E-Paper
Advertisement

‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. యష్ ప్యాన్స్‌కు పండగే..

‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. యష్ ప్యాన్స్‌కు పండగే..
Advertisement

Yash Toxic Release: కన్నడ స్టార్ హీరో యాష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic: A Fairytale for Grown-Ups) సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా విడుదల తేదీపై వస్తున్న రకరకాల ఊహాగానాలకు ఈ ప్రకటనతో స్పష్టత వచ్చింది. నటుడు యష్ స్వయంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

Read also-Yoga Day Celebrities: యోగా డే స్పెషల్.. హీరోయిన్ల యోగ పోజులు..

Advertisement

పోస్టర్ పంచుకున్న యష్

కొత్తగా విడుదల చేసిన పోస్టర్‌లో యష్ రెడ్ కలర్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా ఇంటెన్స్ (తీవ్రమైన) లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను షేర్ చేస్తూ యష్, “Honour Thy Father… Toxic ప్రపంచవ్యాప్తంగా 26-08-2026 నుండి థియేటర్లలో. ToxicTheMovie” అని రాసుకొచ్చారు. ఫాదర్స్ డే రోజున ఈ అప్‌డేట్ రావడంతో అభిమానులు “డాడీ ఈజ్ కమింగ్ హోమ్” అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

ఈ సినిమా ప్రస్తుత తేదీకి రాకముందు కొన్నిసార్లు వాయిదా పడింది. మొదట ఈ చిత్రాన్ని మార్చి 19, 2026న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత జూన్ 4, 2026కి మార్చారు. చివరకు ఇప్పుడు ఆగస్టు 26ను ఫైనల్ చేశారు.

Read also-Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఇది భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయికంటే ఎక్కువగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా వంటి ప్రముఖ నటీమణులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో విడుదలైన గ్లింప్స్‌కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, సినిమాపై అంచనాలు మాత్రం చాలా భారీగా ఉన్నాయి.

Related News

ఈసారి అయినా హిట్ కొడతావా నితిన్?

రష్మికకు ఏం జరిగింది?.. ఇన్‌స్టా పోస్ట్‌తో అసలు నిజం బయటకు!

టార్చర్ పెట్టకండి.. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య అభ్యర్థన!

హీరోయిన్‌గా నందమూరి తేజస్విని.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

చిన్న విషయాలకే వణికిపోయే స్టార్ హీరోయిన్లు వీళ్లే!

పాన్ ఇండియా స్టార్ కావాలంటే.. ఇప్పుడు కత్తి పట్టాల్సిందేనా?

చిరంజీవిపై హీరో సుమన్ షాకింగ్ కామెంట్స్!

సౌత్ స్టైల్‌లో ‘స్పైడర్ మ్యాన్’కు పెళ్లి.. అతిథులుగా అవేంజర్స్, ఏం క్రియేషన్ భయ్యా!

Big Stories

Advertisement
×