BigTV English

Maglev Train: అబ్బ.. ఈ రైలు వస్తే సికింద్రాబాద్ నుంచి విశాఖకు గంటలోనే!

Maglev Train: అబ్బ.. ఈ రైలు వస్తే సికింద్రాబాద్ నుంచి విశాఖకు గంటలోనే!

అత్యాధునిక బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తీసుకు రావడంలో చైనా తర్వాతే మరెవరైనా అని చెప్పుకోవచ్చు. డ్రాగన్ కంట్రీ తాజాగా మాగ్లెవ్ రైలును అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీని వేగం అక్షరాలా 650 కిలో మీటర్లు. జెట్ విమానాలకు మించిన వేగంతో ఈ రైలు దూసుకెళ్తుంది. AI, సూపర్ కండక్టర్లు, జీరో ఘర్షణతో పట్టాల మీద తేలియాడుతూ ముందుకుసాగనుంది.  జీరో వీల్స్, జీరో డ్రాగ్ తో చైనాకు చెందిన ఈ సూపర్ కండక్టింగ్ మాగ్లెవ్ రైలు.. మాగ్నెటిక్ శక్తి క్షేత్రాలపై తేలుతుంది. వాక్యూమ్ క్లీనర్ కంటే తక్కువ శబ్దంతో జెట్ వేగంతో పరుగెత్తుతుంది. ఇంజనీర్లు దీనిని భూమిపై అత్యంత సున్నితమైన ప్రయాణం చేసే రైలుగా అభివర్ణించారు.


నో లోకో పైలెట్.. 7 సెకెన్లలో 50 కిలో మీటర్ల వేగం

7 సెకన్లలో 50 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. లిఫ్ట్ ఆఫ్ సమయంలో G-ఫోర్స్ వ్యోమగాములు పొందే అనుభూతిని ప్రయాణీకులు పొందుతారు. చైనా ఫ్యూచర్ ట్రాక్స్ మీద ఈ రైలు ప్రయాణిస్తుంది. బీజింగ్ లో బ్రేక్ ఫాస్ట్ చేసి ఈ రైలు ఎక్కితే, షాంఘైలో భోజనం చేసే అవకాశం ఉంటుంది. ఈ రెండు నగరాలను ఈ రైలు కేవలం 2.5 గంటల్లో కలపనుంది. ఇక ఈ రైలులో లోకో పైలెట్స్ ఉండరు. స్టీరింగ్ వీల్ ఉండదు. కేవలం AI, 5G, సెన్సార్లు మాత్రమే రైలును నడుపుతాయి. ఈ రైలు లెవిటేషన్ ట్రిక్ ప్రకారం నడుస్తుంది. సూపర్ కూల్డ్ అయస్కాంతాలు సైన్స్ ఫిక్షన్ కంటే వేడిగా ఉంటాయి. అధిక-ఉష్ణోగ్రత సూపర్ కండక్టర్లను ఉపయోగించడం ద్వారా చైనీస్ ఇంజనీర్లు ఈ రైలును ముందుకు వెళ్లేలా రూపొందించారు. ఈ రైలు అత్యధిక వేగంతో వెళ్లడంతో పాటు సడెన్ గా ఆగే శక్తి కూడా ఉంది.


Read Also:  ఈ రోజు నుంచి రైల్వే రూల్స్ మారాయ్.. టికెట్ బుకింగ్స్ లో భారీ మార్పులు!

 సికింద్రాబాద్ నుంచి విశాఖకు జస్ట్ గంట ప్రయాణం

చైనా మాగ్లెవ్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం గంటలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ రైలు ఢిల్లీ నుంచి ముంబైకి 2 గంటల్లో వెళ్తుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే చాలా మందికి విమానాశ్రయాలలో వేచి చూసే ఇబ్బంది తప్పనుంది. చైనా మాగ్లెవ్ టెక్నాలజీ 2,000 కి.మీ కంటే తక్కువ దూరాలు ఉన్న ఎయిర్ లైన్స్  ప్రయాణాల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది.  చైనా ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ముఖ్య నగరాలను కలిపేలా ఈ మాగ్లెవ్ రైల్వే మార్గాలను ఏర్పాటు చేయబోతోంది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యంకాని రీతిలో హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. రోజు రోజుకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ కళ్లు చెదిరే వేగంతో వెళ్లే రైళ్లను పరిచయం చేస్తోంది. ఈ మాగ్లెవ్ రైలు హైస్పీడ్ బుల్లెట్ రైల్ వ్యవస్థలో మైల్ స్టోన్ కాబోతోంది.

Read Also: పడవ మీద ఒళ్లు కదలకుండా డ్యాన్స్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ కుర్రాడెవరో తెలుసా?

Related News

Flight Passenger: ఫ్లైట్ 14 గంటలు ఆలస్యమైతే బర్గర్ ఇస్తారా? ప్రయాణీకుడికి రూ. 55 వేలు కట్టాల్సిందే!

Bengaluru Woman Cop: యూకే వెళ్లే ఫ్లైట్ మిస్, పోలీసుకు రూ. 2 లక్షల జరిమానా!

IRCTC Tour Packages: డిసెంబర్‌లో కేరళ, కశ్మీర్ ట్రిప్‌కు వెళ్లాలా? అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ!

Longest Passenger Train: ఈ ఒక్క రైలుకే 100 బోగీలు.. 25 ఇంజిన్లు.. ఇది ఎక్కడ నడుస్తోందంటే?

India – Pakistan: భారత్, పాక్ ప్రధాన మంత్రులు ప్రయాణించే విమానాల్లో ఇన్ని తేడాలా? ఏ విమానం గొప్ప?

Traffic Diversions: గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు!

Big Stories

×