Niharika Konidela: నిహారిక మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక హీరోయిన్ అని చెప్పాలి. అప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ మొదటిసారి ఒక అమ్మాయి మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ గా వెండి తెరపై సందడి చేసిన ఘనత నిహారికకు దక్కిందని చెప్పాలి. ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా బుల్లితెర కార్యక్రమాలకు పని చేశారు. అనంతరం ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే నిహారికను హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయటానికి మెగా అభిమానులు కూడా ఇష్టపడలేదనే చెప్పాలి దీంతో ఈమె సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఇలా మూడు సినిమాలలో నటించిన నిహారిక మూడు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కానీ నేపథ్యంలో ఈమె సినిమాలకు హీరోయిన్ గా దూరమవుతు నిర్మాతగా స్థిరపడ్డారు. ఇదివరకు పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరించిన నిహారిక ఇప్పుడు సినిమాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే రాకాసా(Raakaasaa) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నిహారికకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత యాంకర్ గా పనిచేశారు నటిగా, నిర్మాతగా కూడా పనిచేశారు ఫ్యూచర్లో ఏమైనా డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు నిహారిక సమాధానం చెబుతూ.. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. సినిమా కోసం తాను ఏం నేర్చుకోవడానికైనా సిద్ధంగా ఉన్నానని 24 క్రాఫ్ట్స్ మీద తనకు అవగాహన ఉండాలని కోరుకుంటానని తెలిపారు. తనకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కచ్చితంగా అవగాహన ఉండి వాటి గురించి అన్ని విషయాలు నేర్చుకుంటే ఏదో ఒక రోజు డైరెక్టర్ గా కూడా మారుతానని ఈ సందర్భంగా నిహారిక తెలిపారు.
మొదటి డైరెక్టర్ గా నిహారిక గుర్తింపు..
యాంకర్ గా నటిగా నిర్మాతగా సక్సెస్ అందుకున్న ఈమె దర్శకురాలిగా కూడా మారుతానని, భవిష్యత్తులో మెగా ఫోన్ పట్టుకుంటానని చెప్పడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఒకవేళ నిహారిక దర్శకురాలు అయితే మెగా కాంపౌండ్ లోనే డైరెక్ట్ గా మారిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈమె డైరెక్టర్ గా మారే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే నిహారిక నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.
Also Read: Niharika Konidela: రామ్ చరణ్ కోసం కథను సిద్ధం చేసిన నిహారిక.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఆలస్యమా!