E-Paper
Advertisement

పోలీసులను ఆశ్రయించిన ఫోక్ డాన్సర్ మాధురి.. కేస్ ఫైల్!

పోలీసులను ఆశ్రయించిన ఫోక్ డాన్సర్ మాధురి.. కేస్ ఫైల్!
Advertisement

Madhuri Rathod: ప్రమీల ఓ ప్రమీల, బాసింగ బలాలు అంటూ ఫోక్ సాంగ్స్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మాధురి రాథోడ్ (Madhuri Rathod) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈ పాటలో సహా డాన్సర్ గా ఈశ్వర్ సాయి అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. పైగా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి ఈ ఇద్దరు ఇప్పుడిప్పుడే మంచి క్రేజ్ సొంతం చేసుకొని.. ఇండస్ట్రీలో దూసుకుపోతుంటే అనూహ్యంగా ఎఫైర్ కొనసాగించి వేములవాడలోని రెడ్డి భవన్లో ఈశ్వర్ సాయి భార్యకు అడ్డంగా దొరికిపోయారు.

పోలీసులను ఆశ్రయించిన ఫోక్ డాన్సర్ మాధురి..

అలా రిలేషన్ కారణంగా ఒక్కసారిగా ఈ జంట వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా మాధురి రాథోడ్ దే తప్పు అంటూ ఈశ్వర్ సాయి భార్య చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. అయితే ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు మాధురి రాథోడ్ కు మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆమె వేములవాడ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. తనపై అకారణంగా దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జానపద కళాకారిణి మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారంటూ ఆవేదన..

Advertisement

ఈనెల 19న రెడ్డి భవన్లో ఉన్న సమయంలో తోటి నటుడు ఈశ్వర్ సాయి భార్య శరణ్య కొందరితో కలిసి వచ్చి అకారణంగా అసభ్యకరమైన భాషతో దూషించడమే కాకుండా తనపై దాడి కూడా చేశారని ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఈ గొడవను వీడియోగా చిత్రీకరించారని , తన వద్ద ఉన్న సుమారుగా 50వేల విలువైన ఐఫోన్ ను దొంగలించారంటూ ఆమె ఆరోపణలు చేసింది.

also read:ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ము దులిపేస్తున్న రవితేజ!

వ్యక్తిగత గౌరవానికి భంగం..

Advertisement

అంతేకాదు ఈ వీడియోలను సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లలో అప్లోడ్ చేసి తనపై చాలా అసత్య ప్రచారాలు చేశారని, సమాజంలో తనకున్న పరువుకు భంగం కలిగించారని, ఈ క్రమంలోనే తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా పలు వార్తలు ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఇకపోతే మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వీరప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.

మాధురి రాథోడ్ కెరియర్..

ఇకపోతే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె బాల్యం, డాన్స్ పట్ల తనకున్న అంకితభావం , డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఉన్న క్రేజ్ గురించి చెప్పుకొచ్చింది. మేము మొత్తం ఏడుగురు తోబుట్టువులం కాగా అందులో నేను ఐదవ దాన్ని. నా తల్లి నా ముగ్గురు సోదరీమణులను డాన్స్ క్లాసులకు పంపినప్పటికీ .. నన్ను మాత్రం పంపలేదు. అయినప్పటికీ డాన్స్ పట్ల నాకున్న మక్కువ మా అమ్మను ఆపలేకపోయింది. టీవీలో హీరో హీరోయిన్లు వేసే డాన్స్ చూసి, వారి స్టెప్పులను కాపీ చేస్తూ ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేస్తూ స్వయంగా నేను డాన్స్ నేర్చుకున్నాను. ఇక సోషల్ మీడియా ప్రయాణాన్ని బీటెక్ ఫైనల్ ఇయర్ లో టిక్ టాక్ తో మొదలు పెట్టాను అంటూ తన కెరీర్ ను గురించి చెప్పుకొచ్చింది .ఒకరోజు జానపద పాట పై డాన్స్ చేయడంతో అది బాగా వైరల్ అయిందని ఇక అప్పటినుంచి ఇలా ఫోక్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నానని తెలిపింది.

Related News

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Karthika Deepam 2 Serial Today Episode October 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి చేస్తానన్న దీప              

Big Stories

Advertisement
×