Aaruguru Pathivrathalu heroine :కొన్ని సినిమాలు కొన్ని రకాలుగా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పుడున్న చాలామంది యూత్ ను ఒకప్పుడు విపరీతంగా అట్రాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. అటువంటి సినిమాల్లో ఇవివి సత్యనారాయణ తెరకెక్కించిన ఆరుగురు పతివ్రతలు సినిమా ఒకటి. ఇవివి సత్యనారాయణ తీసిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం అని కూడా చెప్పొచ్చు. కథా పరంగా మాట్లాడుకుంటే ఇది ఒక మంచి సినిమా. కానీ సాధారణంగా ప్రేక్షకులు మంచి కంటే కూడా చెడుకు ఎక్కువగా కనెక్ట్ అవుతారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వేటగాడు వంటి సినిమా కూడా ఆకుచాటు పిందు తడిసే అనే పాట కోసమే ఎక్కువ శాతం మంది వెళ్లారు అని కొంతమంది అంటూ ఉంటారు. అలానే సుకుమార్ సినిమాల్లో కొన్ని ఐటెం సాంగ్స్ కి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆరుగురు పతివ్రతలు సినిమాల్లో కొన్ని సీన్స్ ఇప్పుడు చాలామంది వెతుక్కుని మరీ చూస్తూ ఉంటారు.
ఆరుగురు పతివ్రతలు హీరోయిన్ ఎక్కడ ఉంది.?
ఈ సినిమాలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు ఉంటారు. వాళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి అయితే వీరందరూ కొన్నేళ్ల తర్వాత కలిసినప్పుడు వీళ్ళ సమస్యలను చెబుతూ ఉంటారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించింది అమృత. ఈమె సీన్స్ ఆ సినిమాలో ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది యూత్ ఆ సీన్స్ ఇప్పుడు వెతుక్కుని మరి చూస్తూ ఉంటారు. అలానే ఇప్పటికీ ఆ హీరోయిన్ ఏం చేస్తుంది అని చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది. ఆవిడ ఎక్కడ ఉంటున్నారు అని సోషల్ మీడియా అకౌంట్స్ వెతికే ఆడియన్స్ కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆవిడ ఇప్పుడు సినిమాలు చేయడం లేదు.
సినిమాలు ఆపడానికి కారణం.?
ఆరుగురు పతివ్రతలు సినిమాలో ఆమె రోల్ గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆ రోల్ ఆ సినిమాలో చేసిన తర్వాత వరుసగా అదే పాత్రలు రావడం మొదలయ్యాయి. అందుకోసమే చాలా సినిమాలను రిజెక్ట్ చేశారు. ఆరుగురు పతివ్రతలు సినిమా కంటే ముందు దాదాపు నాలుగు సినిమాలు చేసిన కూడా పెద్దగా గుర్తింపు సాధించలేకపోయారు. అయితే ఒక్కసారిగా ఈ సినిమాతో గుర్తింపు రావడం జరిగింది. గుర్తింపు రావడం కూడా ఒక రకంగా అమృతకు శాపం అయిపోయింది. ప్రతి దర్శకుడు అదే పాత్రను అడగడంతో సినిమాలకు దూరమైపోయారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈవిడ ఎక్కడుంది అనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పటికీ కూడా చాలామంది ఎంక్వయిరీలు చేయడం మొదలుపెట్టారు.
Also Read : Kuberaa : కుబేరా సక్సెస్ పవన్ కళ్యాణ్ కు ప్లస్ పాయింట్