Rana Bali:విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో ఈ పేరు ఒక సెన్సేషన్. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతోనే కాకుండా, తన యాటిట్యూడ్‌తో మిలియన్ల కొద్దీ అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న ఈ రౌడీ బాయ్, ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. అయితే, సినిమా ఎంత క్రేజ్ సంపాదించుకుంటుందో, అంతే స్థాయిలో విజయ్ చుట్టూ వివాదాలు, రూమర్లు కూడా ముసురుకుంటూనే ఉంటాయి. తాజాగా ఈ సినిమా సెట్స్ లో విజయ్ ప్రవర్తన గురించి సోషల్ మీడియాలో కొన్ని షాకింగ్ వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ ఏకంగా ఐదు లగ్జరీ కారవాన్లు కావాలని పట్టుబట్టారని, తన వ్యక్తిగత స్టాఫ్ కోసం భారీగా డిమాండ్లు చేశారంటూ నెట్టింట ఒక వర్గం నెగెటివ్ ప్రచారాన్నిచేసింది. స్టార్ డమ్ తలకెక్కి ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారంటూ కొందరు ట్రోల్స్ కూడా మొదలుపెట్టారు. అయితే, ఈ రూమర్లకు విజయ్ దేవరకొండ అఫీషియల్ టీమ్ చాలా సీరియస్‌గా కౌంటర్ ఇచ్చింది. ఇవన్నీ కేవలం విజయ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి కావాలనే సృష్టించిన నిరాధారమైన అబద్ధాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఉద్దేశపూర్వకంగా ఇటువంటి అసత్య కథనాలను ప్రచారం చేసే సోషల్ మీడియా హ్యాండిల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also read :పాపం హరీష్ శంకర్ …అసలు లెక్క చేయని నవీన్ పోలిశెట్టి!
ఈ వివాదానికి పూర్తిగా చెక్ పెడుతూ చిత్ర నిర్మాత రవి కూడా రంగంలోకి దిగారు. విజయ్ దేవరకొండ షూటింగ్‌లో అత్యంత క్రమశిక్షణతో ఉంటారని, టైమ్ మేనేజ్‌మెంట్‌లో ఆయన్ను మించిన వారు లేరని ప్రశంసించారు. నిర్మాతగా తనకు విజయ్ నుండి ఎలాంటి అదనపు డిమాండ్లు రాలేదని, ఆయన పూర్తి సహకారం వల్లే సినిమా అనుకున్న సమయానికి పూర్తవుతోందని క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి తెరపడింది.
మరోవైపు ‘రణబాలి’ సినిమా విషయానికి వస్తే, ‘టాక్సీవాలా’ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. 1854 నుండి 1878 మధ్య కాలంలో బ్రిటిష్ పాలన బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, విజువల్ వండర్‌గా ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు.
Also read :తారక్ రికార్డ్‌పై ‘పెద్ది’ గురి తప్పిందా?.. ఎంత కష్టపడినా చరణ్‌కు అది అందని ద్రాక్షేనా ?
ఈ సినిమాలో విజయ్ సరసన లక్కీ గర్ల్ రష్మిక మందన్న నటిస్తుండటం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు యూత్‌లో ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ హిట్ జోడీ స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతూ దాదాపు 90 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మిగిలిన టాకీ పార్ట్ మరియు ప్యాచ్ వర్క్ ను కూడా వీలైనంత త్వరగా ముగించి, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ‘రణబాలి’ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్లు, కాన్సెప్ట్ పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఖచ్చితంగా ఈ సినిమా విజయ్ దేవరకొండను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తుందని, ఆయన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఇండస్ట్రీ టాక్. వివాదాలను పక్కన పెట్టి రౌడీ హీరో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.