Century Old Tractor: ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు.. పాత తరం నాటి వస్తువులు కనిపిస్తేచాలు దాన్ని కంటిన్యూగా చూడాలనిపిస్తుంది. దాని నైపుణ్యాలు ఆ విధంగా ఉండేవి. వాటిని చూస్తే ఇప్పటికీ షాక్ కావాల్సిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ బరేలీలో పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడింది వందేళ్ల నాటి పాత ట్రాక్టర్. దాని అద్భుతమైన ఇంజనీరింగ్ చూడాల్సిందే. ఎందుకంటే ఆ రేంజ్‌లో ఉంది ట్రాక్టర్.
దేశంలో వందేళ్ల నాటి ట్రాక్టర్ కనుగొన్నారు. మరి దాని లోతుల్లోకి ఒక్కసారి వెళ్లొద్దాం. యూపీలోని బరేలిలో రోహిల్‌ఖండ్ మున్సిపల్ శాఖ సిబ్బంది పాత ట్రాక్టర్‌ని గుర్తించారు. రోహిల్‌ఖండ్ కాలువ శాఖ కార్యాలయం సమీపంలో దీన్ని గుర్తించారు. తొలుత స్క్రాప్‌గా భావించారు. ఆ తర్వాత ట్రాక్టర్ అద్భుతమైన ఇంజనీరింగ్ చూసి షాకయ్యారు.
తొలుత కొందరు ఉద్యోగులు డివిజన్ ఆఫీస్ వెనుక గడ్డిలో ఒక ఇనుప బొమ్మ పడి ఉందన్నారు. అదేదో చెత్త అయి ఉండవచ్చని అనుకున్నారు. దగ్గరగా వెళ్లి చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. బ్రిటిష్ వారి నిజమైన ఇంజనీరింగ్ కు ఇదొక నిదర్శనంగా చెబుతున్నారు. ఆ తర్వాత తవ్వకాలు జరిపారు. చివరకు ఈ విధంగా బయటకు వచ్చింది.
పొదలు, గడ్డి కింద దాగి ఉన్న 100 సంవత్సరాల కిందట బ్రిటిష్ ఉపయోగించే ఆవిరితో నడిచే బొగ్గు ట్రాక్టర్ ఇది. వందేళ్ల కాలం నాటి వస్తువు అంటే చెప్పనక్కర్లేదు. కచ్చితంగా బ్రిటిషర్స్ హయాంలో ఉన్నవే. భారతదేశాన్ని బ్రిటిష్ పాలించే రోజుల్లో బ్రిటన్ నుంచి తీసుకువచ్చిన వాటిలో ట్రాక్టర్ కూడా ఒకటి.
ALSO READ: ముంబైలో హై రైజ్‌లో మంటలు.. 23వ అంతస్తుల భవనంలో ప్రమాదం
వారి పనులు వేగంగా అయ్యేందుకు బ్రిటీష్ పాలనలో ఇలాంటి 8 ట్రాక్టర్లను దేశానికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. శతాబ్దం కిందట ఆవిరి శక్తితో నడిచేది బొగ్గు ట్రాక్టర్. కాలువ, రోడ్డు నిర్మాణం, లోతైన దున్నడం, పంట నూర్పిడిలో ఉపయోగించేవారని అంటున్నారు అధికారులు. పురాతన వస్తువు కావడంతో ఈ ట్రాక్టర్ విలువ దాదాపు రూ.4 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు.
దీనిని పునరుద్ధరించి మ్యూజియం ప్రదర్శనకు ఉంచనున్నారు. వందేళ్లయినా ట్రాక్టర్ ఇప్పటికీ పనిచేసే స్థితిలో ఉందని అన్నారు. భారతదేశంలో మొట్టమొదటి ఉపయోగించిన ట్రాక్టర్ ఇదేనని అంటున్నారు. ఈ అరుదైన ఆవిష్కరణను ప్రజలు చూడటానికి ఇంజిన్‌ను శుభ్రం చేసి పెయింట్ చేసి కంటోన్మెంట్‌లోని తనిఖీ భవనం ముందు ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు.
100 సంవత్సరాల కిందట అంటే సుమారు 1920ల్లో ఆవిరితో నడిచే ఇంజిన్‌ల నుండి గ్యాసోలిన్ ఇంజిన్‌ల వైపు మారుతున్న కాలం అది. ఈ సమయంలో ట్రాక్టర్‌లు వ్యవసాయంలోకి ఎంట్రీ ఇచ్చాయి. మొదట్లో స్టీమ్ ఇంజన్‌లతో పనులు చేసేవారు. ఆ తర్వాత గ్యాసోలిన్ ఇంజిన్‌లతో వచ్చాయి.
1924 లో రకరకాల మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక ట్రాక్టర్లతో పోలిస్తే అప్పటి ట్రాక్టర్ల నిర్మాణం చాలా సులభంగా ఉండేవి. ఆటో-మూవర్ వ్యవసాయానికి తేలికైన ట్రాక్టర్‌లను పరిచయం చేసింది. పవర్ టేక్-ఆఫ్‌ను ఉపయోగించిన మొదటి ట్రాక్టర్. నాణ్యత, ధృడమైన, ఖరీదైన ట్రాక్టర్‌గా 1919లో విడుదలైంది.
ఇది 100 ఏళ్ల క్రితం ట్రాక్టర్..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడిన 100 సంవత్సరాల నాటి పాత ట్రాక్టర్
ఆవిరితో నడిచే ఈ ట్రాక్టర్‌ను పొలాలు దున్నడానికి, కాలువల నిర్మాణంలో సామాగ్రిని తరలించడానికి వాడేవారట
బ్రిటీష్ పాలనలో ఇలాంటి 8 ట్రాక్టర్లను… pic.twitter.com/wg4IyTlYRk
— BIG TV Breaking News (@bigtvtelugu) September 8, 2025