E-Paper
Advertisement

సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..

సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..
Advertisement

Jayammu Nischayammu raa 2: జగపతిబాబు హోస్ట్ గా నిర్వహిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం జయము నిశ్చయమురా సీజన్ 2 (Jayammu Nischayammu raa2) ప్రసారానికి సిద్ధమవుతుంది. ఈ ఆదివారం ఈ కార్యక్రమానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఇక మొదటి ఎపిసోడ్ లో భాగంగా సినీ నటి సాయి పల్లవి(Sai Pallavi) హాజరైన సంగతి తెలిసిందే.

డాక్టర్ గా హెల్ప్ చేయడం ఇష్టం..

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా జగపతిబాబు మాట్లాడుతూ మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు అంటూ ప్రశ్నించగా ఏదైనా ఒక లైన్ చెప్పండి అంటూ సాయి పల్లవి అడిగారు వెంటనే జగపతిబాబు ఫన్ బెంచ్ అంటూ మాట్లాడటంతో సాయి పల్లవి ఆశ్చర్యపోయారు. అటెండెన్స్ లో మాత్రం నా పేరు ఉంటుంది కానీ క్లాస్ మాత్రం నేను ఉండను అంటూ సరదాగా అప్పటి విషయాలను ముచ్చటించారు. అనంతరం జగపతిబాబు డాన్సర్ నుంచి డాక్టర్ ఎలా అయ్యావు అని అడగడంతో తనకు డాక్టర్ చదవడం ఇష్టం అని సాయి పల్లవి చెప్పారు.

నాపైన అలాంటి నమ్మకం పెట్టుకోవద్దు…

Advertisement

ఇలా తనకు డాక్టర్ అయ్యి అందరికీ హెల్ప్ చేయడం ఇష్టమని చెప్పారు. సాయి పల్లవి ఇలా చెప్పగానే వెంటనే జగపతిబాబు సాయి పల్లవి సెట్లో ఉందంటే అందరికీ ఒక ధైర్యం అంటూ మాట్లాడటంతో అయ్యో నా పైన ఆ నమ్మకంతో ఉండకండి అంటూ మాట్లాడారు. ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా జగపతిబాబు నాగచైతన్యతో వీడియో కాల్ మాట్లాడారు. ఇక నాగచైతన్య(Nagachaitanya) సైతం సాయి పల్లవికి సంబంధించి ఒక సీక్రెట్ బయటపెట్టారు. సాయి పల్లవి షూటింగ్ ప్రారంభమైన మూడో రోజు వచ్చి నువ్వు చాలా ఇన్నోసెంట్ గా నన్ను అడిగావు అంటూ మాట్లాడారు. సాయి పల్లవి ఏం మాట్లాడారు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

?psln=c2xkNmpjMGJwdzF2

Advertisement

నాగచైతన్య జగపతిబాబుతో మాట్లాడుతూ చో మామ తాను ఎక్కువ మాట్లాడలేదు అంటే మీరు నమ్మొద్దు.. ఆమె చాలా ఎక్కువగా, బాగా మాట్లాడుతుంది అంటూ నాగచైతన్య సాయి పల్లవికి సంబంధించిన ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సాయిపల్లవి ఎలాంటి విషయాలను అభిమానులతో పంచుకున్నారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈమె నటించిన రామాయణ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లలో భాగంగా సాయిపల్లవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలుస్తోంది.

Also Read: కార్తీక దీపం 2 సూరజ్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? లక్షల్లోనే..

Related News

త్రిగుణ్ ఆడే గేమ్ నాకు ముందే అర్థమైంది.. చరణ్ తేజ

బిగ్ బాస్‌లో ఎక్కువ కనిపించాలంటే గొడవలు చేయాలా? చరణ్ తేజ ఆన్సర్ ఇదే !

కార్తీక దీపం 2 సూరజ్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? లక్షల్లోనే..

కార్తీకదీపం 2 సీరియల్ లో జోత్స్న మిస్సింగ్… ఎందుకు తప్పుకున్నారో తెలుసా?

నువ్వింకా శీలవతివేనా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన వేణుస్వామి భార్య!

రోహిత్ వర్సెస్ వంశీ.. శాలిని పై నీతూ ఫైర్.. అసలేం జరుగుతోంది?

వేలల్లో సబ్స్క్రైబర్స్..లక్షల్లో సంపాదన.. విష్ణు ప్రియ నెల సంపాదన తెలిస్తే మతి పోవాల్సిందే!

Big Stories

Advertisement
×