Vijay Devarakonda Kindom Movie Story Leak: రౌడీ హీరో విజయ్ దేవరకొండ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘కింగ్డమ్’. లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల తర్వాత విజయ్ నుంచి వస్తున్న చిత్రమిది. భారీ విజయం సాధిస్తాయనుకున్న ఈ సినిమాలు ఘోర పరాజయం పొందాయి. ది ఫ్యామిలీ స్టార్ మంచి విజయం సాధించింది. కానీ, ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ సాధించలేదు. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కిన లైగర్ ఎవరూ ఊహించని స్థాయిలో డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయారు. ఖుషితో అయిన మళ్లీ కంబ్యాక్ ఇస్తాడనుకుంటే ఇది కూడా నిరాశ పరిచింది. దీంతో విజయ్ ఈసారి గట్టి కంబ్యాక్ కోసం చూస్తున్నాడు.
బజ్ పెంచిన కింగ్డమ్ టీజర్
కాస్తా గ్యాప్ తీసుకుని దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో జతకట్టాడు. వీరిద్దరి కాంబో తెరకెక్కుతోన్న చిత్రమే ‘కింగ్డమ్’. జెర్సీ లాంటి సూపర్ హిట్ అందించి గౌతమ్ తిన్ననూరిపై విజయ్ తో పాటు అభిమానులు కూడా నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్, టీజర్, ప్రోమోలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇవి చూసిన తర్వాత విజయ్ కి ఎలాగైన పెద్ద హిట్ అందించాలని గౌతమ్ తిన్ననూరి సైతం గట్టిగానే ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇందులో విజయ్ మిలటరీ మ్యాన్ గా కనిపించబోతున్నాడు. ఇందులో అతడి ఇంటెన్స్ లుక్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ లో విజయ్ మిలటరీ మ్యాన్ గా, ఉద్యమ నాయకుడిగా కనిపించాడు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన పోస్టర్స్, కంటెంట్ చూస్తే కింగ్డమ్ మూవీ మిలటరీ బ్యాక్డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది.
కింగ్డమ్ స్టోరీ ఇదే..
కానీ, ఈ మూవీ కథ, కథనంపై మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఈ మూవీ స్టోరీ ఏంటనేదనేది తెలుసుకునేందుకు ఫ్యాన్స్ అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో కింగ్డమ్ స్టోరీ లీక్ అయ్యింది. ఈ సినిమా రియల్ ఇన్సీడెంట్ ఆధారంగా తెరకెక్కుతోందని సమాచారం. అదే శ్రీలంకలో జరిగిన ఓ ఉద్యమ పోరు నేపథ్యంలో కింగ్డమ్ మూవీ సాగనుందట. 2009లో శ్రీలంకలో అంతమైన ఓ ఉద్యమ పోరు గౌతమ్ తిన్ననూరి వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడట. ఎల్ టీటీఈ (LTTE) ఉద్యమ నాయకుడు ప్రభాకరన్ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీలంక లో ప్రత్యేక తమిళ రాష్ట్రం కోసం ఆ దేశ ప్రభుత్వాన్ని ముంపు తిప్పలు పెట్టాడు. ఆయన పేరు చెబితే ఇప్పటికీ శ్రీలంక ప్రభుత్వం హడలెత్తిపోతుంది. శ్రీలంక బానిస సంకేళ్ల నుంచి తమిళులను విడిపించేందుకు ఆయన ఓ ఉద్యమమే చేశారు. ఆఖరికి శ్రీలంక ప్రభుత్వం 2009లో పథకం వేసి ప్రభాకరన్ ను హతమార్చింది.
విజయ్ కి ‘ప్రభాకరన్’ ప్లస్ అయ్యేనా?
దీంతో ఆ ఉద్యమం ఆగిపోయింది. అయితే విజయ్ కింగ్డమ్ మూవీ ఇదే నేపథ్యంలో సాగనుందట. ఆయన స్ఫూర్తి, పోరాట భావాలు ఉన్న వ్యక్తిగా విజయ్ ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్. సినిమాలో ఓ సన్నివేశంలో ఎల్ టీటీఈ ప్రభాకరన్ కూడా కనిపిస్తాడని కూడా అంటున్నారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అలాగే ఇందులో తల్లి సెంటిమెంట్ కూడా కీలకంగా ఉండబోతుందట. లవ్, యాక్షన్ ఎమోషనల్ రైడ్ కింగ్డమ్ మూవీ సాగుతుందని తెలుస్తోంది. కాగా గతంలో LTTE ఉద్యమ నాయకుడు ప్రభాకరన్ జీవిత కథపై తెలుగులో ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ హీరోగా డైరెక్టర్ అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో ఒక్క మిగిలాడు అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ఆశించిన విజయ్ అందుకోలేదు. కానీ, మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అలాంటి కథతో విజయ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ కి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.
Also Read: ఓజీలోనే కాదు, ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా.. ఫ్యాన్స్ కి పూనకాలే