Vijay Antony: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా సక్సెస్ అందుకున్న విజయ్ ఆంటోని (Vijay Antony)త్వరలోనే మార్గన్(Margan) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇటు తెలుగులో అలాగే తమిళంలో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.లియో జాన్ పాల్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ ఆంటోని తన సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో పాల్గొన్న ఈయన డ్రగ్స్ వ్యవహారంపై స్పందించారు.
మత్తు పదార్థాలకు బానిస…
ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమను డ్రగ్స్(Drugs) వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. రోజా పూలు సినిమాతో హీరోగా ఇండస్ట్రీ పరిచయమైన నటుడు శ్రీరామ్(Sriram) ఇటీవల డ్రగ్స్ కేసులో భాగంగా అరెస్ట్ అయ్యారు. ఇక ఈయన అన్నాడిఎంకె నేత ప్రసాద్ నుంచి పెద్ద ఎత్తున మత్తుపదార్థాలను తీసుకుంటూ మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు పోలీస్ విచారణలో ప్రసాద్ తెలియజేయడంతో పోలీసులు శ్రీరామ్ ను కూడా అరెస్టు చేశారు. ఇక శ్రీరామ్ ను విచారించిన పోలీసులు మరింత కీలక సమాచారాన్ని రాబట్టారు. శ్రీరామ్ మరొక నటుడు కృష్ణ పేరుని కూడా చెప్పినట్టు తెలుస్తుంది.
పోలీసుల అదుపులోకి నటుడు కృష్ణ..
ఇకపోతే పోలీసులు నటుడు కృష్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టి ఆయనని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసు విచారణలో భాగంగా కృష్ణా కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేయడమే కాకుండా మరి కొంతమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి పేర్లను కూడా బయటపెట్టినట్టు సమాచారం. ఇలా సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న నేపథ్యంలో విజయ్ ఆంటోనీ సైతం ఈ డ్రగ్స్ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో తమిళ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది అంటూ ఈయన పుండు మీద కారం చల్లారు.
డ్రగ్స్ కు వ్యతిరేకం..
ఇప్పటికే ఏ క్షణం ఎవరు అరెస్ట్ అవుతారోనని ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో విజయ్ కూడా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం పెరిగిందని కామెంట్లు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఇక శ్రీరామ్ అరెస్టు గురించి కూడా ఈయన మాట్లాడుతూ.. శ్రీరామ్ విషయంలో నిజా నిజాలు ఏంటి అనేది పూర్తిగా తెలియదు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని, అప్పుడే అందరికీ స్పష్టత వస్తుందని తెలిపారు. ఇక నా విషయానికొస్తే నేను ఎప్పుడు వాటికి వ్యతిరేకమే, అలాంటి వాటిని ఎప్పుడు ప్రోత్సహించను అంటూ విజయ్ ఆంటోని చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. డ్రగ్స్ వ్యవహారం గతంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కూడా కుదిపేసిన సంగతి తెలిసిందే .ఎంతో మంది దర్శక నిర్మాతలు, హీరో, హీరోయిన్లు కూడా డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకొని విచారణకు కూడా హాజరైన సందర్భాలు ఉన్నాయి.
Also Read: Krishna in Drugs Case: డ్రగ్స్ కేసు వ్యవహారం.. పోలీసుల అదుపులో నటుడు కృష్ణ!