Chhattisgarh Encounter: ఛత్తీస్ గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో జరిగిన కాల్పుల్లో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అందులో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం.
సుక్మాజిల్లాలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా సిబ్బంధి మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేస్తుండగా ఎదురుకాల్పులు జరిగాయి. సుమారు మూడు గంటలపాటు భీరక యుద్ధం జరిగింది. ఊహించని రీతిలో పీఎల్ జీఏ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా భద్రతా బలగాల్లు అంచెలంచెలుగా మావోయిస్టులను చుట్టుముట్టి కాల్పుల జరిపాయి. ఒక ప్లేస్‌లో నలుగురు, మరో ప్లేస్‌లో నలుగురు మొత్తం.. పది మంది నక్సల్స్ మృతి దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ బస్తర్, పి సుందర్‌రాజ్ తెలిపారు.
AK-47, ఇతర ఆయుధాలతో పాటు ఒక INSAS, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్‌ను కూడా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే పారిపోయిన మావోస్టులు పలువురు గాయాలతో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కనీసం 257 మంది మావోస్టులు మరణించగా, 861 మందిని అరెస్టు చేశారు. 789 మంది లొంగిపోయారు. మొత్తం మృతుల సంఖ్య చూస్తే.. 2010లో అత్యధికంగా 1,005 నుండి 90 శాతం తగ్గి 2024 సెప్టెంబర్ నాటికి 96కి చేరుకుంది.
Also Read: అదానీ అవినీతిలో ప్రధాని మోడీ భాగస్వామ్యం.. రాహుల్ ఆరోపణలు.. మండిపడిన బిజేపీ
2026 నాటికి ఛత్తీస్‌గఢ్ పూర్తిగా మావోస్టుల నుండి విముక్తి పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి భద్రతా బలగాలు ఏకకాలంలో ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.