Earphones Under 500: ఒకప్పుడు వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ కొనాలంటే వేల రూపాయిలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. అతి తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లు ఉన్న ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. కేవలం రూ.500 లోపు బడ్జెట్‌లోనే మంచి సౌండ్ క్వాలిటీ, క్లియర్ కాలింగ్, రోజంతా వచ్చే బ్యాటరీ లైఫ్‌తో లభించే కొన్ని ప్రముఖ ఇయర్ ఫోన్స్ వివరాలను ఇప్పుడు చూద్దాం.
క్రేటోస్ టీడబ్ల్యూ02 బడ్స్ కేవలం రూ.499 ధరకే లభిస్తున్నాయి. ఇవి ఏకంగా 60 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తాయి. బ్లూటూత్ 5.3, ఫాస్ట్ ఛార్జింగ్, వాటర్ రెసిస్టెన్స్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. అలాగే డబ్‌స్టెప్ బజ్ ఎక్స్11 మోడల్ కూడా రూ.499కే అందుబాటులో ఉంది. ఇది కూడా 60 గంటల బ్యాటరీ లైఫ్‌తో పాటు బ్లూటూత్ 6.0, మంచి బాస్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.
Also Read: బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత చవకగా ల్యాప్‌టాప్‌లు.. ఏ మోడల్ కొంటే బెటర్ అంటే?
గేమింగ్ ప్రియుల కోసం అరోమా ఎన్బీ126 ఆస్టర్ ఒక మంచి ఎంపిక. దీని ధర రూ.498గా ఉంది. ఇందులో 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో పాటు గేమింగ్ సమయంలో లేటెన్సీని తగ్గించేలా డిజైన్ చేశారు. స్టైలిష్ ఆర్జీబీ లైటింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఇందులో ప్రత్యేకంగా లభిస్తాయి.
అతి తక్కువ బడ్జెట్‌లో ఇయర్ ఫోన్స్ వెతికేవారికి లిన్‌స్టన్ టీడబ్ల్యూఎస్ మంచి ఛాయిస్. ఇది అమెజాన్‌లో రూ.299కే అందుబాటులో ఉంది. ఇందులో ఆరు మైక్‌లు, నాయిస్ క్యాన్సిలేషన్, డీప్ బాస్ సౌండ్ లభిస్తాయి. అలాగే భారత్ బడ్స్ ఎక్స్ ప్రైమ్ మోడల్ రూ.339కే 40 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది.
ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో ఆఫర్లు, కూపన్లను బట్టి ఈ ఇయర్ ఫోన్స్ ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి.. కొనుగోలు చేసే ముందు వారంటీ వివరాలు, మిగతా కస్టమర్ల రివ్యూలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
Also Read: ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో లైవ్ టీవీ ఛానల్స్.. ఇదెలా సాధ్యం అంటే?