Laptop shut down vs sleep mode: మనం రోజూ ఉపయోగించే ల్యాప్ టాప్‌ను సరిగ్గా మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ల్యాప్ టాప్‌ను కాసేపు.. పక్కన పెట్టేటప్పుడు స్క్రీన్ మూసేయడం లేదా ‘స్లీప్ మోడ్’లో పెట్టడం చాలా మందికి అలవాటు. మరికొందరైతే పని అయిపోగానే వెంటనే ‘షట్ డౌన్’చేస్తారు. అసలు ఏది సరైన పద్ధతి? మీ డివైస్‌కు ఏది ఎక్కువ కాలం పాడవకుండా ఉంచుతుంది ? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ల్యాప్‌టాప్‌ను కొద్ది సేపు (అంటే టీ తాగి రావడానికి, లంచ్ బ్రేక్ లేదా చిన్న మీటింగ్ కోసం) పక్కన పెడుతుంటే.. ‘స్లీప్ మోడ్’ బెస్ట్ ఆప్షన్.
లాభాలు: స్లీప్ మోడ్‌లో ..ఉన్నప్పుడు ల్యాప్‌టాప్ చాలా తక్కువ పవర్‌ను మాత్రమే వాడుకుంటుంది. మీరు మళ్లీ ఓపెన్ చేయగానే.. ఏమాత్రం టైమ్ వేస్ట్ కాకుండా మీరు ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచే మళ్లీ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. యాప్స్ అన్నీ అలాగే రన్ అవుతుంటాయి.
ఎప్పుడు వాడకూడదు: మీరు ల్యాప్‌టాప్‌ను బ్యాగ్‌లో వేసుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా రోజంతా వాడకపోయినా స్లీప్ మోడ్‌లో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే బ్యాగ్‌లో ఉండి అది వేడెక్కే ఛాన్స్ ఉంటుంది.
మీ రోజువారీ పని పూర్తయిన తర్వాత, రాత్రి పడుకునే.. ముందు లేదా ఎక్కువ దూరం ప్రయాణాలు చేసేటప్పుడు ల్యాప్‌టాప్‌ను కచ్చితంగా ‘షట్ డౌన్’ చేయడమే మంచిది.
లాభాలు: షట్ డౌన్ చేసినప్పుడు.. సిస్టమ్ పూర్తిగా టర్న్ ఆఫ్ అవుతుంది. బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అయ్యే టెంపరరీ ఫైల్స్, క్యాచే మెమరీ అన్నీ క్లియర్ అవుతాయి. దీని వల్ల ల్యాప్‌టాప్ స్పీడ్ పెరుగుతుంది. అంతే కాకుండా హ్యాంగ్ అయ్యే సమస్యలు తగ్గుతాయి.
అప్ డేట్స్: విండోస్ లేదా మ్యాక్ సిస్టమ్ అప్ డేట్స్ సరిగ్గా ఇన్ స్టాల్ కావాలన్నా.. బ్యాక్ గ్రౌండ్ బగ్స్ క్లియర్ కావాలన్నా రీ స్టార్ట్ లేదా షట్ డౌన్ చాలా అవసరం.
Also Read; రూ.45 వేలలోపు బెస్ట్ ల్యాప్ టాప్స్.. కొంటే ఇలాంటి మోడల్స్ ఏ కొనాలి
చాలా మంది రోజంతా ల్యాప్ టాప్‌ను స్లీప్ మోడ్‌లోనే.. ఉంచుతుంటారు. దీని వల్ల బ్యాటరీ కొద్ది కొద్దిగా ఖర్చవుతూనే ఉంటుంది. అంతే కాకుండా రోజూ షట్ డౌన్ చేయక పోతే రామ్ పై భారం పడి ల్యాప్ టాప్ స్లో అవుతుంది. అందు వల్ల ఆఫీస్ అవర్స్ అయిపోగానే.. షట్ డౌన్ చేయడం అలవాటు చేసుకోవాలి.
చిన్న పాటి బ్రేక్‌ల కోసం ‘స్లీప్ మోడ్’ వాడటం మంచిదే. కానీ.. రోజు ముగిసే సరికి లేదా ఎక్కువ సేపు వాడని.. సమయంలో ల్యాప్ టాప్‌ను కచ్చితంగా ‘షట్ డౌన్’ చేయడం మీ డివైస్ హెల్త్‌కు చాలా మంచిది. ఈ చిన్న టెక్ టిప్స్ పాటించి మీ ల్యాప్‌టాప్ లైఫ్‌ను పెంచుకోండి.