Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా పెద్దగా యాక్టివ్ గా ఉండరు. ఈయన ఏదైనా పోస్ట్ చేశారు అంటే ఆ పోస్ట్ వెనుక ఎంతో ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా ప్రభాస్ తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎలాంటి పోస్టులు చేయరు ఏదైనా సినిమాలకు మద్దతుగా ఈయన పోస్టులు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో భాగంగా చేసిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ప్రభాస్ చేసిన ఈ పోస్టుకు అర్థం ఏంటి? అంటూ అభిమానులు కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. మరి ప్రభాస్ చేసిన ఆ పోస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే…”ఈ రోజు కొంచెం రోమియోలా ఫీల్ అవుతున్నా.. నా జూలియట్ డార్లింగ్ ఎక్కడున్నావ్?” అంటూ రెడ్ హార్ట్ ఎమోజీతో ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రభాస్ నుంచి ఈ విధమైనటువంటి రొమాంటిక్ టచ్ పోస్ట్ బయటకు రావడంతో ఈయన పోస్ట్ వెనుక ఉన్న అర్థం ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు బహుశా ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే ఈ పోస్ట్ వేశారా? అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరికొందరు ఏదైనా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇలా పోస్ట్ చేశారా? అంటూ కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్ చేయడంతో మరోసారి తెరపైకి ఈయన పెళ్లికి సంబంధించిన వార్తల పట్ల చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభాస్ అని చెప్పాలి ఈయనతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన సెలబ్రిటీలు అందరూ కూడా పెళ్లి చేసుకుని వారి పిల్లల్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ప్రభాస్ మాత్రమే ఇప్పటికే సింగిల్ గా ఉండడంతో ప్రభాస్ పెళ్లి గురించి నిత్యం చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఈ పోస్ట్ చేయడంతో త్వరలోనే ఈయన పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే ఇలాంటి పోస్ట్ చేశారు అంటూ అభిమానులు భావిస్తున్నారు.
మరి ఈ పోస్ట్ వెనుక అర్థమేంటి అనేది తెలియాలి అంటే ప్రభాస్ స్పందించాల్సి ఉంది. ఇకపోతే ప్రభాస్ గతంలో అనుష్కతో ప్రేమలో ఉన్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలో నిజం కాదని కొట్టి పారేశారు. అనంతరం కృతి సనన్ తో ఎంగేజ్మెంట్ అయిందంటూ కూడా వార్తలు రావడంతో ఈ వార్తలను ప్రభాస్ టీం ఖండించారు. మరి నేడు ప్రభాస్ తాను రోమియోగా మారిపోయానని తన జూలియట్ ఎక్కడ అంటూ ప్రస్తావించడం గమనార్హం. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఫాజీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read: శ్రీకాంత్ ఓదెలను దాసరితో పోల్చిన మోహన్ బాబు.. గ్రేట్ డైరెక్టర్ అంటూ!