Gwalior: బాలీవుడ్ సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నాను మహిళలు అమితంగా ఇష్టపడేవారు. ఆయన స్టార్‌డమ్ ఏ రేంజ్ లో ఉండేదంటే.. ఆయన కారుపై లిప్‌స్టిక్‌తో ముద్దు గుర్తులు పెట్టేవారు. అలాంటి ఘటన ఒకటి గ్వాలియర్‌లో వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి సూపర్‌స్టార్ కాదండోయ్. కాకపోతే అతడి ప్రియురాలుతో తన కారుపై 3400 ముద్దు గుర్తులు పెట్టింది. ప్రియురాలు తన ప్రేమను వ్యక్త పరచడానికి చేసిన ఈ పని ఆ ప్రేమికుడ్ని మరింత కష్టాల్లోకి నెట్టేసింది.
సోషల్‌మీడియా వచ్చిన తర్వాత పని పాటా లేని కొందరు యువతీయువకులు సులువుగా డబ్బులు సంపాదించే మార్గాలను అన్వేషిస్తున్నారు. తన బుర్రకు పదును పెట్టడం మానేశారు. కేవలం లైక్స్, ఫాలోవర్స్‌ని పెంచుకునే ప్రయత్నంలో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఎక్కువ లైక్స్ పొందడం కోసం ఓ యువకుడు తన కారును కిస్సింగ్ కారుగా మార్చేశాడు.
కారు యజమాని- ప్రేమికుడు ఆదిత్య సికర్వార్.. తన ప్రియురాలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ విదేశీ ట్రెండ్‌కు సంబంధించిన వీడియో చూసింది. ఆ విషయాన్ని సదరు యువతి, తన ప్రియుడికి చెప్పింది. వెంటనే ఓ ఆలోచన గుర్తుకు వచ్చింది. దాన్ని తన ప్రియురాలితో షేర్ చేసుకున్నాడు. తన ప్రేమను ఈ విధంగా వ్యక్తపరచవచ్చని భావించింది.
ప్రియురాలు ఏకంగా 3 గంటల 30 నిమిషాలపాటు శ్రమించి కారు అంతటా 3,400 ముద్దు గుర్తులను క్రియేట్ చేసింది. అందుకోసం సదరు ప్రేమికుడు చాలా లిప్‌స్టిక్ ఉపయోగించాడు. దీంతో కారు అంతటా లిప్ స్టిక్ మరకలు పడ్డాయి. కారు వీధుల్లోకి వచ్చినప్పుడు అది చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఫలితంగా ఆ ప్రేమికుడు చిక్కుల్లో పడ్డాడు.
ముద్దుల గుర్తులతో ఉన్న MP07 CC 9452 నంబరు కారును పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. కారుని చూసిన పోలీసులు ఏకంగా రూ. 5500 ట్రాఫిక్ విధించారు. గోలా మందిర్ ట్రాఫిక్ పోలీసులు కారు ఓనర్-ప్రియుడిపై చర్య తీసుకున్నారు. చివరకు చేసేది ఏమీలేక సదరు ప్రేమికుడు జరిమానా చెల్లించాడు. చివరకు గంటల తరబడి ఓ గుడ్డతో కారు చుట్టూ ఉన్న ముద్దులను చెరిపేశాడు.
అంతేకాదు కారు కిటికీలకు అంటించిన నల్లటి ఫిల్మ్‌ను తొలగించారు పోలీసులు. ఈ ప్రక్రియ తర్వాత పోలీసులు కారును స్టేషన్ నుండి వెళ్ళడానికి అనుమతించారు. దీనికి సంబంధించి ఆ యువకుడు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. వేగంగా వైరలైన ఆ వీడియో ఒక్క రోజులో సుమారు 55 లక్షల మంది వీక్షించారు.
కారు యజమాని ఆదిత్య సికర్వార్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తాడని పోలీసులు తెలిపారు. అలాంటి రీల్ చేయడం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమని తాను గ్రహించలేదన్నాడు. భవిష్యత్తులో ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తానని, అలాంటి తప్పు చేయనని పోలీసులకు తెలిపాడు ఆదిత్య.
ALSO READ: కుంభమేళా ఖర్చులో 0.1% చాలు.. వందలాది స్కూళ్లను కాపాడొచ్చు.. సుప్రీంకోర్టు జడ్జి సంచలనం!