E-Paper
Advertisement

పెద్ది కుటుంబానికి అండగా కేసీఆర్.. ఫ్యామిలీకి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం!

పెద్ది కుటుంబానికి అండగా కేసీఆర్.. ఫ్యామిలీకి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం!
Advertisement

KCR Aid: అనారోగ్యంతో మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అండగా నిలిచారు. ఆ కుటుంబానికి పార్టీ తరపున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అందులో పెద్ది ఇద్దరు కుమారులకు చెరో రూ.కోటి ఇవ్వనుండగా.. అనారోగ్యంతో ఉన్న పెద్ది తల్లి అమృతమ్మ వైద్య ఖర్చుల కోసం మరో రూ.25 లక్షలు కేటాయించారు. వరంగల్ జిల్లా ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

అయితే పెద్ది ఫ్యామిలీకి ఈ ఆర్థిక సాయంతో పాటు పిల్లల భవిష్యత్తు, చదువుకు బీఆర్ఎస్ తరపున అండగా నిలవాలని కేసీఆర్ నిర్ణయించారు. పెద్ది కుటుంబ బాగోగులను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. దివంగత నేత దశదినకర్మల కార్యక్రమం ముగిసిన తర్వాత పెద్ది కుటుంబంతో చర్చించి.. వారి అభిప్రాయలకు అనుగుణంగా పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Also Read: అమ్మాయి ఆత్మహత్య వెనుక అంతర్జాతీయ కుట్ర… తెలుగులోనే ఉంది ఈ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్

ఇదిలా ఉంటే ఆదివారం నర్సంపేట నియోజకవర్గంలోని పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లికి కేసీఆర్ వెళ్లనున్నారు. ఇంటి పెద్దను కోల్పోయి బాధలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. అటు ముఖ్యనేతను కోల్పోయి విషాదంలో మునిగిపోయిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానుల్లోనూ కేసీఆర్ ధైర్యం నింపనున్నారు.

Advertisement

Also Read: ఇద్ద‌రూ దోస్తులే.. మ‌రి బెడిసికొట్టిందెక్క‌డ‌..? ఇక ఆయ‌న‌ను న‌మ్మ‌డ‌మూ క‌ష్ట‌మేనా..?

Tags

Related News

సుప్రీంలో చుక్కెదురు.. దానం నాగేందర్ ఆసక్తికర రియాక్షన్.. ‘ఇది ముందే తెలుసంటూ..!’

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

Big Stories

Advertisement
×