E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ షేక్.. ఏకంగా మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో వన్‌ప్లస్ N6 లాంచ్!

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ షేక్.. ఏకంగా మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో వన్‌ప్లస్ N6 లాంచ్!
Advertisement

OnePlus N6: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత్‌లో సరికొత్త N సిరీస్‌ను పరిచయం చేస్తూ ‘వన్ ప్లస్ N6’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తక్కువ బడ్జెట్‌లో కస్టమర్లను ఆకట్టుకోవడానికి తీసుకొచ్చిన ఈ ఫోన్.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నార్డ్ సిరీస్ కంటే తక్కువ ధరకే లభించనుంది. ముఖ్యంగా ఇందులో ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీని అందించడం విశేషం.

భారతీయ మార్కెట్లో వన్‌ప్లస్ N6 బేస్ వేరియంట్ (4GB RAM+128GB స్టోరేజ్) ధర రూ.22,999గా ఉంది. అలాగే 6GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా నిర్ణయించారు. అయితే అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్ కింద రూ.1,000 డిస్కౌంట్, అలాగే యాక్సిస్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. జూలై 4 నుంచి అమెజాన్‌లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇది ఫ్రెష్ మింట్, మిడ్‌నైట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Advertisement

Also Read: ఐకూ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఐకూ 16 అల్ట్రా రావడం లేదు, ఎందుకో తెలుసా?

ఈ ఫోన్ 6.75 ఇంచుల హెచ్‌డీ ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్, ముందు వైపు సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ డిజైన్ ఇచ్చారు. అంతేకాదు.. ధూళి, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ65 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కూడా దీనికి అందించారు.

Advertisement

ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేకమైన వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16తో పనిచేసే ఈ ఫోన్‌కు రెండేళ్ల మేజర్ ఓఎస్ అప్‌డేట్స్, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.

ఫోన్ వెనుక వైపు 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేసే 50MP సింగిల్ కెమెరా, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీని ద్వారా 1080p క్వాలిటీతో వీడియోలు రికార్డ్ చేయవచ్చు. ఇక ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ అయిన 8000mAh బ్యాటరీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల పాటు వస్తుందని కంపెనీ పేర్కొంది. దీని కోసం 45W ఫాస్ట్ ఛార్జింగ్, 6.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

Also Read: ఆఫర్ల వేట షురూ.. వన్‌ప్లస్ కొత్త టాబ్లెట్ కొంటే.. రూ.5,499 విలువైన గిఫ్ట్ ఉచితం!

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×