E-Paper

చిన్న పిల్లలను టార్గెట్ చేసే సైకో… నరాలు కట్టయ్యే థ్రిల్లర్

చిన్న పిల్లలను టార్గెట్ చేసే సైకో… నరాలు కట్టయ్యే థ్రిల్లర్
Advertisement

Investigation Crime Thriller : క్రైమ్ థ్రిల్లర్లను ఇప్పడు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ప్రేక్షకులు. ప్రతి క్లూ ప్రేక్షకుడిని తప్పుదోవ పట్టిస్తూ, చివరి వరకు అసలు హంతకుడు ఎవరో ఊహించనివ్వని సినిమాలు మాత్రం చాలా అరుదు. అలాంటి మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ‘Forensic’ బెస్ట్ సజెషన్. 2020లో విడుదలైన ఈ మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌కు అఖిల్ పాల్, అనస్ ఖాన్ దర్శకత్వం వహించారు. టోవినో థామస్, మమతా మోహన్‌దాస్, సైజు కురుప్, రేబా మోనికా జాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫోరెన్సిక్ సైన్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన సమయంలో విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించింది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Forensic 2020 ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలైంది. అనంతరం 2020 జూన్ 7 నుంచి Netflixలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు డబ్బింగ్‌తో పాటు మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…

Advertisement

డాక్టర్ శామ్యూల్ జాన్ కట్టూక్కరన్ (టోవినో థామస్) కేరళ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో పనిచేసే మెడికో-లీగల్ నిపుణుడు. క్రైమ్ సీన్లలో చిన్నచిన్న ఆధారాలను గుర్తించి కేసులను ఛేదించడంలో అతనికి మంచి పేరుంటుంది. ఇలాంటి సమయంలో నగరంలో వరుసగా చిన్నారులు దారుణంగా హత్యకు గురవుతుంటారు. ఒకే తరహాలో జరుగుతున్న ఈ హత్యల వెనుక సీరియల్ కిల్లర్ ఉన్నాడని పోలీసులు అనుమానిస్తారు. ఈ కేసును దర్యాప్తు చేసే బాధ్యత ఏసీపీ రితికా జేవియర్ (మమతా మోహన్‌దాస్)కు అప్పగిస్తారు. కేసు క్లిష్టంగా మారడంతో ఫోరెన్సిక్ నిపుణుడు శామ్యూల్‌ను కూడా దర్యాప్తులో భాగం చేస్తారు.

మొదట ఈ కేసు సాధారణ సీరియల్ కిల్లర్ కేసులా కనిపిస్తుంది. కానీ ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ కథ కొత్త మలుపులు తిరుగుతుంది. హత్యలు జరిగిన తీరు, అక్కడ దొరికే క్లూలు, ఫోరెన్సిక్ రిపోర్టులు అన్నీ విచారణను మరింత సంక్లిష్టంగా మారుస్తాయి.
ప్రతి అనుమానితుడిపై బలమైన ఆధారాలు కనిపించినా, చివరి క్షణంలో అవన్నీ తప్పు అని తేలిపోతుంటాయి. దీంతో శామ్యూల్, రితికా ఇద్దరూ మరింత లోతుగా విచారణ ప్రారంభిస్తారు. ఇంతకీ ఆ చిన్నారులను లక్ష్యంగా చేసుకున్న సీరియల్ కిల్లర్ ఎవరు? అతని ఉద్దేశం ఏమిటి? ఫోరెన్సిక్ సైన్స్ సహాయంతో పోలీసులు కేసును ఎలా ఛేదించారు? చివరికి బయటపడే షాకింగ్ ట్విస్ట్ ఏంటి? అనేదే ఈ సినిమా అసలు కథ.

ఎందుకు చూడాలి?

Advertisement

‘Forensic’ బలం దాని స్క్రీన్‌ప్లే, ఇన్వెస్టిగేషన్ విధానం. ఫోరెన్సిక్ సైన్స్‌ను కథలో చాలా ఆసక్తికరంగా ఉపయోగించారు. ప్రతి క్లూ కథను ముందుకు తీసుకెళ్లేలా ఉండటంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. టోవినో థామస్ తన సహజమైన నటనతో ఆకట్టుకోగా, మమతా మోహన్‌దాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, సస్పెన్స్ సినిమాకు మరింత బలం చేకూర్చాయి. ‘Ratsasan’, ‘Anjaam Pathiraa’, ‘Memories’ తరహా సీరియల్ కిల్లర్ థ్రిల్లర్లు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఇష్టపడే వారికి ‘Forensic’ తప్పకుండా చూడాల్సిన సినిమా.

Read Also : సీటు అంచున కూర్చోబెట్టే మోస్ట్ డేంజరస్ సస్పెన్స్ థ్రిల్లర్లు… డోంట్ మిస్

Tags

Related News

అమ్మాయి వెంటపడే ఆగంతకులు… ఆమె చేసిన పని చూస్తే బుర్ర బ్లాస్ట్

అమ్మాయిల తలలు నరికి చంపే ఒక సైకో గ్యాంగ్… బుర్రపాడు ట్విస్టులున్న థ్రిల్లర్

లావుగా ఉన్న మహిళలను కిడ్నాప్ చేసి ఇదేం పాడు పని… వణుకు పుట్టించే థ్రిల్లర్

హత్యలు చేస్తూ పత్రికల్లో వింత పజిల్స్… కిర్రాక్ సైకో థ్రిల్లర్

తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉండదు… లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ

Malayalam Thriller : భర్త కళ్లముందే మరో అబ్బాయితో… కట్ చేస్తే బుర్రపాడు ట్విస్ట్

మిస్టీరియస్ నాలుకతో ముద్దూ ముచ్చట… మైండ్ ను మడత పెట్టే ట్విస్టులు

×