E-Paper
Advertisement

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!
Advertisement

Delhi Protests: దేశంలో చిచ్చు పెట్టేందుకు నిత్యం కుట్రలు చేస్తున్న పాకిస్థానీలు.. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలను కూడా అవకాశంగా చేసుకున్నారు. సోషల్​ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వీడియోలు, పోస్టులు అప్​ లోడ్ చేశారు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ స్పెషల్ సెల్​ పోలీసులు.. 200కు పైగా పోస్టులను డిలీట్​ చేశారు. పలు అకౌంట్లను బ్లాక్​ చేశారు. అదే సమయంలో నాలుగు ఎఫ్​ఐఆర్​ లు నమోదు చేశారు.

సీఈసీ జ్ఞానేశ్వర్​ కుమార్​ రాజీనామాతో పాటు స్పెషల్ ఇంటెన్సీవ్​ రివిజన్​ ను వెంటనే నిలిపి వేయాలంటూ కాంగ్రెస్​ సహా పలు ప్రతిపక్ష పార్టీలు దేశ రాజధానిలో నిరసనలు జరుపుతున్న విషయం తెలిసిందే. కాక్రోచ్​ జనతా పార్టీ కూడా ఆందోళనల్లో చురుకుగా పాలు పంచుకుంటోంది. ఈ క్రమంలో నిరసనకారులపై పోలీసులు పలుమార్లు లాఠీఛార్జ్​ జరిపారు. పలువురు నాయకులతోపాటు నిరసనకారులను అరెస్టులు చేశారు.

Advertisement

ఇదే అదునుగా భావించిన కొందరు పాకిస్థానీలు.. దేశంలో అశాంతిని సృష్టించటానికి రంగంలోకి దిగారు. గతంలో జరిగిన పోలీస్​ ఫైరింగ్​ వీడియోలను సోషల్​ మీడియాలో అప్​ లోడ్​ చేసి ఢిల్లీ ఆందోళనలను అడ్డుకోవటానికి పోలీసుల అరాచకత్వం అంటూ పోస్టులు పెట్టారు. వేర్వేరు గ్రూపులకు షేర్​ చేశారు. అయితే ఇవన్నీ కేంద్ర అధికారిక సంస్థ పీఐబీ ఫ్యాక్ట్​ చెక్​ ఇవన్నీ తప్పుడు వీడియోలను నిర్ధారించింది. గతంలో జరిగిన సంఘటనలను ఇప్పుడు జరిగినట్టుగా సోషల్​ మీడియాలో పెట్టారని స్పష్టం చేసింది.

Also Read: ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఊహించని షాక్.. ఇంటికి భారీగా క్యాష్ ఆన్ డెలివరీలు.. దెబ్బకు ఊరు వదిలి జంప్!

Advertisement

ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఢిల్లీ స్పెషల్​ సెల్​ పోలీసులు.. సోషల్ మీడియాలోని వేర్వేరు ప్లాట్​ ఫాంలలో ఉన్న రెండు వందలకు పైగా పోస్టులను డిలీట్​ చేశారు. హ్యాండ్లర్లకు సంబంధించిన పలు అకౌంట్లను బ్లాక్​ చేశారు. అదే సమయంలో నాలుగు ఎఫ్​ఐఆర్​ లు జారీ చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళనలను మరింత తీవ్రతరం అయ్యేలా చేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచటానికి చేసిన కుట్రలో ఇది భాగమని పోలీసు వర్గాలు అంటున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మే ముందు, ఇతరులతో పంచుకునే ముందు ఒకటికి రెండుసార్లు ధృవీకరించుకోవాలని పోలీసులు సూచించారు.

Also Read: భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా

Tags

Related News

ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఊహించని షాక్.. ఇంటికి భారీగా క్యాష్ ఆన్ డెలివరీలు.. దెబ్బకు ఊరు వదిలి జంప్!

‘లద్దాఖ్ మాది.. మీ వాదన చెల్లదు’.. చైనా అభ్యంతరాలను తిప్పికొట్టిన కేంద్రం!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. సీజేఐకి రాసిన లేఖలో రాహుల్ గాంధీ షాకింగ్ అంశాల ప్రస్తావన!

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌.. మంత్రులకు వార్నింగ్‌!

క్యాన్సర్ మందులపై కేంద్రం కీలక నిర్ణయం.. మార్జిన్ 30 శాతానికి కట్!

నోటీసులు లేకుండానే ఓట్లు తొలగిస్తారా? సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలి!- కూనంనేని

రాహుల్ గాంధీ బృందాన్ని కలవని సీజేఐ.. కోర్టు పరిధిలోని అంశాలపై చర్చకు నో!

Big Stories

Advertisement
×