E-Paper
Advertisement

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా
Advertisement

Legal Thriller Series: నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఎన్నో సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయి. అయితే కొన్ని స్టోరీలు ఊహకందని మలుపులతో పిచ్చెక్కిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బ్రెజిల్‌ అలాంటి ఇంటెన్స్ నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. చేయని నేరానికి ఓ యువకుడు జైలుకు వెళ్లిపోయాక, ఓ లా ప్రొఫెసర్ తన విద్యార్థులతో కలిసి కేసును మళ్లీ రీ ఓపెన్ చేస్తాడు. అసలు ఆ యువకుడు నిజంగానే నిర్దోషేనా? లేక ఈ కేసు వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఇలాంటి ఇంటెన్స్ లీగల్ డ్రామాతో వచ్చిన పోర్చుగీస్ సిరీస్ ‘Habeas Corpus’. Netflix బ్రెజిల్ రూపొందించిన తొలి లీగల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో మార్జోరీ ఎస్టియానో, అనీ గాబ్రియెల్లీ ప్రధాన పాత్రల్లో నటించారు.

కథలోకి వెళ్తే 

‘హాబియస్ కార్పస్’ (Habeas Corpus) అనే ఈ పోర్చుగీస్ లీగల్ డ్రామా విషయానికి వస్తే… ఇది నెట్‌ఫ్లిక్స్ బ్రెజిల్ రూపొందించిన తొలి కోర్టురూమ్ సస్పెన్స్ సిరీస్. గతంలో ప్రముఖ లాయర్‌గా పనిచేసి కొన్ని కారణాల వల్ల న్యాయస్థానాలకు దూరమైన ప్రొఫెసర్ ఇనెజ్, ప్రస్తుతం యూనివర్సిటీలో విద్యార్థులకు లా బోధిస్తూ ఉంటుంది. అయితే ఓ అమాయక యువకుడు తాను చేయని నేరానికి తప్పుడు కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడని తెలుసుకున్న ఇనెజ్, అతనికి ఎలాగైనా న్యాయం చేయాలని నిశ్చయించుకుంటుంది. అందుకోసం తన తెలివైన విద్యార్థులతో కలిసి ఓ ‘క్రిమినల్ రివ్యూ టీమ్’ను ఏర్పాటు చేసి ఆ కేసును మళ్లీ తిరగదోడుతుంది.

Advertisement

ఆ కేసును మొదటి నుంచి లోతుగా విచారిస్తున్న కొద్దీ అప్పటి దర్యాప్తులోని లోపాలు, తప్పుడు సాక్ష్యాలు, కోర్టు ఇచ్చిన తీర్పు వెనుక ఉన్న షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. దీంతో ఇప్పటివరకు నిజమని నమ్మిన విషయాలన్నీ తలకిందులవుతాయి. అయితే ఈ టీమ్‌లో చేరిన మెరీనా అనే విద్యార్థిని కేవలం చదువు కోసం మాత్రమే ఇనెజ్ దగ్గరకు రాలేదని తెలుస్తుంది. మెరీనా కుటుంబానికి గతంలో జరిగిన ఓ అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు, న్యాయం సాధించేందుకే ఆమె ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందనే విషయం కథలో అసలైన మలుపుగా మారుతుంది.

ఈ కేసు విచారణ, ప్రొఫెసర్ ఇనెజ్ గతం, మెరీనా రహస్య లక్ష్యం ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయనేది ఈ సిరీస్‌ను ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ముందుకు నడిపిస్తుంది. నిజాన్ని నిరూపించేందుకు చేసే ఈ పోరాటంలో కోర్టురూమ్ డ్రామా, లీగల్ టెన్షన్, ఊహించని ట్విస్టులు వీక్షకులను ఆకట్టుకుంటాయి. బ్రెజిల్‌లోని ‘Innocence Project Brasil’ సేకరించిన నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

Netflixలో స్ట్రీమింగ్

Advertisement

లూయిజ్ విలాసా, లియోనార్డో మోరెయిరా, డోన్నా ఒలివెయిరా ఈ సిరీస్‌ను రూపొందించారు. లూయిజ్ విలాసా, ఫ్లావియా లాసెర్డా ఎపిసోడ్లకు దర్శకత్వం వహించారు. మార్జోరీ ఎస్టియానో, అనీ గాబ్రియెల్లీతో పాటు వ్లాదిమిర్ బ్రిచ్టా, డాంటన్ మెల్లో, నటాలియా లాజ్, మారిసా ఓర్త్, నరునా కోస్టా తదితరులు నటించారు. ‘Habeas Corpus’ సెప్టెంబర్ 23 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది పోర్చుగీస్ భాషలో రూపొందిన బ్రెజిలియన్ కోర్ట్‌రూమ్ డ్రామా. లీగల్ మిస్టరీ, కోర్టు రూమ్ టెన్షన్, గత రహస్యాలు, వరుస ట్విస్టులు ఇష్టపడేవారికి ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉంటుంది.

Read Also: చీకట్లో విరుచుకుపడ్డ వింత రాక్షసులు… 500 ఏళ్ల నాటి నిజం బట్టబయలు… అర్ధరాత్రి ఆ అడవిలో ఏం జరిగింది ?

Tags

Related News

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఫ్రెండ్ కోసం ఫేక్ డేటింగ్… ప్రొఫెసర్‌తో ఆ పనిదాకా వెళ్తే… ఈ రొమాంటిక్ కామెడీ తెలుగులోనే

ముంబైని వణికించే మూగ చెవిటి లేడీ సైకో… వణుకు పుట్టించే డార్క్ క్రైమ్ థ్రిల్లర్

మిలిటరీ స్కూల్‌లో ఫ్రెండ్ అదృశ్యం… ఇంటెన్స్ సిరీస్‌ను టీనేజర్స్ డోంట్ మిస్

Big Stories

Advertisement
×