట్ గా నిలుస్తోంది. వినియోగదారులు 12 నెలల పాటు ఉచితంగా దీని సేవలను పొందవచ్చు. అదే విధంగా ప్రతీ నెల నచ్చిన కాలర్ ట్యూన్ ను ఉచితంగా సెట్ చేసుకోవచ్చు. కాగా పూర్తి సంవత్సరం (365 రోజులు) వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆసక్తి గల యూజర్లు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ (Airtel Thanks App) లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.
Also Read: అక్టోబర్ 1 నుంచి వాట్సప్ కొత్త రూల్.. ఒక్కో మెసేజ్‌కు 14 పైసలు ఛార్జీ.. సామాన్యులపై ప్రభావమెంత?
రూ. 3999 కాకుండా కాస్త తక్కువ బడ్జెట్‌లో ఏడాది ప్లాన్ కోరుకునే వారి కోసం ఎయిర్‌టెల్ రూ. 3599 ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఇది కూడా సంవత్సరం వ్యాలిడిటీతోనే వస్తుంది, కానీ ఇందులో రోజుకు 2 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. అలాగే రూ. 3999 ప్లాన్‌లో వచ్చే 150 జీబీ ఉచిత బోనస్ డేటా ఈ ప్లాన్‌లో లేకపోవడం గమనార్హం. అయితే ఇందులో కూడా వినియోగదారులు ఉచిత 5జీ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.
Also Read: పోస్టాఫీసు మోస్ట్ వాంటెడ్ స్కీమ్.. రూ.8000 కడితే చేతికి రూ.5.68 లక్షలు.. అస్సలు లైట్ తీసుకోవద్దు!