E-Paper
Advertisement

KA 2 లో హీరో ఎవరు.. అసలు విషయం బయటపెట్టిన కిరణ్ అబ్బవరం..

KA 2 లో హీరో ఎవరు.. అసలు విషయం బయటపెట్టిన కిరణ్ అబ్బవరం..
Advertisement

KA 2 Update: హీరో కిరణ్ అబ్బవరం నటించిన KA సినిమా.. ఈ హీరో కెరీర్‌లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు టాలీవుడ్‌లో ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ విజయంతో KA 2 పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ గురించి వస్తున్న వార్తలు అభిమానుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.

ఈరోజు లేకుండా సినిమా..!

Advertisement

ఇటీవల KA 2 సినిమా కిరణ్ అబ్బవరం లేకుండా తెరకెక్కించబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్త విన్న అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే మొదటి భాగంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకే సీక్వెల్‌లో కూడా ఆయన ఉంటారని అందరూ భావించారు.

హీరో ఎవరంటే..!

ఈ విషయంపై కిరణ్ అబ్బవరాన్ని ప్రశ్నించగా.. ఫైనల్ గా స్పందించారు. KA 2 గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఇప్పటివరకు సినిమా టీమ్ నుంచి ఎవరూ తనను సంప్రదించలేదని కూడా వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లో తాను భాగం కాదని స్పష్టంగా చెప్పారు.

Advertisement

ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అసలు హీరో లేకుండా సీక్వెల్ ఎలా తీస్తారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు సినిమా మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన కూడా రాలేదు. దీంతో ఈ విషయం మరింత సందేహంగా మారింది.

KA సినిమా ఒక ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. మిస్టరీ గ్రామం నేపథ్యంలో సాగిన ఈ కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కిరణ్ అబ్బవరం చేసిన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కథలోని సస్పెన్స్ అంశాలు కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతేకాకుండా కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ప్రశంసలు అందుకుంది.

ఈ నేపథ్యంలో KA 2 పై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే కథను కొనసాగిస్తూ మరింత ఆసక్తికరంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ కిరణ్ అబ్బవరం ఇందులో ఉంటారా లేదా అన్న విషయంలో క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై అనుమానాలు పెరుగుతున్నాయి.

మరి ఈ చిత్రంలో ఎలాంటి హీరోని సెలెక్ట్ చేసుకుని.. కథను ఎలా కొనసాగిస్తారు తెలుసుకోవాలి అంటే దర్శకుడు స్పందించే వరకు వేచి చూడాల్సిందే. మరోపక్క కిరణ్ అబ్బవరం వరకు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ హీరో చేస్తున్న చెన్నై లవ్ స్టోరీ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

ALSO READ: Niharika Konidela: ఇండస్ట్రీలో నిహారిక మరో కొత్త ప్రయోగం…మెగా ఫ్యామిలిలోనే మొదటి వ్యక్తిగా గుర్తింపు..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×