Vishwambhara Update:అసలు వస్తుందా రాదా… మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర అప్ డేట్ ఏమైనా వదులుతారా లేదా అన్న ఎదురు చూపులకి ఎండ్ కార్డ్ వేస్తూ ఎట్టకేలకి ఊహించని ఊహించని రేంజ్ లో సర్ ప్రైజ్ ఇచ్చింది విశ్వంభర మూవీ టీమ్. ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా అభిమానులని మురిపిస్తూ ఒక స్పెషల్ పోస్టర్‌తో పాటు అత్యంత పవర్‌ఫుల్ గా ఉన్న ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (OST)ను అఫీషియల్ గా వదిలారు మేకర్స్.
ఇక ఈ అప్‌డేట్ ఇలా బయటకు వచ్చిన నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపొయింది.ఇక మేకర్స్ వదిలిన ఈ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ పోస్టర్ లో చిరంజీవి లుక్ ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా చాలా ఇంటెన్స్ అండ్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.ఇక చిరు చేతిలో పరమశివుడి త్రిశూలాన్ని గుర్తుచేసే విధంగా ఒక భారీ ఆయుధం కనిపిస్తోంది.
ఆ ఆయుధంపై ఉన్న ఒక అరుదైన రత్నం వెలుగు చిరంజీవి కంటిపై పడినట్టుగా డిజైన్ చేసిన తీరు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసిందనే చెపాలి. ముఖ్యంగా గ్రీన్ కలర్‌లో మెరిసిపోతున్న ఆయన కన్ను చూస్తుంటే,సినిమాలో ఏదో పెద్ద విజువల్ మ్యాజిక్ ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక్క పోస్టర్ తోనే విశ్వంభర లోని ఫాంటసీ ప్రపంచం ఏ స్థాయిలో ఉండబోతోందో మేకర్స్ హింట్ ఇచ్చేశారు.
పోస్టర్ ఒకెత్తయితే, ఈ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (OST) మరో ఎత్తు. సంస్కృత శ్లోకాలతో పాటు భారీ ఆర్కెస్ట్రా మ్యూజిక్ కలగలిపి అందించిన ఈ బ్యాక్‌గ్రౌండ్ ట్రాక్ వింటుంటే థియేటర్ లో పూనకాలు రావడం పక్కా అని ఫిక్స్ అయిపోతున్నారు మెగా ఫ్యాన్స్.
ఇక ఈ వినసొంపైన సౌండ్ డిజైనింగ్ అండ్ బిజీఎమ్ కు గౌరా హరి వర్క్ చేయగా, సినిమా మొత్తానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్ OST విన్న అభిమానులు థియేటర్లలో విజువల్స్ కి ఈ బిజీఎమ్ తోడైతే పూనకాలు రావడం ఖాయమని కామెంట్లు పెడుతుండటం విశేషం.
‘బింబిసార’ చిత్రంతో తన సత్తా చాటుకున్న వశిష్ఠ ఈ సోషియో-ఫాంటసీ విజువల్ వండర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఇందులో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుండగా, అషికా రంగనాథ్ మరియు బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు శరవేగంగా జరుగుతున్నాయట కూడా
వాస్తవానికి ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల వల్లే కాస్త డిలే అవుతుంది అన్న టాక్ ఉంది.అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మరింత టైమ్ తీసుకుని సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.అయితే ఈ అప్ డేట్ వదిలారు కాస్త ఆ రిలీజ్ అప్ డేట్ కూడా వదిలి ఉంటే ఇంకా బాగుంటుందని కామెంట్స్ పెడుతున్నారు మెగా ఫ్యాన్స్.
also read :ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?
ఏది ఏమైనా సినిమా రావడం లేట్ అవ్వచ్చేమో కాని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు అంతా ! మొత్తానికి అసలే ఎలాంటి అప్ డేట్ రావట్లేదని డీలా పడ్డ అభిమానులని ఇలా కూల్ చేశారన్న మాట !
Happy Birthday to the mighty Megastar @KChiruTweets Garu ❤️
Unveiling a special poster and OST on this special day 💥
The audience will soon witness MEGA MASS BEYOND THE UNIVERSE with #Vishwambhara 🌟
MEGASTAR @KChiruTweets @trishtrashers @DirVassishta @mmkeeravaani… pic.twitter.com/XzZRankwEn
— UV Creations (@UV_Creations) August 22, 2026