Ranabaali Pre Release: రష్మిక మందన్న విజయ్ దేవరకొండ జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం రణబాలి (Ranabaali). పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అక్టోబర్ 16వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దర్శక నిర్మాతలు హాజరై సందడి చేశారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ సుమ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక (Rashmika)ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. మీరు జయమ్మ అయితే ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే ఎలాంటి రీల్స్ చేస్తారు అంటూ ఫన్నీగా అడగడంతో కచ్చితంగా వంటలకు సంబంధించిన రీల్స్ చేస్తానని రష్మిక మందన్న చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే విజయ్ దేవరకొండను కూడా సుమ ప్రశ్నిస్తూ.. మీరు విజయ్ దేవరకొండ కాకుండా రణబాలిగా మాత్రమే ఈ సమాధానాలు చెప్పాలి అంటూ సుమ అడిగారు. రణబాలి ఎలాంటి వారిని క్షమించరు అంటూ సుమా ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ.. రణబాలి విజయ్ దేవరకొండ కంటే పది రెట్లు డేంజర్ ఎవరిని క్షమించడు.. తనని ఎవరైనా గెలికితే అసలు వదిలిపెట్టడు. రణబాలి చాలా వైలెంట్ మనిషి . ఎవరైనా మర్యాద లేకుండా మాట్లాడితే అస్సలు వదలడు అంటూ రణబాలి గురించి విజయ్ దేవరకొండ చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా సుమ మరో ప్రశ్న వేస్తూ..జనాల కోసం రణబాలి ఎలాంటి త్యాగం చేస్తాడంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ రణబాలిగా సమాధానం చెబుతూ..జనాల కోసం ప్రాణాలైనా ఇస్తాడని సమాధానం చెప్పారు. ఇప్పుడు రణబాలి ఉంటే ప్రస్తుతం దేని గురించి పోరాటం చేస్తాడు అంటే జనాల సంతోషం కోసంమే పోరాటం చేస్తాడనీ తెలిపారు.
ఈ విధంగా విజయ్ దేవరకొండ రణబాలి అయితే తనని ఎవరైనా గెలికితే అసలు వదలనని సమాధానం చెప్పడంతో ఇది రణబాలి మాదిరి కాకుండా విజయ్ దేవరకొండ మాదిరిగానే చెప్పారు అంటూ ఈ వ్యాఖ్యల పై నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సినిమా ఏదైనా విడుదల అవుతుంది అంటే కచ్చితంగా తనని తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఇంత నెగిటివిటీని కూడా ఎదుర్కొంటు విజయ్ దేవరకొండ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రణబాలి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.
Also Read: సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..