E-Paper
Advertisement

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేది అప్పుడే.. పుట్టిన తేదీ కూడా తప్పు: వేణు స్వామి

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేది అప్పుడే.. పుట్టిన తేదీ కూడా తప్పు: వేణు స్వామి
Advertisement

Venu Swamy : ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణుస్వామి (Venu swamy) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాలను బయటపెడుతూ.. నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈయన అప్పుడప్పుడు చేసే కామెంట్లు ఒక్కొక్కసారి విమర్శలకు కూడా దారితీస్తున్న విషయం తెలిసిందే. నిజానికి వేణు స్వామి చెప్పిన మాటలు ఒకసారి నిజమైతే ఒక్కోసారి బెడిసి కొట్టాయి. దీంతో సదరు సెలబ్రిటీల అభిమానులు వేణు స్వామి పై విమర్శలు గుప్పిస్తూ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈయన ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి అలాగే ఆయన పుట్టిన తేదీ గురించి కూడా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

ఎన్టీఆర్ పుట్టిన డేట్ తప్పు – వేణు స్వామి 

Advertisement

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి ఎన్టీఆర్ పుట్టిన తేదీపై కామెంట్లు చేశారు. వేణు స్వామి మాట్లాడుతూ..” ఎన్టీఆర్ పుట్టిన డేట్ ఒకటి.. ఆయన బర్తడే చేసుకునే డేట్ ఒకటి. అందరూ అనుకుంటున్నట్టు మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కాదు.. ఆయన పుట్టిన డేట్ వేరే ఉంది. నిజానికి ఎంతోమంది జ్యోతిష్యులు మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు అంటూ ఎన్నో జాతకాలు రాశారు. అందులో ఏదీ నిజం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ తల్లి గారు ఎన్టీఆర్ బర్త్డే డేట్ ను నాకు ఇచ్చి ఆయన జ్యోతిష్యం రాయించారు.  ముఖ్యంగా ఆమెకు, నాకు, ఎన్టీఆర్ కి తప్ప మరెవరికి ఎన్టీఆర్ అసలు పుట్టినరోజు తెలియదు” అంటూ సంచలన కామెంట్లు చేశారు.

ఎన్టీఆర్ అప్పుడే రాజకీయ ఎంట్రీ ఇస్తారు – వేణుస్వామి

ఇదే ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై కూడా కామెంట్లు చేశారు.” ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి. 2030 వరకు ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం లేదు. 2029 ఎన్నికల తర్వాతే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది. ముఖ్యంగా రాజకీయాలలో ఆయనకు భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడున్న ఏ పార్టీతో కూడా ఎన్టీఆర్ కి సంబంధం లేదు. ఆయన కొత్త పార్టీతోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా సీఎం అవుతారు. ఆయనకు ఆ యోగం కూడా ఉంది. ముఖ్యంగా జయలలిత లాంటి యోగం ఎన్టీఆర్ కి ఉంది ” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి అయితే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై వేణు స్వామి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆయన చేసిన మాటలు నిజం అవుతాయో లేదో తెలియాలి అంటే 2030 వరకు ఎదురు చూడాల్సిందే.

Advertisement

also read:ఇరుముడి “మల్లెపూల పల్లకి” సాంగ్ లో రామ్ చరణ్.. చిత్ర బృందం క్లారిటీ!

ఆగని ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ రూమర్స్..

ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులో విజయ్ ప్రభంజనం సృష్టించిన తర్వాత ఎన్టీఆర్లో మార్పు వచ్చిందని రాజకీయాలపై ఒక లక్ష్యాన్ని పెట్టుకుని తెరవెనక పావులు కదుపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.  ఇంతలోనే రా ఎన్టీఆర్ పేరుతో మరో గ్రూప్ హల్చల్ చేసింది.  ఎన్టీఆర్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ,ఒక అధికారిక ప్రకటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులలో ఈ విషయం కలకలం రేగింది. దీంతో ఎన్టీఆర్ కార్యాలయం స్పందిస్తూ రా ఎన్టీఆర్ సంస్థకు ఎన్టీఆర్తో ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.

Related News

ఇరుముడి “మల్లెపూల పల్లకి” సాంగ్ లో రామ్ చరణ్.. చిత్ర బృందం క్లారిటీ!

మ్యూజిక్ పై ఏఐ ప్రభావం.. ఆ కష్టం బయటపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ!

పెళ్లికి సిద్ధమైన కావ్య – అనిరుధ్!

వివాదంలో మెగా హీరో.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం..

అగధ మూవీలో ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన శ్రవణ్ రెడ్డి!

అల్లు అర్జున్ కి తప్పని తిప్పలు.. వాయిదా పడ్డ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేస్?

చైల్డ్ ఆర్టిస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు.. రవితేజపై మండిపడుతున్న నెటిజన్స్!

Big Stories

Advertisement
×