E-Paper
Advertisement

వివాదాల్లో ఇరుక్కొని ఈ యంగ్ హీరోలు కెరియర్ పాడు చేసుకుంటున్నారా?

వివాదాల్లో ఇరుక్కొని ఈ యంగ్ హీరోలు కెరియర్ పాడు చేసుకుంటున్నారా?
Advertisement

Film industry:వెండితెరపై హీరోలుగా వెలిగిపోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీకి వస్తుంటారు కొందరు యంగ్ హీరోలు. కానీ, కాస్త క్రేజ్ రాగానే కొందరు తమ ప్రవర్తనతో వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. సామాన్యులతో గొడవలు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ చేజేతులా కెరియర్ పాడు చేసుకుంటున్నారు. తాజాగా ఒక డెలివరీ బాయ్‌పై హీరో అఖిల్ రాజ్ ఉద్దెమరి చేసిన దాడి ఉదంతం టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. అసలు ఈ యంగ్ హీరోలు ఎందుకు ఇలా తప్పుటడుగులు వేస్తున్నారు?

స్టార్‌డమ్ రాకముందే పెరిగిన అహంకారం:

ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలు హిట్ అవ్వగానే కొందరు యంగ్ హీరోలు తామేదో పెద్ద స్టార్లమనే భ్రమలో బతికేస్తున్నారు. బయట సమాజంలో ఎలా ప్రవర్తించాలో మర్చిపోతున్నారు. ఇక నటుడిగా నిలదొక్కుకోవడానికి క్రమశిక్షణ, ఓర్పు ఎంతో ముఖ్యం. కానీ, చిన్న విషయాలకే సహనం కోల్పోయి రోడ్లపై గొడవలకు దిగడం, సామాన్యులను చులకనగా చూడడం వల్ల వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.

డెలివరీ బాయ్‌పై దాడి.. వైరల్ వీడియోల రచ్చ:

Advertisement

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అఖిల్ రాజ్ ఉద్దెమరి ఉదంతమే దీనికి లేటెస్ట్ ఉదాహరణ. రాంగ్ అడ్రస్‌కు పార్సిల్ తెచ్చాడనే చిన్న కారణంతో ఒక డెలివరీ బాయ్‌పై భౌతిక దాడికి దిగడం విస్మయానికి గురిచేసింది. ఇక అతను క్షమాపణలు చెప్పినా వినకుండా కొట్టడానికి వెళ్లడం, హీరో తల్లి ఉమ్మివేయడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రవర్తన నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

గతంలోనూ ఇదే తీరు.. తనీష్, చంద్రహాస్ వివాదాలు:

కేవలం అఖిల్ రాజ్ మాత్రమే కాదు, గతంలో హీరో తనీష్ కూడా పబ్లిక్ ప్రదేశాల్లో గొడవలు, రోడ్డు ప్రమాదాల కేసులతో వార్తల్లో నిలిచారు. మరో యంగ్ హీరో చంద్రహాస్ తన సినిమా ప్రమోషన్లలో బూతు పాటలు వాడడమే కాకుండా, ప్రశ్నించిన జర్నలిస్టులను బెదిరించి పోలీస్ కేసు దాకా వెళ్లారు. ఇలాంటి ఘటనలు కొత్తగా వచ్చే హీరోల ఇమేజ్‌ను పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నాయి.

Advertisement

also read:హీరో మహేష్ బాబుకి భారీ షాక్..AMB తోపాటు మరో 5 థియేటర్ల పై భారీ వేటు!

చేజేతులా కెరియర్ పాడు చేసుకుంటున్న నటులు:

ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ముఖ్యమో, క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం. సామాన్య ప్రజలే కదా అని దౌర్జన్యం చేస్తే, అదే ప్రజలు రేపు సినిమా థియేటర్లకు రాకుండా బహిష్కరిస్తారనే నిజం వీరు గ్రహించాలి. ఇక సినిమా అవకాశాలు రాక ఎంతో మంది ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుంటే, వచ్చిన అవకాశాన్ని ఇలాంటి అనవసర వివాదాలతో, పోలీస్ కేసులతో పాడు చేసుకోవడం నిజంగా విచారకరం.

సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఇక సామాన్యులను గౌరవించినప్పుడే ఎవరైనా నిజమైన హీరో అనిపించుకుంటారు. ఇప్పటికైనా ఈ యంగ్ హీరోలు తమ తప్పులను తెలుసుకుని, ప్రవర్తన మార్చుకోకపోతే ఇండస్ట్రీలో నిలబడటం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.

Related News

సమంత కొత్త అవతారం.. ఈసారి వంటగదిలోకి స్టార్ హీరోయిన్!

సంక్రాంతికి స్టార్ హీరోల జాతర.. థియేటర్లు సరిపోతాయా గురూ?

‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’…. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ థ్రిల్లర్!

రక్తంతో తడిసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి అదిరిపోయే పోస్టర్.. ఫ్యాన్స్‌కు పండగే!

ఆగస్టు 15 వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. నిహారిక, లావణ్య స్పెషల్ అట్రాక్షన్

ఎర్ర కండువా.. చేతిలో తుపాకీ.. శ్రీ విష్ణు మాస్ లుక్ అదిరిపోయిందే!

ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. ‘సెయాన్’ అప్డేట్ వచ్చేసింది..

Big Stories

Advertisement
×