E-Paper
Advertisement

ఫార్చ్యూనర్ కారులో వచ్చి.. రోడ్లు ఊడుస్తున్న పారిశుధ్య కార్మికుడు.. అస్సలు తగ్గేదేలే!

ఫార్చ్యూనర్ కారులో వచ్చి.. రోడ్లు ఊడుస్తున్న పారిశుధ్య కార్మికుడు.. అస్సలు తగ్గేదేలే!
Advertisement

Sanitation Worker: సాధారణంగా పారిశుధ్య కార్మికుల జీవితాలు ఎన్నో కష్టాలతో నిండి ఉంటాయని చాలా మంది భావిస్తుంటారు. మోటార్ సైకిల్ కూడా కొనుక్కునే స్థితిలో వారు ఉండరని అభిప్రాయపడుతుంటారు. అలాంటిది ఓ కార్మికుడు.. ఏకంగా ఫార్చ్యూనర్ కారులో విధులకు వస్తూ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. రోజుకు కేవలం రూ.50 కూలీతో మెుదలైన అతడి జీవితం.. ఖరీదైన కార్లలో తిరిగే స్థాయికి ఎలా వచ్చిందో ఈ కథనంలో చూద్దాం.

తొలినాళ్లలో పూట గడవటమే కష్టం..

కర్ణాటకలోని బంట్వాళ్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న శేషప్ప అనే పారిశుధ్య కార్మికుడు.. టొయోటా ఫార్చ్యునర్ కారులో నిత్యం విధులకు హాజరవుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. కష్టపడే మనస్తత్వం, కలలను నిజం చేసుకోవాలనే పట్టుదల ఉంటే పేదరికం ఏమాత్రం అడ్డంకి కాదని ఆయన నిరూపిస్తున్నారు. శేషప్ప విషయానికి వస్తే.. బంట్వాళ్ తాలూకాలోని నవూర్ కి చెందిన ఆయన 1996లో రోజూవారి వేతనానికి మున్సిపాలిటీలో చేరారు. ప్రారంభంలో ఆయన రోజుకు 50 రూపాయలు మాత్రమే సంపాదించేవారు. ఆ సమయంలో పూట గడవడమే కష్టంగా ఉండేది.

Advertisement

సైకిల్ నుంచి కార్లు కొనే స్థాయికి..

శేషప్ప తొలి ఐదేళ్లు విధులకు వెళ్లడానికి సైకిల్‌ను మాత్రమే ఉపయోగించారు. అయితే రోడ్డు పక్కన చెత్త ఊడుస్తున్న సమయంలో రోడ్డుపై వెళ్లే కార్లను చూస్తూ.. ఎప్పటికైనా తన కుటుంబంతో కలిసి కారులో ప్రయాణించాలని కలలు కనేవారు. ఈ క్రమంలో మున్సిపాలిటీలో శాశ్వత ఉద్యోగిగా మారిన శేషప్ప.. తన కల నెరవేర్చుకోవడానికి అప్పులు చేస్తూ అడుగులు వేశారు. మొదట ‘మారుతి 800’ కారును కొనుగోలు చేసిన ఆయన.. తర్వాత దానిని ఇచ్చేసి ‘మారుతి ఓమ్ని’ తీసుకున్నారు. ఆ తర్వాత వరుసగా స్విఫ్ట్, ఆల్టో కార్లను వాడారు. తన కుమారుడి కోసం ‘స్కార్పియో’ కారును కూడా కొన్నారు.

ఫార్య్చూనర్ కారులో డ్యూటీకి..

Advertisement

ఇటీవల ఆ స్కార్పియోను ఎక్స్ఛేంజ్ చేసి.. సెకండ్ హ్యాండ్ 2013 మోడల్ ‘టొయోటా ఫార్చ్యూనర్’ కారును సొంతం చేసుకున్నారు. అయితే తాను కొనుగోలు చేసిన కార్లు అన్నీ.. బ్యాంక్ లోన్లు, ఈఎంఐల పద్ధతిలోనే తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఫార్చ్యూనర్ కారు ఉన్నప్పటికీ శేషప్ప తన మూలాలను, కష్టపడే తత్వాన్ని మర్చిపోలేదు. ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకే డ్యూటీ ఎక్కి.. మధ్యాహ్నం 12 గంటల వరకు రోడ్లు ఊడ్చడం, ఇతర పారిశుధ్య పనులు చేయడం వంటివి చేస్తున్నారు.

ఇంటి వద్ద పశువుల పెంపకం

మున్సిపాలిటీ విధులు ముగిసిన తర్వాత కూడా శేషప్ప ఏమాత్రం ఖాళీగా ఉండటం లేదు. మధ్యాహ్నం నుంచి వేరే కూలీ పనులకు ఆయన వెళ్తున్నారు. అంతేకాకుండా ఇంటి వద్ద పశువుల పెంపకం, పంచాయతీ పరిధిలో మంచినీటి సరఫరా పనుల్లో సాయం చేస్తూ అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. అలా వచ్చిన డబ్బుతో బ్యాంక్ రుణాలు, నెల నెలా ఈఎంఐ చెల్లింపులు చేస్తున్నారు.

Also Read: జోగి రమేష్ చిలక పలుకులు.. ఫ్యామిలీ మేటర్‌ని రాజకీయం చేయొద్దు, ప్లీజ్ అంటూ

ఫ్యామిలీ నేపథ్యం..

శేషప్ప ఫ్యామిలీ నేపథ్యానికి వస్తే.. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు ‘దైవ నేమ’ (తులునాడు సాంప్రదాయ కళ) ప్రదర్శనలలో పాల్గొంటుండగా.. ఒక కుమార్తె ఉద్యోగం చేస్తోంది. మరొక కుమార్తె చదువుకుంటోంది. మెుత్తంగా కష్టపడి సంపాదిస్తూ అప్పులు తీరుస్తూనే తన కలల కారులో డ్యూటీకి వస్తున్న శేషప్ప ప్రయాణం.. స్థానికులకు, తోటి ఉద్యోగులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోందని చెప్పవచ్చు.

Also Read: పట్టు బిగిస్తున్న బ్యాంకు యూనియన్లు, దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపు, ఐదు రోజులతోపాటు

Tags

Related News

భర్తపై భార్య కాళికారూపం.. గొంతుపై కాలు పెట్టి పిల్లలతో కలిసి, ఒడిషాలో షాకింగ్ ఘటన

మెట్రో పనుల సమీపంలో కుంగిన రోడ్డు.. గుంతలో పడి బోల్తా కొట్టిన కారు

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

నడిరోడ్డుపై పడుకుని ప్రియాంక నిరసన.. రాహుల్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు, ఢిల్లీలో హైటెన్షన్!

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హిందూ పద్ధతిలో పెళ్లి.. 6 నెలల తర్వాత బయటపడ్డ భర్త అసలు రంగు!

Big Stories

Advertisement
×